ఉర్రూతలూగిస్తున్న ‘జగనన్న అజెండా’ పాట  | Jagananna Agenda Song That Is Shaking Social Media | Sakshi
Sakshi News home page

Jagananna Agenda Song: ఉర్రూతలూగిస్తున్న ‘జగనన్న అజెండా’ పాట 

Published Sun, Jan 14 2024 8:58 AM | Last Updated on Sun, Jan 14 2024 11:00 AM

Jagananna Agenda Song That Is Shaking Social Media - Sakshi

సాక్షి, అమరావతి: ‘జగనన్న అజెండా’ పేరుతో విడుదలైన వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. శనివారం విడుదలైన ఈ పాట యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాట వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాంలపై విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. ‘‘మీబిడ్డ ఒక్కడే ఒక వైపు ఉన్నాడు.. చెప్పుకోవడానికి ఏమీ లేని వాళ్లంతా ఏకం అవుతున్నారు.

మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి, మీరే సైనికులుగా కదలండి’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వాయిస్‌తో మొదలయ్యే ఈ పాటను నల్లగొండ గద్దర్‌ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. భళిరా.. భళిభళిరా.. పులివెందుల్లో పుట్టిందా పులిరా.. అంటూ సాగే పాటకు యువత గళం కలుపుతూ మైమరిచిపోతున్నారు.

‘జెండలు జతకట్టడమే మీ (టీడీపీ, జనసేన) అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్‌ అజెండా’ అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో పాట ఆసాంతం సాగింది. ‘జగనన్న కనెక్ట్స్‌’ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ పాట అందుబాటులో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement