union minister of state for Information Broadcasting
-
ఎల్రక్టానిక్స్ తయారీ 4 రెట్లు అప్..
గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ నాలుగు రెట్లు పెరిగి రూ. 8.22 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో తెలిపారు. ఇది 2026 నాటికి రూ. 23.95 లక్షల కోట్లకు చేరనుందన్నారు. 2013–14లో ఎలక్ట్రానిక్స్ తయారీ రూ. 1.80 లక్షల కోట్లుగా ఉండేదని మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఉపయోగిస్తున్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో 99.2 శాతం దేశీయంగా తయారైనవే ఉంటున్నాయని ఆయన వివరించారు. 2022–23లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువ చేసే మొబైల్స్‌ను ఎగుమతి చేసినట్లు చంద్రశేఖర్ చెప్పారు. భారత్ ఎలక్ట్రానిక్స్‌ను దిగుమతి చేసుకునే దేశం స్థాయి నుంచి ఎగుమతి చేసే దేశం స్థాయికి ఎదిగిందన్నారు. -
కేంద్ర మంత్రి దృష్టికి సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత అంశం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన విషయాన్ని జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను బుధవారం జర్నలిస్టులు కలిసి ఈ అంశాన్ని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఎంఎస్‌వోలను బెదిరించి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిందని జర్నలిస్టులు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.