Waitress gets Rs 7 lakh in tips: సాధారణంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్లితే టిప్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎక్కువ మంది వంద రూపాయలలోపే టిప్పుగా ఇస్తారు. చాలా రేర్‌గా ఎవరో కొందరు మాత్రమే వేలు టిప్పుగా ఇస్తారు. కానీ ఇక్కడొక వెయిటర్‌కి లక్షల్లో టిప్పు లభించింది.
(చదవండి: గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నా.. విమానాన్ని హైజాక్ చేస్తున్నా!)
అసలు విషయంలోకెళ్లితే..విలయమ్స్ అనే మహిళ ఒక రోజు రెస్టారెంట్‌కి వెళ్లుతుంది. అయితే ఆ రెస్టారెంట్‌లో పనిచేసే జాజ్మిన్ కాస్టిల్లో అనే మహిళా వెయిటర్ విలయమ్స్‌కి ఆహారం సర్వ్ చేస్తుంది. అయితే విలియమ్స్‌కి సదరు వెయిటర్ పనితీరు నచ్చి ఆమె తను తిన్నదానికి 30 డాలర్లు(రూ. 2,271), ఆమెకు $40 డాలర్లు(3,082)లు టిప్పు ఇస్తుంది. అంతే వెయిటర్ కాస్టిల్లో సదరు కస్టమర్ ఉదారతకు ఉప్పొంగిపోతుంది. అంతేకాదు కాస్టిల్లో ఆమె రోజు ఇక్కడకు వచ్చి పనిచేయడం వల్ల తన కూతుర్ని డే కేర్‌లో పెట్టాల్సి వస్తుందని, పైగా తాను ఉద్యోగం మానేయలనకుంటున్నట్లు కూడా చెబుతుంది.
ఈ మేరకు విలయమ్స్ సదురు వెయిటర్‌కి సాయం చేసి అక్కడితో వదిలేయదు. అంతేకాదు ఆ వెయిటర్ పేరు మీద క్యాష్ యాప్‌ని ఓపెన్ చేస్తుంది. అంతేకాదు సదరు వెయిటర్ గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఎవరికి వీలైనంత వారు సాయం చేయండి అంటూ కోరుతుంది. అయితే ఈ విషయాలు ఏమీ సదరు వెయిటర్‌కి తెలియవు.
అయితే సదరు వెయిటర్‌కి అదేపనిగా డబ్లులు అకౌంట్‌లో పడినట్లుగా వస్తుంటుంది. ఆ వెయిటర్ తనకు క్యాష్ యాప్‌లాంటి వాటిల్లో తాను రిజస్టర్ చేసుకోలేదు కదా అనుకుంటుంది. ఈ మేరకు అలా మెసేజ్‌లు రావడం మాత్రం ఆగదు. దీంతో ఆమె ఒక్కసారిగా అనుమానంతో చెక్‌చేస్తుంది. అంతే ఆమె అకౌంట్‌లో అపరిచితుల నుంచి దాదాపు రూ. 7లక్షలు టిప్పు వస్తుంది. అంతే వెయిటర్ జాజ్మిన్ కాస్టిల్లో ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. తనకు డబ్బులు పంపిన వారందరికి కృతజ్ఞతలు తెలపడమే కాక తనకు ఇంత మంచి సాయం చేసిన సదరు కస్టమర్ విలయమ్స్‌కి చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది.
(చదవండి: క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!)
Comments
Please login to add a commentAdd a comment