సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నాడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్. ఇప్పుడు సాక్షి టీవీ ద్వారా ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాంతో మన ముందుకు రానున్నాడు. ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సత్తి స్టైల్లో అదిరిపోయేలా ఉన్న వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. బిత్తిరి సత్తి, సాక్షి టీవీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ‘గరం గరం వార్తలు’ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సాక్షి టీవీలోకి సత్తి ఆగమనాన్ని సెలబ్రేట్ చేస్తూ విడుదల చేసిన తొలి ప్రోమోకు కూడా మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment