ఆహాలో నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’టాక్ షో(Unstoppable with NBK) నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. గత మూడు సీజన్ల మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ టాక్ షోలో పాల్గొని తమ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన చాలా విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా బాలయ్య టాక్ షోలో హీరో వెంకటేశ్(Venkatesh) సందడి చేశాడు. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానం ఇచ్చాడు. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఈ సందర్భంగా బొబ్బిలి రాజా(Bobbili Raja) సినిమాలో కొండ చిలువను పట్టుకునే ఓ ఫోటోను చూపించి, ‘ఇది నిజమైన పాములతో తీశారా లేదా గ్రాఫిక్స్‌తో మ్యానేజ్ చేశారా;’ అని బాలకృష్ణ అడగ్గా.. వెంకీ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఆ సినిమాలో ఒకటి కాదు ఏకంగా వంద పాములతో కలిసి ఆ సీన్ చేశానని చెప్పడంతో బాలకృష్ణతో పాటు షోలో కూర్చున్న ఆడియన్స్ కూడా షాకయ్యారు.
‘బొబ్బిలి రాజా సినిమా అంటే మా అన్నయ్యకు చాలా ఇష్టం. అందులో కొండ చిలువను పట్టుకునే సీన్ ఓ హాలీవుడ్ సినిమా నుంచి రిఫరెన్స్‌గా తీసుకున్నాం. మొదట ఆ సీన్ నేను చేయగలనా అని భయపడ్డాను. కానీ చివరకు ధైర్యం తెచ్చుకొని ఆ పాములు ఉన్న గదిలో దూకాను. అక్కడ ఉన్న పాములు పట్టే అబ్బాయి నా మీద పాములు వేశాడు. అప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అది చాలా గొప్ప అనుభవం’ అని వెంకటేశ్ చెప్పుకొచ్చాడు.
ఇక సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చావని బాలయ్య అడగ్గా.. ‘నాకు సినిమాల్లోకి రావడం ఇష్టమే లేదు. హీరో అవుతానని అనుకోలేదు. విదేశాల్లో చదుకొని.. అక్కడే స్థిరపడాలి అనుకున్నాను. 1986లో ఇండియాకు తిరిగి వచ్చాక ఏదైనా బిజినెస్ చేద్దామనుకున్నాను. కానీ కుదర్లేదు. అనుకోకుండా ‘కలియుగ పాండవులు’తో నటుడిగా మారాను’ అని వెంకటేశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment