భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీపై మాయని మచ్చ ఎమర్జెన్సీ. దీని వల్ల భారత ప్రజలకు, ముఖ్యంగా జర్నలిస్టుల ఆగ్రహానికి గురైంది. దీని కారణంగా ఆమె పార్టీ ఘోరంగా తదుపరి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కూడా. ఆ టైంలో మళ్లీ మీడియా ముందుకుగానీ జర్నలిస్టులను ఎదుర్కొడం గానీ చేయలేక ఏ నాయకుడు లేదా నాయకురాలైనా ఇబ్బంది పడతారు. కానీ తన తప్పును అంగీకరిస్తూ మీడియాను ఎదుర్కొవడమే కాదు జర్నలిస్టులు ఆవేశంతో సంధించే ప్రశ్నల బాణాలకు బెదరకుండా తనదైన శైలిలో సమాధానంచెప్పి వారి కోపాన్ని ఉపశమించేలా చేసింది. వారి ముఖాల్లో నవ్వు తెప్పించి మరో ప్రశ్న తావివ్వకుండా చేసి "దటీజ్ ఇందిరా" అనుపించుకుంది. నేడు ఇందిరాగాంధీ వర్ధంతి(అక్టోబర్ 31) సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం.
నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా విధించిన అత్యవసర పరిస్థితి లేదా ఎమర్జెన్సీని 71 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కాలంగా అభివర్ణిస్తారు. అప్పటి రాష్ట్రపతి ఫకృదీన్ అలీ "ప్రబలిన అంతర్గత కలవరం" అని పేర్కొంటూ ఉత్తర్వు జారీ చేయడంతో భారతదేశ ప్రజలు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోపయారు. ఈ ఎమర్జెన్సీ 1977 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాల వరకు కొనసాగింది. దీని కారణంగా ఆమె తదుపరి ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యి పదవినీ కోల్పోయింది. సరిగ్గా ఆ టైంలో ఆగ్రహావేశాలతో విదేశీ జర్నలిస్టులు ఆమె వద్దకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించే యత్నం చేశారు. ఆ సమయంలో తన సంయమనాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా వారిని ఎదర్కొవడమే గాక ఆమె చేసిన వ్యాఖ్యలు విలేకరులను మరో ప్రశ్న అడగకుండా చేసి తనకు సాటి లేరని నిరూపించింది.
ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..
ఆ విదేశీ విలేకరులంతా చాలా ఆగ్రహంగా..మీరు విధించిన ఎమర్జెన్సీతో పొందిన ప్రయోజనం ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు. వాళ్లంతా ఆమె ఏం చెబుతుందా అన్నట్లు అందరూ కళ్లు పెద్దవిగా చేసుకుని చెవులు రిక్కరించి మరీ కుతూహులంగా చూస్తున్నారు. ఆమె చాలా స్థైర్యంతో ఓటమిని ఒప్పుకుంటూ..తాము భారతీయ ప్రజలలోని అన్ని వర్గాలను సమగ్రంగా దూరం చేసుకున్నాం లేదా దూరం చేయగలిగాను అని తెలుసుకున్నా అని చెప్పారు ఇందిరా గాంధీ. ఆ వ్యాఖ్యకు ఒక్కసారిగా జర్నలిస్టులంతా పెద్దగా నవ్వారు. ఆ తర్వాత చాలా నిశబ్ధం..అంతా కామ్ అయిపోయి మళ్లీ మరో ప్రశ్న కూడా వేయకుండా వెనుదిరిగారు. ఆమె మాట్లాడిన తీరు విలేకరుల మనసులను ద్రవింపచేసింది. 1978లో జనిగిన ఈ ఆసక్తికర విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017లో తన వీడ్కోలు ప్రసంగంలో పంచుకున్నారు. ఆవిడ ఆ టైంలో కూడా ధైర్యంగా తన ఓటమిని అంగీకరిస్తూ.. మాట్లాడిన మాటలు జర్నలిస్ట్‌ల ముఖాల్లో నవ్వు తెప్పించినా..వారి ప్రశ్న పరంపరకు అడ్డుకట్ట వేయగలిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంలో జవహర్ లాల్ తరుచుగా చెప్పే వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు ప్రణబ్. "మార్పు" కొనసాగింపు, సమతుల్యత ఎప్పుడూ ఉంటుందని నెహ్రు తరుచుగా చెప్పేవారని అన్నారు.
నాయకురాలిగా ఆమె విధానం..
1971 నాటికి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా పూర్తి ఆధిక్యతను సాధించింది. అలాగే తన పార్టీలోని తన ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేయడంతో 1949లో కాంగ్రెస్ ఓ, ఆర్ అనే రెండు గ్రూప్‌లగా విడిపోయింది. కాంగ్రెస్(ఆర్) అంటే ఇందిరకు అనుకూలమైన మంత్రులని, ఓ అంటే ఆర్గనైజేషన్, సిండికేట్ గా పేరొందిన కాంగ్రెస్ పాతనేతలు కింద విడిపోయింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోనూ, పార్టీ ఎంపీల్లోనూ ఎక్కువభాగం ప్రధాని ఇందిర పక్షం వహించారు. అలాగే తన మాట చెల్లించుకునేలా హఠాత్తుగా ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చి ప్రత్యర్థులను షాక్ గురిచేసేది.
ఇక 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు, గరీబీ హఠావో! వంటి నినాదాలు ఇందిరకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే అగర్భ శత్రువైనా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంతో ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌గా ఏర్పరిచి పాకిస్తాన్‌ని చావుదెబ్బ కొట్టింది.
అందుకుగానే భారతర్న పురస్కారాన్ని అందుకుంది. అలాగే ఆమెకు మంచి ఎకనమిస్ట్ , భారత సామ్రాజ్ఞి వంటి బిరుదులు అందుకుంది. నియంతలా వ్యవహరిస్తున్నారు అన్న ప్రత్యర్థుల చేతే దుర్గ, చండి వంటి ప్రశంసలు అదుకుంది. ఆమె ప్రధానిగా 1966 నుంచి 1977 వరకు, మళ్లీ 1980 నుంచి 1984లో ఆమె హత్యకు గురయ్యేంత వరకు భారతదేశానికి మూడవ ప్రధానిగా సేవలందించారు. ఆమె దూకుడుగా తీసుకున్న ఎమర్జెన్సీ విధింపు నిర్ణయమే ఆమె జీవితంలో చెరగని మచ్చగా మిగిలిందని చెప్పాలి.
(చదవండి: వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?)
Comments
Please login to add a commentAdd a comment