చికాగోలో ఘనంగా సంక్రాంతి, రిపబ్లిక్‌ డే వేడుకలు! | TTA Chicago Sankranti And Republic Day Celebrations | Sakshi
Sakshi News home page

చికాగోలో ఘనంగా సంక్రాంతి, రిపబ్లిక్‌ డే వేడుకలు!

Published Wed, Jan 31 2024 3:10 PM | Last Updated on Fri, Feb 2 2024 9:44 AM

TTA Chicago Sankranti And Republic Day Celebrations - Sakshi

అమెరికాలోని చికాగోలో తెలుగువారు సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌’ స్థానిక హిందూ టెంపుల్‌ ఆఫ్‌ లేక్‌ కౌంటీ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సంస్థ అధ్యక్షుడు హేమంత్‌ పప్పు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక అందంగా అలంకరించిన వేదిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సంగీత, నాట్య కార్యక్రమాలు అలరించాయి. సంస్థ ప్రతినిధులు, సభ్యులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు.

ఈ వేడుకల్లో 300 మందికిపైగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ వేడుకలను పురస్కరించుకుని స్థానిక కళాకారులచే ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి.

ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌కు పలువురు ప్రముఖులు సర్టిఫికెట్లు అందజేసి, ప్రోత్సహించారు. పలు సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ నిర్వహించిన ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్ సభ్యులను పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థకు అండగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: ఫ్లోరిడాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు)

👆

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement