
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రియతమ నాయకుడి జన్మదినం పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న సీఎం.. ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన విషయం తెలిసిందే. చదవండి: జగనన్నకు పుట్టినరోజు బహుమతి ఇదే: ఆర్‌కే రోజా
అదే విధంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక పాటను సాక్షి టీవీలో ఆవిష్కరించారు. ‘ఒక నిజం జన్మించిన రోజు.. ఒక తేజం ఉదయించిన రోజు.. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు’ అంటూ సాగే ఈ పాటలో వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి నేటి వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అందించిన సంక్షేమ పాలన, సాధించిన ఘనతను కీర్తిస్తూ కొనసాగింది. ప్రస్తుతం ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment