అన్‌స్టాపబుల్ (Unstoppable with NBK) ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ఇదివరకే ఆరు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ కోసం విక్టరీ వెంకటేశ్ (Venkatesh) వచ్చారు. ఈయన లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam). ఈ మూవీ సంగతులతో పాటు బోలెడన్ని విషయాల్ని పంచుకున్నారు. హోస్ట్ బాలకృష్ణతో కలిసి వెంకీ ఫుల్ సందడి చేశారు. వెంకీతో పాటు ఈయన అన్నయ్య సురేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కూడా ఇదే ఎపిసోడ్‌లో పాల్గొన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోనే టాప్ సిరీస్.. రెండో సీజన్ చూసేందుకు సిద్ధమా?)
లేటెస్ట్‌గా రిలీజైన ప్రోమోలో వెంకీ, బాలకృష్ణ ఒకరి సినిమాకు మరొకరు హైప్ ఇచ్చుకున్నారు. వెంకటేష్ 'డాకు మహారాజ్' (Daaku Maharaj) అని హైప్ ఇవ్వగా, బాలకృష్ణ అందుకొని 'నా మనసులో నువ్వే మహారాజ్' అని డైలాగ్ వేశారు. ఆ తర్వాత గతాన్ని గుర్తు తెచ్చుకుని మాట్లాడుకున్నారు. 'రాముడు మంచి బాలుడు' అనే డైలాగ్ చెప్పి బాలయ్య సిగ్గుపడుతుంటే.. వెంకటేష్ అందుకుని 'హలో కొంపతీసి నువ్వా రాముడు?' అని సెటైర్ వేశారు. ఆ వెంటనే బాలయ్య.. 'అలా భయపెట్టిస్తే ఎలా' అని పంచ్ వేశారు.
ఇదే షోలో వెంకటేశ్.. నాగచైతన్య, రానాతో తనకున్న బాండింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సోదరుడు సురేశ్ బాబు కూడా షోకి వచ్చారు. వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యారు. డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు పూర్తి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్)
Comments
Please login to add a commentAdd a comment