laugh
-
‘తల్లీ నిర్మల’.. ఖర్గే మాటలతో రాజ్యసభలో నవ్వులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం(జులై 24) బడ్జెట్‌పై చర్చ సందర్భంగా నవ్వులు పూశాయి. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ను ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ‘మాతాజీ’ అని సంబోధించారు.వెంటనే చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుని ఆమె మీకు కూతురులాంటిది అని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా విరగబడినవ్వారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి కేవలం బిహార్, ఏపీల ప్లేట్లలోనే జిలేబి, పకోడి వడ్డించారని, మిగతా రాష్ట్రాల ప్లేట్లన్నీ ఖాళీగానే ఉన్నాయని ఖర్గే అన్నారు. ఇంతలో ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడతారని చైర్మన్ ఖర్గేతో అన్నారు. మాతాజీ నిర్మల మాట్లాడడంలో మంచి నేర్పరి..నేను మాట్లాడడం అయిన తర్వాత ఆమెను మాట్లాడమనండి అని ఖర్గే చైర్మన్‌ను కోరారు. దీనికి స్పందించిన చైర్మన్ ఆమె మీకు కూతురులాంటిది అనడంతో సభలో నవ్వులు పూశాయి. -
కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వుతామో తెలుసా!
కితకితలు పెడుతున్నారనంగానే నవ్వు ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది. ముఖ్యంగా చిన్నిపిల్లల ఏడుపు ఆపించాలనుకున్నప్పుడూ కితకితలు పెడుతుంటా. జస్ట్ అలా పెట్టేందుకు యత్నించంగానే నవ్వు తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆపుకోవడం కష్టం కూడా. అయితే మనంతట మనం పెట్టుకుంటే నవ్వు రాదు. అవతలివాళ్లు పెడితేనే నవ్వు వస్తుంది. ఎందుకిలా? అస్సలు కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వు వస్తుంది?. తదితర ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం! ఇలా చక్కిలిగింతలు పెట్టగానే నవ్వడానికి వెనుకున్న సైన్స్ ఉందంట. సాక్షాత్తు ఎవల్యూషనరీ బయాలజిస్టులు, న్యూరో సైటింస్టులే చక్కిలగింతలు పెడితే కచ్చితంగా నవ్వుతామని, దాని వెనుకు ఉన్న కారణాలను కూడా వివరించారు. సున్నితమైన స్పర్శను అనుభవించినపుడు మెదడులోని హైపోథాలమనస్ ప్రాంతం నవ్వమని ఆదేశాలు ఇస్తుందిట. చేతుల క్రింద, గొంతు దగ్గర, పాదాల క్రింద చక్కిలిగింతలు పెడితే నవ్వు ఆపుకోలేం. అందుకే కితకితలు పెడితే అరవడం, విదిలించుకోవడం, ఎగరడం వంటివి చేస్తుంటాం. అయితే కొందరిలో చక్కిలిగింతలు ఇష్టపడరు. వారిలో నాడులు తీవ్రమైన ఒత్తిడికి లోనై కోపం ప్రదర్శిస్తారు. నవ్వు ఎలా వస్తుంది? మన శరీరంపై ఎవరైనా కితకితలు (చక్కిలిగింతలు) పెడితే, వాటి వల్ల కలిగే అనుభవాన్ని మెదడులోని రెండు ప్రదేశాలు పంచుకుంటాయి. అందులో ఒకటి సొమాటో సెన్సరీ కార్టెక్స్. ఇది శరీరానికి స్పర్శజ్ఞానం కలుగజేస్తుంది. రెండోది ఏంటీరియర్ సింగులేట్ కార్టెక్స్. ఇది ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఈ రెండు అనుభూతుల వల్ల మనం సిగ్గుపడుతూ, నవ్వుతాము. మనకై మనం చక్కిలిగింత పెట్టుకున్నప్పుడు ఈ రెండు ప్రదేశాలు అంతగా ఉత్తేజం చెందవు. మనకు మనం పెటుకుంటే నవ్వు ఎందుకు రాదంటే.. మెదడు వెనుక భాగంలో ఉన్న చిన్న మెదడు మీకు మీరే కితకితలు పెట్టుకోబోతున్నారని ముందుగానే మెదడుకి సంకేతాలు ఇస్తుంది. దాని వల్ల మెదడు సరైన సంకేతాలు ఇవ్వదట. అందుకే మనకి మనం కితకితలు పెట్టుకుంటే నవ్వు రాదట. పిల్లల్ని ఆట పట్టిస్తూ చక్కిలిగింతలు పెడతారు. వారిలో నవ్వడం నేర్పడానికి అలా చేస్తారు. నవ్వు అనేది ఒక అంటువ్యాధిలా అంతటా ఆవరిస్తుంది. ఒకరు నవ్వడం ప్రారంభిస్తే ఆ ప్రదేశంలో ఉన్నవారంతా నవ్వుతారు. నవ్వు వల్ల సమాజంలో మంచి సానుకూల బంధాలు ఏర్పడతాయి. చక్కిలిగింతల రకాలు 1897 లో ఇద్దరు శాస్త్రవేత్తలు చక్కిలిగింతల మీద పరిశోధన చేసారట. చక్కిలిగింతలు రెండు రకాలుగా ఉంటాయట. చర్మం మీద చిన్న కదలిక వల్ల కలిగే చక్కిలిగింత మొదటి రకానికి చెందింది. దీని వలన నవ్వు రాకపోగా చిరాకు కలగచ్చు. చక్కిలిగింతలు పుట్టే చోట పదే పదే సున్నితంగా తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు, ఇవి రెండవ రకానికి చెందిన చెక్కిలిగింతలు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు, నాలుగు వేల కోట్లు..) -
ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు
భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీపై మాయని మచ్చ ఎమర్జెన్సీ. దీని వల్ల భారత ప్రజలకు, ముఖ్యంగా జర్నలిస్టుల ఆగ్రహానికి గురైంది. దీని కారణంగా ఆమె పార్టీ ఘోరంగా తదుపరి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కూడా. ఆ టైంలో మళ్లీ మీడియా ముందుకుగానీ జర్నలిస్టులను ఎదుర్కొడం గానీ చేయలేక ఏ నాయకుడు లేదా నాయకురాలైనా ఇబ్బంది పడతారు. కానీ తన తప్పును అంగీకరిస్తూ మీడియాను ఎదుర్కొవడమే కాదు జర్నలిస్టులు ఆవేశంతో సంధించే ప్రశ్నల బాణాలకు బెదరకుండా తనదైన శైలిలో సమాధానంచెప్పి వారి కోపాన్ని ఉపశమించేలా చేసింది. వారి ముఖాల్లో నవ్వు తెప్పించి మరో ప్రశ్న తావివ్వకుండా చేసి "దటీజ్ ఇందిరా" అనుపించుకుంది. నేడు ఇందిరాగాంధీ వర్ధంతి(అక్టోబర్ 31) సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా విధించిన అత్యవసర పరిస్థితి లేదా ఎమర్జెన్సీని 71 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కాలంగా అభివర్ణిస్తారు. అప్పటి రాష్ట్రపతి ఫకృదీన్ అలీ "ప్రబలిన అంతర్గత కలవరం" అని పేర్కొంటూ ఉత్తర్వు జారీ చేయడంతో భారతదేశ ప్రజలు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోపయారు. ఈ ఎమర్జెన్సీ 1977 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాల వరకు కొనసాగింది. దీని కారణంగా ఆమె తదుపరి ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యి పదవినీ కోల్పోయింది. సరిగ్గా ఆ టైంలో ఆగ్రహావేశాలతో విదేశీ జర్నలిస్టులు ఆమె వద్దకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించే యత్నం చేశారు. ఆ సమయంలో తన సంయమనాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా వారిని ఎదర్కొవడమే గాక ఆమె చేసిన వ్యాఖ్యలు విలేకరులను మరో ప్రశ్న అడగకుండా చేసి తనకు సాటి లేరని నిరూపించింది. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ఆ విదేశీ విలేకరులంతా చాలా ఆగ్రహంగా..మీరు విధించిన ఎమర్జెన్సీతో పొందిన ప్రయోజనం ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు. వాళ్లంతా ఆమె ఏం చెబుతుందా అన్నట్లు అందరూ కళ్లు పెద్దవిగా చేసుకుని చెవులు రిక్కరించి మరీ కుతూహులంగా చూస్తున్నారు. ఆమె చాలా స్థైర్యంతో ఓటమిని ఒప్పుకుంటూ..తాము భారతీయ ప్రజలలోని అన్ని వర్గాలను సమగ్రంగా దూరం చేసుకున్నాం లేదా దూరం చేయగలిగాను అని తెలుసుకున్నా అని చెప్పారు ఇందిరా గాంధీ. ఆ వ్యాఖ్యకు ఒక్కసారిగా జర్నలిస్టులంతా పెద్దగా నవ్వారు. ఆ తర్వాత చాలా నిశబ్ధం..అంతా కామ్ అయిపోయి మళ్లీ మరో ప్రశ్న కూడా వేయకుండా వెనుదిరిగారు. ఆమె మాట్లాడిన తీరు విలేకరుల మనసులను ద్రవింపచేసింది. 1978లో జనిగిన ఈ ఆసక్తికర విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017లో తన వీడ్కోలు ప్రసంగంలో పంచుకున్నారు. ఆవిడ ఆ టైంలో కూడా ధైర్యంగా తన ఓటమిని అంగీకరిస్తూ.. మాట్లాడిన మాటలు జర్నలిస్ట్‌ల ముఖాల్లో నవ్వు తెప్పించినా..వారి ప్రశ్న పరంపరకు అడ్డుకట్ట వేయగలిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంలో జవహర్ లాల్ తరుచుగా చెప్పే వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు ప్రణబ్. "మార్పు" కొనసాగింపు, సమతుల్యత ఎప్పుడూ ఉంటుందని నెహ్రు తరుచుగా చెప్పేవారని అన్నారు. నాయకురాలిగా ఆమె విధానం.. 1971 నాటికి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా పూర్తి ఆధిక్యతను సాధించింది. అలాగే తన పార్టీలోని తన ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేయడంతో 1949లో కాంగ్రెస్ ఓ, ఆర్ అనే రెండు గ్రూప్‌లగా విడిపోయింది. కాంగ్రెస్(ఆర్) అంటే ఇందిరకు అనుకూలమైన మంత్రులని, ఓ అంటే ఆర్గనైజేషన్, సిండికేట్ గా పేరొందిన కాంగ్రెస్ పాతనేతలు కింద విడిపోయింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోనూ, పార్టీ ఎంపీల్లోనూ ఎక్కువభాగం ప్రధాని ఇందిర పక్షం వహించారు. అలాగే తన మాట చెల్లించుకునేలా హఠాత్తుగా ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చి ప్రత్యర్థులను షాక్ గురిచేసేది. ఇక 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు, గరీబీ హఠావో! వంటి నినాదాలు ఇందిరకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే అగర్భ శత్రువైనా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంతో ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌గా ఏర్పరిచి పాకిస్తాన్‌ని చావుదెబ్బ కొట్టింది. అందుకుగానే భారతర్న పురస్కారాన్ని అందుకుంది. అలాగే ఆమెకు మంచి ఎకనమిస్ట్ , భారత సామ్రాజ్ఞి వంటి బిరుదులు అందుకుంది. నియంతలా వ్యవహరిస్తున్నారు అన్న ప్రత్యర్థుల చేతే దుర్గ, చండి వంటి ప్రశంసలు అదుకుంది. ఆమె ప్రధానిగా 1966 నుంచి 1977 వరకు, మళ్లీ 1980 నుంచి 1984లో ఆమె హత్యకు గురయ్యేంత వరకు భారతదేశానికి మూడవ ప్రధానిగా సేవలందించారు. ఆమె దూకుడుగా తీసుకున్న ఎమర్జెన్సీ విధింపు నిర్ణయమే ఆమె జీవితంలో చెరగని మచ్చగా మిగిలిందని చెప్పాలి. (చదవండి: వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?) -
వింత రిజిగ్నేషన్ లెటర్.. విస్తుపోతూ, నవ్వును కంట్రోల్ చేసుకోలేక..
నేటి రోజుల్లో చాలామంది వర్క్ కల్చర్‌లో వినోదానికి పెద్దపీట వేస్తున్నారు. చివరికి ఉద్యోగానికి రిజైన్ చేసే విషయంలోనూ దానికి వినోదాన్ని జోడిస్తున్నారు. తాజాగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ అత్యంత విచిత్రమైన రీతిలో రిజిగ్నేషన్ లెటర్ రూపొందించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని చూసినవారెవరూ నవ్వకుండా ఉండలేరు. ట్విట్టర్లో షేర్ అయిన ఈ పోస్టులో ఇన్‌స్టామార్ట్‌లో లభ్యమయ్యే అన్ని స్నాక్ ఐటమ్స్‌ను ఉపయోగించి ఆ సంస్థ రిజిగ్నేషన్ లెటర్ తయారు చేసింది. ఈ పోస్టుకు 90 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి.అలాగే లెక్కకు మించిన కామెంట్లు వస్తున్నాయి. ఈ రిజిగ్నేషన్ లెటర్ చాలామందిని ఆకట్టుకుంది. మరికొందరు దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. రాజీనామా లాంటి సీరియస్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఈ పోస్టులో చెప్పిన మాదిరిగానే తమన రిజిగ్నేషన్‌ను సెలబ్రేట్ చేసుకుంటామని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మంచం కింద మొసలి.. మంచంపైన ఇంటి యజమాని.. తెల్లారి కళ్లు తెరవగానే.. how to quit your job using Instamart 🚶♀️ pic.twitter.com/CyhSDyvWaq — Swiggy Instamart (@SwiggyInstamart) July 24, 2023 -
ఆపకుండా గట్టిగా నవ్వితే చనిపోతారా? ఇందులో నిజమెంతంటే...
ఆనందం కలిగినప్పుడు ఎవరైనా నవ్వుతుండటం సహజమే. ఆ ఆనందం కాస్త ఎక్కువైనప్పుడు పగలబడి నవ్వుతుండటం కూడా చూసేవుంటాం. కొన్ని సినిమాల్లో నవ్వుతూ చనిపోయే పాత్రలు కూడా కనిపిస్తాయి. వీటిని చూసినప్పుడు నిజజీవితంలో కూడా ఇలా జరుగుతుందా? అనే అనుమానం కలుగుతుంది. అవును.. ఇది నిజమే.. నిజజీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇది వినడానికి అతిశయోక్తిగానే అనిపించవచ్చు. కానీ ముమ్మాటికీ నిజం. ఆపకుండా నవ్వడం చావుకు ఎలా కారణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నవ్వుతున్నవారిలో కొన్ని విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అతిగా నవ్వడం వలన మరణం సంభవించడమనేది చాలా అరుదుగా జరిగే ఘటన. దీనికి సంబంధించి కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన తొలిసారిదని చెబుతారు. ఇది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్ధంలో చోటుకుందని చెబుతారు. Chrysippus అనే గ్రీకు తత్వవేత్త మరణం 2 కారణాలుగా జరిగిందని చెబుతారు. దానిలో మొదటిది అతను అధికంగా మద్యం తాగడం వలన సంభవించిందని అంటారు. ఇక రెండవ అంశానికి వస్తే.. అతను ఒక గాడిదకు ఏదో తినిపించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు అతను వ్యంగ్యంగా ‘ఇప్పుడు గాడిదకు మద్యం తాగిపించాలి’ అని అనుకుంటూ పెద్దపెట్టున నవ్వుతూ చనిపోయాడని చెబుతారు. నేటి ఆధునిక కాలంలోనూ ఇటువంటి ఘటన కనిపిస్తుంది. 1975లో అలెక్సా మిషెల్ అనే బ్రిటీషర్ ‘ది గాడీస్’ అనే పాపులర్ కామెడీ చూస్తున్నాడు. ఈ సమయంలో అతను ఆపకుండా 30 నిముషాల పాటు నవ్వుతూనే ఉన్నాడు. తరువాత నేలకు ఒరిగిపోయాడు. ఇదేవిధంగా 2003లో థాయిల్యాండ్‌కు చెందిన ఒక ఐస్‌క్రీమ్ ట్రక్ డ్రైవర్ నిద్రలో పెద్దపెట్టున నవ్వసాగాడు. అతని పక్కనే పడుకున్న అతని భార్య అతనిని లేపేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతని ప్రాణం పోయింది. మనదేశంలోనూ ఇటువంటి ఘటన జరిగింది. 2013లో మహారాష్ట్రలో 22 ఏళ్ల ఒక యువకుడు మంగేష్ బోగల్ తన స్నేహితునితోపాటు ‘గ్రాండ్ మస్తీ’ అనే కామెడీ సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తూ గట్టిగా నవ్వుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన గురించి అతని పక్కన కూర్చున్నవారు మాట్లాడుతూ మంగేష్ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాడన్నారు. ఈ కారణంగానే అతనికి గుండెపోటు వచ్చిందని తెలిపారు. కాగా అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశీలనగా చూస్తే ఈ ఉదంతాల్లో అతిగా నవ్వడం వలన వారు మృతి చెందలేదు. ఈ సంఘటనల్లో నవ్వుతున్నప్పుడు వారికి శ్వాసలో ఇబ్బంది ఏర్పడటమో లేక గుండెపోటు రావడమో జరిగి మరణించారు. నిజానికి నవ్వడం అనేది ఆరోగ్య లక్షణం. వైద్యులు కూడా నవ్వుతూ ఉండాలని అందరికీ సలహా ఇస్తుంటారు. నవ్వుతుండటం వలన మన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతుంటారు. అయితే మన శరీరంలో నిరంతరం అంతర్గత అవయవాల కార్యకలాపాలు జరుగుతుంటాయి. గట్టిగా ఎక్కువసేపు నవ్వడం వలన కొందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికైనా గట్టిగా నవ్వుతున్నప్పుడు శారీకరంగా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుక అంటేనే ఆహ్లాదకరంగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేదికపైనే నవ్వూలు పూయించే ఘటనలు జరుగతుంటాయి. అక్కడున్న వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వేలా చేస్తాయి. ఓ విహవా వేడుకలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కొత్త పెళ్లి కొడుక్కు తన జీవిత భాగస్వామి ముందే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అతడ్ని చూసి ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం గమనించలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లతో పాటు పెళ్లికూతురు కూడా నవ్వడంతో వెంటనే తేరుకుని ప్యాంటు పైకి లాక్కున్నాడు. ఈ సమయంలో అతను సిగ్గుపడటం చూసి పెళ్లికి వచ్చిన వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ये दूल्हे के साथ क्या हो गया !!! 😂😂😂😂😂😂😂 pic.twitter.com/RSELxUTzQ9 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023 ఈ వీడియోపై స్పందిస్తూ.. పాపం ఈ పెళ్లికొడుకుకు ఏమైంది? అని నెటిజన్ నవ్వులు పూయించాడు. ప్యాంటు లూస్‌గా ఉన్నట్టుంది బ్రో.. కొంచెం చూసుకోవాలి కదా అంటూ మరో యూజర్ చమత్కరించాడు. అయ్యో.. పెళ్లికూతురు ముందు పరువుపాయే.. మున్ముందైనా జర చూసుకో.. అంటు మరో యూజర్ సలహా ఇచ్చాడు. చదవండి: ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి.. -
