ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన విషయాన్ని జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన విషయాన్ని జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ను బుధవారం జర్నలిస్టులు కలిసి ఈ అంశాన్ని వివరించారు.
ఏపీ ప్రభుత్వం ఎంఎస్వోలను బెదిరించి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిందని జర్నలిస్టులు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.