చికాగో: వర్తమాన ఆంధ్ర దేశంలో రాజకీయ వేత్తగా, ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రజాసేవకుడు, గాంధీతత్త్వ ప్రచారకునిగా, రచయిత, సంపాదకునిగా సమున్నత స్థానాన్ని సంపాదించుకున్న మండలి బుద్ధ ప్రసాద్‌ను చికాగోలోని భారతీ తీర్థ సంస్థ ఘనంగా సన్మానించింది. సేవా భారతి బిరుదను ప్రదానం చేసింది. అక్టోబర్ 2 మహత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన చికాగోలో జరుగుతున్న పలు సభలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారతీ తీర్థ సంస్థ ఆయనను ఆహ్వానించింది. సంగీత సాహిత్య రంగాలలో పేరు పొందిన చికాగో వాసి డాక్టర్ శొంఠి శారదా పూర్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. అమెరికాలో వివిధ రంగాల్లో సేవలందిస్తూ పేరు పొందిన డా. తాతా ప్రకాశం ‘సేవా భారతి’ బిరుదును ఆయనకు అందించారు.
అనంతరం ప్రముఖ భాషావేత్త కోరాడ రామకృష్ణయ్య, ప్రపంచ భాషావేత్తలలో ఉత్తమ స్థానం పొందిన ప్రొఫెసర్ డా. కోరాడ మహాదేవ శాస్త్రి, గాంధేయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్రోద్యమవాది ఆనంద మార్గ అధ్యక్షులు డా సుసర్ల గోపాల శాస్త్రి, ప్రముఖ సాహితీవేత్త విజయనగర విఖ్యాత తాతా సుబ్బరాయ శాస్త్రి తదితరులు ఈ సన్మాన సభలో ప్రసంగించారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికాలో తెలుగు వారు చేస్తున్న సాంఘిక, రాజకీయ, సాహిత్య సేవలను ఆయన అభినందించారు. తెలుగు భాష విదేశాల్లోనే వెలుగు చూస్తోందని పేర్కొన్నారు.
కాగా ఆంధ్ర దేశానికి చెందిన ‘నియోగి’ 111మంది విశిష్ఠ వ్యక్తుల గురించి రాసిన ‘అక్షర నక్షత్రాలు’గ్రంథాన్ని ఈ కార్యాక్రమంలో ఆవిష్కరించారు. గ్రంథ ఆవిష్కరణ తర్వాత తాజా మాజీ అధ్యక్షులు డా. జంపాల చౌదరి, చికాగో తెలుగు సాహితీ అధ్యక్షులు జయదేవ రెడ్డి, స్వప్నా వ్యవస్థాపక అధ్యక్షులు డా. శొంఠితో పాటు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం మిస్ జూడిత్ మండలి బుద్ధ ప్రసాద్‌కు ప్రత్యేక గుర్తింపు ప్రశంస పత్రాన్ని అందించగా. నేపర్విల్ అక్టోబర్ 26, 2019ని ప్రత్యేక రోజుగా గుర్తిస్తూ ఆయన పేరు మీద గుర్తింపు పంత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment