సాక్షి, హైదరాబాద్: మీ దగ్గర పెన్ను ఉందా? అందులో ఏమైనా కత్తి పెట్టుకొచ్చారా.. మీ దగ్గర దువ్వెన ఉందా? దువ్వెనలో కత్తి ఉందా.. మీ దగ్గర సిగరెట్ ఉందా? అగ్గిపెట్టె కూడా ఉందా.. అంటూ శాసన మండలి బడ్జెట్ సమావేశాలను మంగళవారం కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను భద్రతా సిబ్బంది ప్రశ్నించారు.
మండలి ప్రవేశ ద్వారం వద్ద జర్నలిస్టులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పోలీసులు అనంతరం లోపలికి అనుమతించే సమయంలో ఇలా ప్రశ్నలు అడిగారు. దీంతో కొందరు జర్నలిస్టులు పోలీసుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాత భవనంలో మండలి సమావేశం..
రాష్ట్ర శాసన మండలి సమావేశాలు తొలిసారిగా మండలి పాత భవనంలో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో మండలి సమావేశాలకు ఉపయోగించిన భవనాన్ని రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఏపీ శాసనసభ, మండలి సమావేశాలను అమరావతికి తరలించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కేటాయించిన శాసనసభ, మండలి భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment