సాక్షి టీవీపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కక్ష సాధింపు చర్యలకు దిగింది.
సాక్షి, నంద్యాల: సాక్షి టీవీపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఆగష్టు 3వ తేదీ నుంచి నంద్యాలలో సాక్షి టీవీ ప్రసారాలకు టీడీపీ తరచూ అంతరాయలను కల్పించింది. భూమా నాగిరెడ్డి కుటుంబానికి చెందిన 'నంద్యాల డిజిటల్ కేబుల్' పట్టణంలో ఎన్నికల వేళ ఓట్లర ముందుకు సాక్షి టీవీ ప్రసారాలను రాకుండా నిలిపేసింది.
సాక్షి టీవీ ప్రత్యక్ష ప్రసారాలను www.sakshi.com సైట్‌లో వీక్షించొచ్చు. యూట్యూబ్‌లో www.youtube.com/sakshitvlive సాక్షి టీవీని చూడొచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో సాక్షి యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను తిలకించొచ్చు.