ఐక్యరాజ్యసమితి: ట్రంప్ ప్రసంగం మధ్యలో నవ్వులు
-
నవ్వు...ఆనందపు పువ్వు
జపాన్ శాస్త్రవేత్త యోజి కిమూరా అభిప్రాయంలో నవ్వు ఒక ఆయుధం. నవ్వుతో ప్రపంచ యుద్ధాలను నివారించవచ్చట. ఆయన నవ్వుల్ని కొలిచే ఒక పరికరాన్ని కనుగొన్నాడు. నవ్వుల కొలమానంలో ఒక యూనిట్‌ని 'aH' అని యోజి కిమూరా పేర్కొన్నారు. చిన్నపిల్లలు హాయిగా, స్వేచ్ఛగా నవ్వుతారు. సెకనుకి వారు అనేక 'aH'ల నవ్వును పూయిస్తారట. ఒసాకాలోని కాన్సాయి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే యోజి కిమూరా నవ్వుల్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు. పెద్దవారు స్వేచ్ఛగా నవ్వరు. పెద్దవారు లñ క్కగట్టి, మితంగా నవ్వుతారు. నవ్వటం అనేది, కంప్యూటర్లో ‘రీస్టార్ట్’ ఫంక్షన్ వంటిదంటారాయన. మానవ జీవన పరిణామంలో హాయిగా నవ్వటం చాలా ముఖ్యమైనది. ఈయన సిద్ధాంతం ప్రకారం నవ్వులో నాలుగు ప్రధాన దశలున్నాయి. అవి– కాస్తంత హాయిగా నవ్వటం, మామూలు స్థితి నుండి వేరు కావటం, పూర్తి హాయిగా నవ్వటం, నవ్వుల్ని పకపకా నవ్వటం. మనిషి మెదడులో నవ్వే సర్క్యూట్ ఉంది. అదే ఈ నవ్వటంలో ఉండే దశల్ని నిర్దేశిస్తుంది. మనిషి నవ్వుల్ని లెక్కకట్టటానికి ఈయన మనిషి కడుపు చర్మానికి ‘సెన్సర్ల’ను (గుర్తించే పరికరాలు) అతికించి పెడ్తాడు. మనిషి శరీరంలో సెకనుకి 3000 సార్లు ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లను, తద్వారా వచ్చే శరీర కదలికలను సెన్సర్ల యంత్రం రికార్డ్ చేస్తుంది. నవ్వుల్ని కొలిచే పరికరాన్ని మొబైల్ ఫోన్ అంత సైజులో తయారు చేయాలని ఆశ పడుతున్నారు. దీన్ని హెల్త్ పరికరంగాను, వినోద పరికరంగాను మార్కెట్ చేయాలని ఆయన ఉద్దేశం. -
నవ్విస్తే విజయం మీదే!
న్యూయార్క్: నవ్వడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండట మే కాదు.. ఆయుష్షు కూడా పెరుగుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. అయితే హాస్య చతురత కేవలం ఆయుష్షును మాత్రమే కాదు, వ్యక్తిలో పోటీతత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ.. ఉన్నతస్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుందట. సాధారణంగా ఆఫీసులో వాతావరణం గంభీరంగా ఉంటుంది. బాస్ ఏమంటారోనని ఉద్యోగులు పెద్దగా మాట్లాడుకోరు.. జోకులు వేసుకోరు. కానీ.. ఆఫీసులో జోకులు వేస్తూ సరదాగా గడిపేవారు బాగా పని చేయడంతోపాటు.. పోటీతత్వాన్ని కలిగి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. వార్టన్ స్కూల్ అండ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు సరదాగా, గంభీరంగా 457మందిపై ఎనిమిది రకాల పరీక్షలు నిర్వహించింది. కొన్ని జోకులను వారికి చెప్పి ప్రేక్షకులకు చెప్పమన్నారు. అయితే హాస్యచతురత ఉన్నవాళ్లు చెప్పిన జోకులకు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. కొందరు వేసిన జోకులకు ఎవరూ నవ్వలేదట. తర్వాత వారిని విశ్లేషిస్తే.. బాగా నవ్వించిన వారిలో ఆత్మస్థైర్యం, పోటీతత్వం ఎక్కువగా ఉన్నాయట. అంతేకాదు.. అందులో చాలా మంది గ్రూపు లీడర్లుగా ఎన్నికైనవారున్నారట. -
నాడు మోదీది ఎంత చక్కటి నవ్వో
న్యూఢిల్లీ: దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు పరస్పరం జోకులేసుకోవడం, వాటికి పగలబడి నవ్వడం చాలా అరుదు. ఇక ప్రసంగాల విషయానికొస్తే అరవీర భయంకరుల్లా గంభీరోపన్యాసాలిస్తారు. అప్పడప్పుడు మాత్రమే భావోద్వేగంతో ప్రసంగాన్ని రక్తికట్టిస్తారు. హాస్యానికి అవకాశం ఇవ్వరు. ఇక మన ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంభీరంగా ప్రసంగించడంలో మొదటి నుంచి ఆరితేరిన వారు. ‘మీ ఉపన్యాసాలన్నీ హాస్యం లేకుండా ఎందుకంత గాంభీర్యంగా సాగుతాయి?’ అని ఓ దశాబ్దం క్రితం ఓ టీవీషోకు హాజరైన నరేంద్ర మోదీని ప్రశ్నించగా, ‘రాజకీయ నాయకుల ప్రజా జీవితంలో హాస్యం చోటులేదన్న భయం నాకుంది. చాలా మందికి అలాంటి భయం ఉంటుంది. అలాగే నాకు అలాంటి భయం ఉంది’ అని సమాధానమిచ్చారు. ప్రసంగాల్లో తన గాంభీర్యానికి కారణం చెప్పిన మోదీ అదే టీవీ షోలో చాలా ఉల్లాసంగా, చాలా చక్కగా నవ్వుతూ తనలో కూడా హాస్యం ఉందని చాటి చెప్పారు. ‘మీరు బీజేపీ పార్టీని వదిలిపెట్టాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఖాళీ వుంటే వచ్చి చేరుతారా?’ అని అదే షోలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ప్రశ్నించగా, ‘నేను సంఘ్ పరివార్ నుంచి వచ్చాను. నా వల్ల మీకు ఎన్నో సమస్యలు వస్తాయి’ అంటూ ఆయన నవ్వారు. ఈ షోలో పాల్గొన్నప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా లేరు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అప్పుడు జైరామ్ రమేష్, మోదీలు యువకులుగానే ఉన్నారు. వారిద్దరితో జర్నలిస్ట్ వీర్ సాంఘ్వీ నిర్వహించిన టీవీ షోకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టీవీ షోలో మోదీ ఇచ్చిన సమాధానాలు చారిత్రాత్మకం అంటూ సోషల్ మీడియాలో కొంత మంది మోదీని ప్రశంసిస్తున్నారు. అప్పటి టీవీ చర్చాగోష్టుల్లో వివిధ పార్టీల రాజకీయ నాయకుల మధ్య వ్యంగ్యాస్త్రాలు, చలోక్తులు ఉన్నప్పటికీ ఇప్పటిలాగా అరుపులు, కేకలు, తిట్లు ఉండేటివి కావు. -
నాడు మోదీది ఎంత చక్కటి నవ్వో
-
స్మృతి ఇరానీపై ట్విట్టర్ లో సెటైర్లు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పించి, ఆమెకు తక్కువ ప్రాధాన్యత గల జౌళి శాఖను కేటాయించడం పట్ల సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్లో వ్యంగోక్తులు వెల్లివెరిశాయి.‘విద్యా రంగంలో ఒకే ఒక భారీ సంస్కరణ జరిగింది. అదే స్మృతి ఇరానీని ఆ శాఖ నుంచి తప్పించడం’ అని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె ఆధ్వర్యంలోనే విద్యా సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఆమెను ఆ పదవి నుంచి తప్పించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘నా పని విధానం ఎలా ఉందండీ మోదీగారు? అంటూ ఇరానీ ప్రశ్నించారు. అందుకు మోదీ తగిన సమాధానం ఇచ్చారు.....నా పనిని జడ్జ్ చేయండి అని మోదీని అడిగి ఉండాల్సిందికాదు, బాస్ తీర్పు ఇచ్చారు....జౌళి శాఖ ఇవ్వడంతో ఇక ఆమె ఇంట్లోని కబోర్డులన్నీ జౌళీ వస్త్రాలతో నిండిపోతాయి....మోదీజీ మీరు ఓ జీనియస్.....ఆహా ఇదెంత ఉపశమనం.....ఇక స్మృతి ఇరానీ బీజేపీకి మరో కిరణ్ బీడీ అవుతారు....2019 తర్వాత టీవీ సీరియళ్లుకు మంచి సీరియళ్లు ప్రింట్ చేసుకోవచ్చు.....ఇక బాలాజీ టెలీ ఫిల్మ్స్ కోసం స్మృతి ఇరానీ, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్సీ కలసి పనిచేసుకోవచ్చు....మోదీ రైట్ నౌ, పూర్ ఇరానీ....జౌళి శాఖకు మారక ముందు ఆ తర్వాత (కామెంట్‌తో ఆమె నవ్వుతున్న ఫొటోను, ఏడుస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు)....’ ఇలా వ్యంగోక్తులు హల్చల్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు చెలరేగడానికి ఆమె తొందరపాటు నిర్ణయాలు కారణమయ్యాయని బీజీపీ అధిష్టానం గుర్తించడంతోనే ఆమె శాఖపై వేటు పడింది. ముఖ్యంగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల్లో అలజడికి ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విషయం తెల్సిందే. -
ఇలా చేస్తే.. సంతోషం మీవెంటే..
సాక్షి, స్కూల్ ఎడిషన్: సంతోషం, కోపం, బాధ, ఆందోళన వంటి అనేక భావనలు మనలో సహజంగా కలుగుతాయి. వీటన్నింటికీ మన మెదడులోని రసాయనాలే కారణం. ఈ విషయం శాస్త్రీయంగా నిరూపణ అయిన అంశం. మెదడులో విడుదలయ్యే నాడీ రసాయనాల వల్లే సంతోషం కలుగుతుంది కాబట్టి ఈ రసాయనాలను అదుపులో పెట్టుకుంటే ఎక్కువ ఆనందంగా ఉండొచ్చనేది శాస్త్రవేత్తల మాట. మన చుట్టూ ఉండే పరిస్థితులు, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటివి ఒత్తిడికి గురిచేస్తాయి. ఫలితంగా ఆనందం దూరమవుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో మెదడులో హ్యాప్పీ కెమికల్స్ విడుదలయ్యేలా చూసుకుంటే మళ్లీ సంతోషాన్ని తిరిగి పొందవచ్చు. ఆనందాన్నిచ్చే రసాయనాలు విడుదలయ్యేందుకు ఏం చేయాలో.. దీనివల్ల సంతోషాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం.. చల్లని నీటితో.. ఇది రోజూ క్రమం తప్పకుండా చేసేపనే. చల్లని నీరు తీసుకుని కాస్త ముఖంపై చల్లుకోండి. దీనివల్ల గుండె వేగం తగ్గి, వేగస్ అనే ఓ కీలకమైన నాడీ సంబంధిత నరం ఉత్తేజితమవుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. కండరాలు ఎక్కువగా ఆక్సిజన్‌ను వినియోగించుకుంటాయి. వేగస్ ఉత్తేజితమైతే జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. మన మూడ్‌ని, ఆలోచనల్ని మార్చేందుకు పరోక్షంగా ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. సన్నిహితులతో మమేకం.. మూడ్ బాగోలేనప్పుడు ఒంటరిగా, ఒకే ప్లేస్‌లో ఉండడం మంచిది కాదు. వీలైనంత వరకు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయత్నించండి. లేదా ఏదైనా బుక్‌స్టోర్, కాఫీ షాప్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్‌కు వెళ్లండి. అక్కడి వారితో సంభాషించండి. ఇలా ఇతరులతో సరదాగా మాట్లాడడం, ఎంజాయ్ చేయడం వల్ల ఆక్సీటోసిన్ విడుదలవుతుంది. దీంతోపాటు సెరటోనిన్ కూడా మెరుగుపడుతుంది. ఈ రెండు రసాయనాలు ఉత్సాహాన్ని కలిగించేవే. అందువల్ల ఇతరులతో సన్నిహితంగా మెదలడం వల్ల మెదడుకు ఈ రసాయనాల వల్ల కొత్త శక్తి లభిస్తుంది. కేవలం తోటివారితో మాట్లాడడం మాత్రమే కాదు. గార్డెనింగ్, డ్రాయింగ్, మ్యూజిక్ వినడం వంటి పనులు కూడా చురుకుదనాన్ని కలిగిస్తాయి. చిరునవ్వు.. సంతోషంగా ఉన్నప్పుడే నవ్వగలుగుతాం అనేది సత్యమే. కానీ నవ్వడం వల్ల కూడా సంతోషం కలుగుతుందనే విషయాన్ని గుర్తించాలి. వీలైనంత వరకు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. చిరునవ్వు అయినా, బిగ్గరగా నవ్వినా సంతోషం కలుగుతుంది. కృత్రిమంగా నవ్వినా, సహజంగా నవ్వినా మెదడులో కలిగే స్పందనలు దాదాపు ఒకేలా ఉంటాయి. అందువల్ల ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆనందాన్ని కోరుకున్నప్పుడు నవ్వడానికి ప్రయత్నించండి. దీనివల్ల మెదడులో సంతోషాన్ని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. దీంతో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. సూర్యకాంతితో చురుకుదనం.. వీలున్నంత వరకు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆరుబయట తిరగండి. లేదా ఆఫీస్ వేళల్లో కాస్త సూర్యకాంతి పడేలా చూసుకోండి. అలాగని ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు. సూర్యకాంతి మెదడులో సెరటోనిన్ అనే రసాయనం విడుదలయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇది మెదడుకు మంచి శక్తినిస్తూ, మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. శరీరంలో మెలటోనిన్ విడుదలయ్యేలా కూడా సూర్యకాంతి తోడ్పడుతుంది. ఇది మంచి నిద్రను అందిస్తుంది. పెంపుడు జంతువులతో కాలక్షేపం.. కుక్క, పిల్లి, కుందేలు, లేదా ఏదైనా పక్షి వంటి పెంపుడు జీవులతో గడపడం వల్ల మొదడుకు కొత్త శక్తి చేకూరి ఆనందం కలుగుతుంది. పెంపుడు జీవులతో కాస్సేపు గడపడం వల్ల మెదడులో ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్స్, డోపమైన్ వంటి హ్యాప్పీ కెమికల్స్ విడుదలవుతాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారిలో డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉంటాయని, ఆరోగ్యపు అలవాట్లు బాగుంటాయని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. ముఖ్యంగా శునకాలతో ఆడుకునే వారిలో ఆక్సిటోసిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు జపాన్ అధ్యయనం వెల్లడించింది. అందుకే ఏదైనా పెంపుడు జంతువుకు ఇంట్లో చోటు కల్పించండి. -
కలలో పిల్లలు... వాళ్ల నవ్వులు
స్వప్న లిపి కొన్ని కలలు... నిద్ర లేవగానే గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకునేలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటిలో ఒకటి... కలలో పిల్లలు కనిపించడం. వాళ్ల నవ్వులు నిద్రలో కూడా మన పెదాల మీద చిరునవ్వును పూయిస్తాయి. కలలో పిల్లలు కనిపించడానికి అర్థం ఏదైనా ఉందా? ఉంది. అదేమిటంటే... చిన్నపిల్లలు కలలో కనిపించడం అనేది... మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది. ‘పిల్లలు’ స్వచ్ఛత, అమాయకత్వం, మంచితనం... తదితర లక్షణాలకు ప్రతీక. కలలో... చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే...మీరు మది నిండా సంతోషంగా ఉన్నారని అర్థం. కలలో పిల్లలు కనిపించడం అనేది, మీలో మీకు కనిపించని శక్తులు...మిమ్మల్ని పలకరించడం కూడా. ‘ఫలానా పని నేను చేయలేను’ అని ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఓటమికి సిద్ధపడతారు కొందరు. ్ఞ్ఞ్ఞ్ఞ్ఞనిజానికి, ప్రయత్నిస్తే తేలికగా విజయం సాధించే సామర్థ్యాలు వారిలో ఉంటాయి. ‘‘నువ్వు చేయగలవు. ఆ శక్తి నీలో ఉంది’’ అని సన్నిహితులు చెప్పినా పెద్దగా పట్టించుకోరు. అలా అని మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండరు. ‘‘నేను...లేనిపోని భయాలను ఊహించుకుంటున్నాను’’ అని మనసులో మథనపడుతున్నప్పుడు... ఈ ఆలోచనే కలగా వస్తుంది. ఆ కలలో పిల్లలు కనిపించడం, మనలోని సామర్థ్యాన్ని ప్రతిబింబించడం లాంటిది. పిల్లలు కలలో కనిపించడం అనేది... ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ‘నేను అలా కాదు. ఇలా ఉండాలనుకుంటున్నాను’ అని ఒక నిర్ణయానికి బలంగా వచ్చినప్పుడు, ఆ నిర్ణయం పిల్లల నవ్వుల రూపంలో కలలో ప్రతిఫలిస్తుంది. -
లాఫ్ ఇండియా లాఫ్
-
హాస్య యోగా... చేయి బాగా!
నవ్వు నాలుగు విధాల మేలు అనేది నాటి మాటయితే, నవ్వు నలభై విధాల గ్రేటు అనేది నేటి నినాదం. రోజు హాయిగా నవ్వే వారు రోగాలకు బారిన పడకుండా ఉంటారనేది జగమెరిగిన సత్యం. మనసారా నవ్వుకునే వారికి వైద్యుడికి దగ్గర వెళ్లాల్సిన సందర్భాలు తక్కువగా వస్తాయి. అన్నింటా వేగమే చెలామణి అవుతున్న గ్లోబల్ ప్రపంచంలో మనిషి దరహాసానికి దూరమవుతున్నాడు. చిరునవ్వుకు కూడా సమయం చిక్కనంత బిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా నగరజీవులు నవ్వమే మర్చిపోతున్నారు. ఇటువంటి వారి కోసం నగరాల్లో లాఫీంగ్ క్లబ్సులు వెలిశాయి. మొదట నవ్వు కోవడానికే పరిమితమియిన ఈ క్లబ్బులు కాలానుగుణం మార్పులు చెందాయి. ఇప్పుడు ఎక్కువగా హాస్య యోగా చేస్తున్నారు. ఇందులో జోక్స్ వేసి నవ్వించడం ఉండదు. యోగా బ్రీతింగ్‌తో పాటు లాఫింగ్ ఎక్స్‌ర్‌సైజ్ చేయడం దీని ప్రత్యేకత. మనదేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పుడు హాస్య యోగా బాగా ప్రాచుర్యం పొందింది. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు హాస్య యోగా చేస్తే అనారోగ్యం దూరమవడమే కాకుండా మానసిక సాంత్వన కలుగుతుందంటున్నారు నిపుణులు. మెట్రో నగరాల్లో జీవించే వారిలో అత్యధిక శాతం మంది ఒత్తిడితో కూడిన జీవితం గడుపుతున్నారు. ఉద్యోగ జీవితం పోటీ వాతావరణం, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలతో నగరజీవులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు నవ్వుకు దూరమవుతున్నారు. నవ్వు కూడా ఒక వ్యాయామమే అన్న సంగతి మర్చిపోతున్నారు. అసలు చిన్న పిల్లల్లా మనసారా నవ్వుకుంటే ఒత్తిడి దూది పింజల ఎగిరిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా నవ్వలేని వారు హాస్య యోగాను ఆశ్రయిస్తున్నారు. హాస్య యోగాతో మానసిక ఒత్తిడి దూరమవడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని హాస్య యోగా కేంద్రం వ్యవస్థాపకుడు జితెన్ కోహి తెలిపారు. మనసారా నవ్వితే ముఖ కండరాలకు వ్యాయామం అవుతుందని, దీంతో ముఖవర్చసు ద్విగుణీకృతం అవుతుందన్నారు. ముఖ్యంగా అందరితో కలిసి హాస్య యోగా చేయడం వల్ల దేహం నుంచి కొన్ని రకాల రసాయనాలు విడుదలయి ఒత్తిడి తొలగిపోతుందని వివరించారు. నవ్వుతో మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా, రోగాలు నయమవుతాయన్నారు. తమ క్లబ్బులో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కూడా హాస్య యోగాకు ఆదరణకు పెరుగుతోందన్నారు. అయితే హాస్య యోగాతో వ్యాధులు పూర్తిగా నయమైపోవని, తగిన వైద్య చికిత్స కూడా అవసరమని చెప్పారు. హాయిగా నవ్వేవారిలో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. మరి ఇంకేందుకు ఆలస్యంగా హాః హాః హాః అంటూ నవ్వండి ఆరోగ్యంగా ఉండండి. -
అదే జనగళం
సాక్షి, విజయవాడ : జిల్లా అంతటా సమైక్య నినాదం.. అదే జనగళమైంది. గత 27 రోజులుగా ఎవరి నోట విన్నా సమైక్యాంధ్ర నాదమే మార్మోగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉద్యోగులు, విద్యార్థులు అనే తేడా లేకుండా రోడ్లపైకి వచ్చి వివిధ పద్దతుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. రిలే నిరాహారదీక్షలు, మానవహారాలు, రోడ్డు దిగ్బంధాలు, వంటావార్పులతో రోడ్లన్నీ పోరు హోరుతో మోతెక్కిపోతున్నాయి. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. హోరెత్తిన నూజివీడు.. నూజివీడులో జేఏసీ పిలుపు మేరకు పట్టణంలోని విద్యాసంస్థలన్నీ కలసి అరలక్ష గళ ఘోష నిర్వహించాయి. సమైక్య నినాదంతో పట్టణం హోరెత్తింది. చిన్నగాంధీబొమ్మ సెంటరులో బస్టాండు రోడ్డు, హనుమాన్‌జంక్షన్ రోడ్డు, విస్సన్నపేట రోడ్డు ఎటుచూసినా విద్యార్థులమయం అయ్యింది. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి ప్రజలను ఆకట్టుకున్నారు. సమైక్యవాదులు చల్లపల్లిలో పదివేల మందితో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. చల్లపల్లి ప్రధాన సెంటర్లో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. రెండుగంటల పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమైక్యాంధ్ర నినాదాలతో ఈ ప్రాంతం మార్మోగింది. జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ముక్త్యాలలో ఉద్యోగ జేఏసీ సంఘ ఆధ్వర్యంలో వంటావార్పు, ర్యాలీలు, మానవహారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వత్యవాయి మండలంలోని మక్కపేటలో గ్రామస్తులు, విద్యార్థులు మానవహారాన్ని నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కైకలూరు తాలూకా సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో 13వ రోజు రిలే దీక్షల్లో పీఈటీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్కడే ఉదయం రహదారిపై ధ్యానం చేశారు. బార్ అసోసియేషన్ సభ్యులు మోకాళ్లపై నడిచారు. కలిదిండిలో జేఏసీ ఆధ్వర్యంలో రెండువేల మందితో భారీ ర్యాలీ జరిగింది. ముదినేపల్లిలో జూనియర్ కళాశాల అధ్యాపకులు రోడ్డుపై పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. మైలవరంలో ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ర్యాలీ నిర్వహించి మైలవరంలోని ప్రధాన వీధుల్లో తిరిగి రాష్ట్రం విడిపోతే వచ్చే ఇబ్బందులను ప్రజలకు తెలియజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోలు రిలే దీక్షలో పాల్గొన్నారు. మైలవరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. సమైక్యాంధ్ర కోసం జి.కొండూరు జాతీయ రహదారిపై పులివాగు వద్ద ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. నందిగామ గాంధీ సెంటర్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ గుడివాడలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో ఆర్టీసీ జేఏసీ మహిళా కండక్టర్లు పాల్గొన్నారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. ఆర్టీవో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆటోలు, కార్లతో ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. పట్టణంలో న్యాయవాదులు న్యాయదేవిత విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. విజయవాడలో.. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దుర్గాఘాట్‌లో జలదీక్ష నిర్వహించారు. విద్యార్థి జేఏసీ కన్వీనర్ దేవినేని అవినాష్ పిలుపు మేరకు నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ దీక్షలో పాల్గొన్నారు. 13 జిల్లాల సహకార సిబ్బంది వేలాదిగా సహకార బ్యాంకు నుంచి ర్యాలీ చేశారు. 28న లక్షమంది విద్యార్థులతో సమైక్య విద్యార్థి గర్జన నిర్వహించాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. -
జగనన్న వెంటే జనం
తిరుపతి (మంగళం), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం జైల్లో నిరాహారదీక్ష చేస్తున్న జగన్ వెంటే జనం ఉన్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం తుడా సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష చేస్తున్న ఎస్టీలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి దీక్షలో పాల్గొన్నారు. అంతకు ముందు సమైక్యాంధ్ర నినాదంతో జగన్ ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది జగన్ ఫొటో ప్లకార్డులతో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేశారు. సుమారు మూడుగంటల పాటు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆందోళన చేశారు. అనంతరం లంబాడీలు నృత్యాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జైల్లో ఉండి కూడా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్.జగన్మోహన్రెడ్డి చరిత్రలో మహోన్నత వ్యక్తిగా నిలిచిపోతారన్నారు. భారతదేశ రాజకీయాల్లోనే సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఏడు కోట్ల మంది జనం జగనన్న వెంట ఉన్నారని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం విభజన ప్రకటన చేసిన సోనియాగాంధీ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జగన్ ఆశయాలతో ఉద్యమాలను మరింత తీవ్ర ం చేస్తామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. సమైక్యం కోసం కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎక్కడా ఉద్యమాలు చేసిన దాఖలాలు కనిపించడం లేదని, దీంతో సమైక్యాంధ్రపై వారికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలతోనే నేడు సీమాంధ్రులకు ఈ గతి పట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్కే.బాబు, ఎస్టీ విభాగం నాయకుడు హనుమంత్‌నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పదవులను వీడి ఉద్యమంలోకి రండి
తిరుపతి కార్పొరేషన్,న్యూస్‌లైన్: ‘మీ పదవులు, పార్టీలను పక్కన పెట్టండి. సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమించండి’ అని చిత్తూరు ఎమ్మెల్యే, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ సీకే బాబు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సీకే బాబు చేపట్టిన మహాపాదయాత్ర శుక్రవారం తిరుపతికి చేరుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీకేబాబు మాట్లాడారు. సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమం ఏ ఒక్కరి బలవంతం మీద చేస్తున్నది కాదన్నారు. ‘మీ వెంట మేముంటాం, మీరు ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని’ ప్రజలు రోడ్లపైకొచ్చి కోరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎంతో మంది మేధావులైన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ విభజనను అడ్డుకోకుండా మౌనంగా ఉండడం సరికాదని హితవుపలికారు. గాంధేయ మార్గంలో ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నిరంకుశమైన దొరలరాజ్యం నడుస్తోందని, అందుకే సీమాంధ్ర వారిని రెచ్చగొట్టేలా వాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్.వర్మ, ఐఎన్టీయూసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మబ్బు చెంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సీకేకు ఘన స్వాగతం: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టిన సీకేబాబు శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. టౌన్‌క్లబ్ వద్ద సీకేకు ఐఎన్టీయూసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మబ్బు చెంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అమాస రాజశేఖర్‌రెడ్డి, తిరుపతి అధ్యక్షులు నాగభూషణం, నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మబ్బు దేవనారాయణరెడ్డి ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా మబ్బు యువసేన నాయకులు, సమైక్యవాదులు 2వేల మందికి పైగా పూలు చల్లుతూ, టపాకాయలు పేల్చుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకు ముందు టౌన్‌క్లబ్ వద్ద ఏపీఎన్జీవోలు, నాలుగు కాళ్లమండపం వద్ద కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలు, మున్సిపల్ కార్పొరేషన్ వద్ద సాప్స్ నాయకులు చేస్తున్న రిలే దీక్షలకు సీకే బాబు సంఘీభావం తెలిపారు. -
ఒకే జాతి.. ఒకే రాష్ట్రం
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్ర కోసం ఊరూరా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు విభజనకు నిరసనగా ఆందోళనలు తీవ్రతరం చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకుంది. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్.వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీకే బాబు పాల్గొని ప్రసంగించారు. చిత్తూరులో జిల్లా ఉన్నతాధికారులు వెయ్యి మోటార్ బైక్‌లపై భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు రాస్తారోకో చేసి, మానవహారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏఎస్ మనోహర్ దీక్షకు సంఘీభావం తెలిపారు. సీమాంధ్ర న్యాయశాఖ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు రిలేదీక్షలు చేస్తే గుమాస్తాలు వంటావార్పు నిర్వహించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చెవిలో పూలు పెట్టకండి చిత్తూరులో ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు చెవిలో పూలతో నిరసన తెలిపారు. పుంగనూరులో ఉపాధ్యాయులు, అన్ని శాఖల ఉద్యోగులు చెవి లో పూలు పెట్టుకుని జాతీయ రహదారిపై వెనక్కు నడిచారు. అనంతరం రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు కలసి రోడ్డుపై వంటావార్పు చేశారు. చంద్రగిరిలో 36 గంటలపాటు బంద్ కొనసాగింది. జాతీయ రహదారిలో 7 గంటల పాటు రాకపోకలను అడ్డుకున్నారు. పూతలపట్టులో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. పీలేరులో 17వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటోలతో భారీ ర్యాలీ పుత్తూరులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 600 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఏపీ ఎన్జీవో, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో రిలే దీక్షలు చేశారు. వైఎస్సార్ సీపీ నేత, హిమజ విద్యాసంస్థల చైర్మన్ సురేందర్‌రాజు ఆధ్వర్యంలో పిరమిడ్ విన్యాసాలతో వినూత్న నిరసన తెలిపారు. నగరిలో ఇందిర ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. శ్రీకాళహస్తిలో ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు భారీ ర్యాలీ, వంటావార్పు చేపట్టి మానవహారం నిర్వహించారు. మదనపల్లెలో జేఏసీ, మిట్స్ కళాశాల ఆధ్వర్యంలో హంద్రీ-నీవా కాలువలో పడుకుని నిరసన తెలిపారు. పలమనేరులో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహిం చారు. జీడీనెల్లూరు పరిధిలోని అన్ని మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది రోడ్డుపైనే వైద్యసేవలందించారు. విద్యార్థులు రోడ్డుపైనే పాఠాలు చదువుతూ నిరసన తెలిపారు. వైఎస్.విజయమ్మ దీక్షకు మద్దతుగా.. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. చిత్తూరులో ఏఎస్.మనోహర్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు వైఎస్సార్ సీపీ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు పలికింది. వివిధ కళాశాలల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. పీలేరు మండలం గూడరేవుపల్లెలో విజయమ్మ దీక్షకు సంఘీభావంగా రోడ్డుపై వంటావార్పు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. పుంగనూరులో విజయమ్మ దీక్షకు మద్దతుగా ఐదో రోజు రిలేదీక్షలు కొనసాగించారు. పీటీఎంలో రిలీ దీక్షలు ప్రారంభం కాగా, శాంతిపురం మండలంలో కొనసాగుతున్నాయి. -
విభజిస్తే విప్లవమే
‘తెలుగుతల్లి సౌ‘భాగ్య’ నగరం హైదరాబాద్‌ను చేజార్చుకునేందుకు సీమాంధ్రులు సిద్ధంగా లేరు.. అరవై ఏళ్ల సమష్టి కృషి ఫలితాన్ని తెలంగాణకు అప్పగించి చేతులు ముడుచుకు కూర్చునేది లేదు.. ఎలాంటి ఉద్యమాలైనా, ఎలాంటి త్యాగాలైనా చేసి హైదరాబాద్ సహా సమైక్యాంధ్రను సాధించి తీరుతాం...’ అంటూ విశాఖ నగర ప్రజానీకం, మేధావులు, వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత ముక్త కంఠంతో నినదించారు. నగరంలోని కావేరి ఫంక్షన్ హాల్లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ఎవరెటు?’ చైతన్య పథం చర్చా వేదికలో వీరందరి అభిప్రాయాలు ఆలోచనాత్మకంగా, ఆవేశభరితంగా సాగాయి. సాక్షి, విశాఖపట్నం : విభజనకు కారకులైన నాయకులకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని విశాఖ వాసులు హెచ్చరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచుతామన్న ప్రకటన వచ్చే వరకు ఉద్యమాగ్ని చల్లారదని స్పష్టం చేశారు. ‘సమైక్యాంధ్ర కోసం ఎంతవరకైనా పోరాడుతాం. ఉద్యమాలు చేస్తూ ముందుకెళ్తాం. శాంతియుత నిరసన కార్యక్రమాలతో తమ వాణి విన్పిస్తాం...పాలకుల మెడ వంచుతాం.’ అని ఘాటుగా స్పందించారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ సంయుక్తంగా సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఎవరెటు’ చైతన్య పథం చర్చా కార్యక్రమంలో హాజరైన వక్తలంతా సమైక్య గళం విప్పారు. స్థానిక కావేరి కన్నడ సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మేధావులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ఉద్యోగ సంఘం నేతలు, కార్మిక సంఘం నేతలు, వివిధ రంగాల నిష్ణాతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మనోగతాన్ని తెలి యజేశారు. విభజనతో సీమాంధ్రకు జరిగే నష్టాలు ఏకరువు పెట్టారు. రాహుల్‌గాంధీ పట్టాభిషేకం కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి అనుసరిస్తున్న తీరును కడిగి పారేశారు. సమైక్యాంధ్ర ద్రోహిగా పేర్కొంటూ చంద్రబాబుపై వక్తలు విరుచుకుపడ్డారు. రాజకీయ నిరుద్యోగైన కేసీఆర్ ఒక నాజీగా, నియంతలా భావోద్వేగాలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి చిదంబరం, నరేంద్ర మోడి ఎవరని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌లను రాజప్రతినిధులుగా అభివర్ణించారు. విజయమ్మ ఆమరణ దీక్ష చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా కొనియాడారు. హెదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని, అందరిదని, దాన్ని వేరు చేయలేరని ఘంటాపదంగా చెప్పారు. సమైక్యంగా ఉంచుతామన్న ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం చల్లారదని స్పష్టం చేశారు. -
ఉద్యమానికి...కొత్త ఊపిరి
వైఎస్ విజయమ్మ సమర దీక్షతో సమైక్యాంధ్ర ఉద్యమానికి కొత్త ఊపిరి వచ్చింది. మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విభజించవద్దంటూ గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టేందుకు గన్నవరం వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు ఘన స్వాగతం పలికారు. విజయమ్మకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలే దీక్షలకు సిద్ధమవుతున్నారు. మరోపక్క జిల్లా అంతటా నిరసనలు హోరెత్తాయి. సాక్షి, విజయవాడ : గుంటూరులో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లాలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద దీక్షలు చేపట్టారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరు, కలిదిండి మండలాల్లో రిలే దీక్షలు ప్రారంభించారు. నందిగామలో గాంధీబొమ్మ సెంటర్లో, విస్సన్నపేటలో మహిళలు దీక్షలు చేపట్టారు. మంగళవారం నుంచి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దీక్షలు చేపట్టేందుకు నాయకులు సన్నద్ధమవుతున్నారు. జ్యుడీషియల్ ఉద్యోగుల సమ్మె.. మచిలీపట్నంలో జ్యుడీషియల్ ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ నెల 21 నుంచి సమ్మె చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పట్టణంలోని దీక్షా శిబిరం వద్దకు మద్దతు తెలిపారు. జగ్గయ్యపేటలో ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద నుంచి బస్టాండ్ వరకు యూనిఫాం ధరించి ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం.. సమైక్యాంధ్రకు మద్దతుగా వత్సవాయిలో హమాలీ కూలీలు ర్యాలీ నిర్వహించి గాంధీ పార్కు సెంటర్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని విడదీసే శక్తుల్ని అడ్డుకుంటామని నినదించారు. అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయంలోని నోటీస్ బోర్డుకు వినతిపత్రాన్ని అంటించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 12వ రోజుకు చేరాయి. మండవల్లిలో దీక్షలు తొమ్మిదో రోజూ కొనసాగాయి. కలిదిండి మండలం కొండంగి గ్రామస్తులు 1500 మంది మండల కేంద్రానికి వచ్చి రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. సింగరాయపాలెంలోనూ వంటవార్పు నిర్వహించారు. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవోల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో మండవల్లి పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో ఆటో రిక్షా కార్మికులు బంద్ ప్రకటించి, ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో విజయవాడ, మైలవరం, నందిగామ, స్థానిక రూరల్ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెడ్డిగూడెంలో ఉపాధ్యాయులు నిరసన ప్రద ర్శన చేశారు. గుడివాడలో హోరెత్తిన నిరసనలు.. గుడివాడ పట్టణంలో వేలాదిమంది విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సమైక్యతకు మద్దతుగా ఈ ర్యాలీ జరిపాయి. పట్టణంలో లారీ యజమానులు ర్యాలీ నిర్వహించారు. నెహ్రూచౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థుల మహాధర్నా జరిగింది. పంచాయతీరాజ్ ఉద్యోగులు ర్యాలీ జరిపి, రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదుల రిలే దీక్షలు.. నూజివీడులో న్యాయవాదులు రిలేదీక్షలు చేపట్టారు. కూరగాయ దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో కూరగాయల దుకాణాల బంద్ నిర్వహించారు. టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఆర్టీసీ కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫొటోగ్రాఫర్ల సంఘం, తాపీ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీలు జరిపారు. ఆర్టీసీ కార్మికులు బస్టాండు సెంటర్లో మానవహారం నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లు ర్యాలీ చేశారు. విజయవాడలో భారీ ప్రదర్శన.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, పంచాయతీరాజ్, విద్యార్థి సంఘ జేఏసీ నేతలతో విజయవాడ పాత బస్టాండ్ నుంచి ఏలూరురోడ్డు, మ్యూజియం రోడ్డు మీదుగా ఐవీ ప్యాలెస్ వరకు ర్యాలీ జరిగింది. మేళతాళాలు, చెవుల్లో పూలు పెట్టుకుని బైక్ ర్యాలీ విన్నూతంగా నిర్వహించారు. ర్యాలీ జరుగుతున్నప్పుడు ఏలూరురోడ్డు మొత్తం జనసందోహంతో నిండిపోయింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో యూనియన్లతో విజయవాడలోని బందరురోడ్డు, ఏలూరురోడ్డులలో జరిగిన ర్యాలీ ఆకట్టుకుంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కూ సమైక్యాంధ్ర సెగ తగిలింది. సమైక్యాంధ్రవాదులు అడ్డుకోవడంతో పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ఆగిపోగా, ఎస్ఆర్ఆర్, లయోలా కళాశాలలో ఆలస్యంగా ప్రారంభమై నామమాత్రంగా ముగిసింది. -
విభజనాగ్ని
తూర్పు దిక్కున సమైక్య సూరీడు భగ్గుమన్నాడు. విభజనాగ్ని సెగలు విరజిమ్ముతూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా, పోలీసులు ఉక్కు పాదం మోపినా ఉద్యమకారులలో మొక్కవోని దీక్ష.అణచివేత యత్నాలను తిప్పికొట్టి నగరంలోనూ, జిల్లావ్యాప్తంగా సింహాలై గర్జిస్తున్న సమైక్యవాదుల మడమతిప్పని వైఖరి పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోరుతూ సమ్మెను ఈ నెల 31 వరకూ తీవ్రస్థాయిలో ఎలా నిర్వహించాలో కార్యాచరణ సిద్ధమైంది. ఇది సకల జనోద్యమం. అప్రతిహతమైన ఈ ఉద్యమం ఉప్పెనై పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎలాంటి ఆటంకాలు ఎదురైన అకుంఠిత దీక్షతో ముందుకుసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో జనావేశం ఏదో అ ద్భుతాన్ని సృష్టించేలా ఉంది. విశాఖ ప్రజల సమైక్య నినాదం ప్రతిధ్వనిస్తుంటే .. మరోవైపు ఉద్యోగ సంఘాలు పాలనను స్తంభింపచేస్తున్నాయి. ఒక వైపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం రోజుకో జీవో జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తోంది. మరో పక్క ఉద్యోగసంఘాలు రోజుకో నిరసన కార్యక్రమంతో కార్యాచరణ సిద్ధం చేశాయి. జిల్లాలో గత 19 రోజులుగా అలుపెరగని పోరాటాన్ని సాగిస్తున్న సంఘాలన్నీ సోమవారం నుంచి ఏకతాటిపైకి వచ్చి సకల జనుల సమ్మెను మరింత ఉరకలెత్తించాలని నిర్ణయించాయి. ఏపీఎన్జీవోల పిలుపు మేరకు ఈ నెల 19 నుంచి 31 వరకు తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అడ్డగింపు విశాఖ కంచరపాలెం, నర్సీపట్నంలలోని పాలిటెక్నికల్ కళాశాలల్లో సోమవారం నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో ఈ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమయ్యాయి. సకల జనుల సమ్మె కారణంగా బస్సులు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన టెక్నికల్, నాన్‌టెక్నికల్ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారు. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించే వారు కూడా ఉండే అవకాశం లేదు. ఉన్నతాధికారులు మినహా ఉద్యోగులు, సిబ్బంది లేకుండా కౌన్సెలింగ్ నిర్వహణ సాధ్యమయ్యే పనికాదని వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పాలిటెక్నిక్ కళాశాల వద్ద భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. అనంతరం ఉదయం 10 గంటలకు అక్కడ నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్డు వరకు ఉద్యోగులందరూ మహా ర్యాలీ చేయనున్నారు. స్తంభించనున్న రవాణా సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొనడంతో గత ఆరు రోజుల నుంచి బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు వెళ్లాలంటే ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎన్జీవో నేతలు ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఏపీఎన్జీవో హోమ్‌లో ఆయా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రైవేటు సర్వీసుల యజమానులు 30 మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని బస్సు సర్వీసులను నిలిపివేసి ఉద్యమానికి మద్దతు తెలపాలని జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు వారిని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. 31 వరకు నిరసన కార్యక్రమాలు సకల జనుల సమ్మెను మరింత తీవ్రతరం చేయడానికి ఏపీఎన్జీవోల పిలుపు మేరకు అన్ని ఉద్యోగ సంఘాలు ఈ నెల 19 నుంచి 31 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 19 మహా ర్యాలీతో, 20న జాతీయ రహదారుల దిగ్బంధం, 21న నగరంలో భారీ బహిరంగ సభ, 22 నుంచి 31 వరకు అన్ని శాఖల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. -
సకలం సమైక్యం
రాష్ట్రాన్ని రెండుగా ముక్కలు చేయడాన్ని సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఎన్జీవోలతోపాటు పలు ఉద్యోగ సంఘాల జేఏసీలు సమైక్యాంధ్ర పరిరక్షణకు మద్దతు ప్రకటిస్తూ సమ్మె చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో పాలుపంచుకుంటూ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళుతున్నారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రభుత్వం ప్రకటించిన ‘ఎస్మా’ను కూడా లెక్కచేయ బోమని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర కోసం ఇరవై రోజుల నుంచి ఉధృతంగా జరుగుతున్న ఆందోళనలు సెలవురోజైన ఆదివారం కూడా అదే రీతిలో కొనసాగాయి. రోజుకో రకంగా వినూత్నరీతిలో నిరసన తెలుపుతూ.. సమైక్యతే మా నినాదం అంటున్నారు. జగ్గయ్యపేటలో ఎన్జీవో జేఏసీ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. రాష్ట్ర విభజన యోచనను కాంగ్రెస్ సర్కార్ మానుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉధయభాను సతీమణి విమలభాను ఆధ్వర్యంలో మహిళలు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండ్ ఆవరణలో వంటావార్పు నిర్వహించి ఆటలాడారు. పెనుగంచిప్రోలులో వైఎస్సార్ సీపీ చేపట్టిన దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ఆళ్లూరుపాడు, వత్సవాయి గ్రామస్తులు ర్యాలీలు నిర్వహించారు. నందిగామలో ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలు గాంధీ సెంటర్లో రోడ్లను శుభ్రంచేసి నిరసన తెలిపారు. లాండ్రీ యూనియన్, రజక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపారు. చల్లపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఆర్ఎంపీ డాక్టర్లు, వైద్య సిబ్బంది, మెడికల్‌షాపుల యజమానులు, సిబ్బంది రామానగరం నుంచి చల్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. అవనిగడ్డలో ముస్లిం సోదరులు దీక్షలు చేశారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మద్దతు తెలిపారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. విస్సన్నపేటలో ఆర్యవైశ్య కల్యాణమండపం వద్ద వాసవీ క్లబ్‌ల ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. గంపలగూడెంలో టీడీపీ రిలే నిరాహారదీక్షలు ప్రారంభించింది. మచిలీపట్నంలో మునిసిపల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరింది. మండవల్లిలో ఎనిమిదో రోజు దీక్షలో బోయిన అర్చన అనే రెండేళ్ల చిన్నారి కూర్చుంది. గుడివాడ-భీమవరం జాతీయ రహదారిపై వంటలు వండి రోడ్లపైనే భోజనం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సెంటర్లో నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. పామర్రులో వీరాంజ నేయ తాపీ వర్కర్స్ యూనియన్, విశ్వకర్మ కార్పెంటర్స్, ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు, ఫొటోగ్రఫీ, విడియోగ్రఫీ వర్కర్స్, పెయింటర్స్, రిక్షా వర్కర్స్ యూనియన్, జేఏసీ సభ్యులు , ఏపీఎన్జీవో అసోసియేషన్ సభ్యులు, పంచాయతీరాజ్ శాఖ ఎంప్లాయిస్ మినిస్టీరియల్ అసోసియేషన్ సభ్యులు, పామర్రు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల ఆధ్వర్యంలో పామర్రు నాలుగురోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. పెడనలో మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్లు, ప్రభుత్వ టీచర్లు, వివిధ సంఘాల నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతూ రిలే నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ సంఘీభావం ప్రకటించారు. పెడన టైలరింగ్ అసోసియేషన్ నాయకులు 216 జాతీయ రహదారిపై బంటుమిల్లి చౌరస్తాలో దుస్తులు కుడుతూ వినూత్న నిరసన తెలిపారు. బెజవాడలో.. విజయవాడలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన బీఆర్టీఎస్ రోడ్డులో మోకాళ్లపై నిలబడి క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఐఎంఏ వైద్యులు దీక్షాశిబిరం ఏర్పాటు చేశారు. కృష్ణలంక ముస్లిం యూత్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కేసర్ ఇమ్రాన్ మస్జిద్ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు నిరాహారదీక్షలు చేశారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడ్డారు. వంటలు వండి రోడ్డుపై భోజనాలు చేస్తూ నిరసనలు తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద నుంచి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కంకిపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజూ కొనసాగాయి. తెలుగు యువత ఆధ్వర్యంలో యువత కోలవెన్ను గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పడమట సురేష్‌బాబు ఆధ్వర్యాన ఈడుపుగల్లు సెంటరులో వసతిగృహ విద్యార్థులు జాతీయ రహదారిపై భోజనం చేసి నిరసన తెలియచేశారు. కానూరులో వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దీక్షలను కొనసాగించారు. పోరంకిలో నిర్వహించిన దీక్షల్లో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావులు సమైక్యాంధ్రపై చర్చ నిర్వహించారు. -
హ్యూమరం: కాలి కింది గొయ్యి
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు పౌరసంఘం సన్మానం. సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ, ‘‘గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ గోతి అన్నారు పెద్దలు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే కాలం పోయింది. నూతులు ఎండిపోయి గోతులే మిగిలాయి. వెనుకటికి రోడ్డుకి మధ్య గొయ్యి ఉండేది. ఇప్పుడు గొయ్యికి గొయ్యికి మధ్య రోడ్డు మిగిలింది. నా దారి రహదారి అని ఎవరూ డైలాగ్ చెప్పకుండా చేసిన అధికారులకు అభినందనలు’’ అన్నాడు. ఎముకల డాక్టర్ల సంఘం అధ్యక్షుడు లేచి, ‘‘వెన్నెముకతో జీవించడం నాగరికతకే విరుద్ధమని అధికారులు భావిస్తున్నందుకు మా సంఘం హర్షం వెలిబుచ్చుతూ ఉంది. గోతుల్లో పడ్డవాడెవడూ వెన్నెముకతో బయటపడడు. ఎవడికీ ఏమీ విరగకపోతే మా ఆదాయం పెరిగేదెలా? బోన్ ఈజ్ బూన్, ప్రాక్టీస్ మేక్స్ ఏ డాక్టర్ మిలియనీర్’’ అన్నాడు. మందుల షాపు సంఘం పెద్దమనిషి లేచి, ‘‘మందు తాగి బండెక్కినవాడు నాలుగైదు గోతుల్లో పడి లేచేసరికి కిక్కు దిగిపోయి మళ్లీ నాలుగు పెగ్గులు బిగించి ఇంటికెళుతున్నాడు. ఈ రకంగా మా ఆదాయమే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుతున్నారు’’ అన్నాడు. కళ్ల డాక్టర్ల ప్రతినిధి లేచి, ‘‘కళ్లుండి కూడా లోకంలో ఎందరో గుడ్డివాళ్లుగా బతుకుతున్న కాలంలో మేము సేవలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. పడటం కూడా అడ్డదిడ్డంగా కాకుండా సక్రమంగా గోతిలో పడేలా ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల అద్దాలకు గిరాకీ పెరిగింది’’ అన్నాడు. రాజకీయ నాయకుల ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘ఇంతకాలం మేం మాత్రమే ప్రజలకు గోతులు తీస్తామని అందరూ ఆడిపోసుకున్నారు. అది తప్పని నిరూపించిన అధికారులకు కృతజ్ఞతలు. ప్రజలారా! గొయ్యిలో పడటం మీకు కొత్తేమీ కాదు. పడ్డవాడు చెడ్డవాడు కాడు. ఒక గొయ్యి పూడ్చితే వంద గోతులు పుట్టడమే ప్రజాస్వామ్యం. పూడ్చడం మానేసి గోతిలోనే జీవించడం నేర్చుకోండి. జీవితమే గొయ్యి అయినప్పుడు నుయ్యి కోసం ఎదురుచూడటం దండగ. చేదుకునేవాడు లేనప్పుడు ఈదడం నేర్చుకోండి. గోతిలో పడిన ప్రతివాడికి ఒక తాడు, సబ్బు ఉచితం’’ అని వాగ్దానం చేశాడు. చివరగా స్వచ్ఛంద సంస్థలవాళ్లు వచ్చి గోతి బాధితులకు వీల్ చెయిర్లు పంపిణీ చేశారు. మట్టి అంటకుండా గొయ్యి తవ్వడం ఎలా అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అధికారులకు గోతివీరులు అని బిరుదునిచ్చి, ఎవరు తవ్విన గోతిలో వాళ్లే పడకుండా జాగ్రత్తలు చెప్పి హెచ్చరించారు. సభ ముగిసిన తరువాత ప్రజలు బయలుదేరారు. అదృష్టం బావున్నవాళ్లు ఇళ్లకు! గొయ్యిని తప్పించుకోలేనివాళ్లు ఆస్పత్రులకు చేరారు. - జి.ఆర్.మహర్షి -
సమైక్యాంధ్ర....మహోద్యమం
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు జడివానలోనూ ఆగలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా 16వ రోజు ఉద్యోగ సంఘాలు, వ్యాపార వర్గాల ఆందోళనలు మహోద్యమంగా సాగాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో మహిళలు ఎక్కడికక్కడ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తూ నిరసన తెలిపారు. పెనుగంచిప్రోలు పాత సినిమా హాల్ సెంటర్లో డ్వాక్రా మహిళలు లక్ష్మీదేవి చిత్రపటాన్ని, కలశాన్ని అందంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయ వేద పండితులు చిట్టి చంద్రశేఖర శర్మచే శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. రాష్ట్ర విభజన జరగకుండా, అందరూ సమైక్యంగా ఉండాలని మహిళలు లక్ష్మీదేవిని ప్రార్థించారు. జగ్గయ్యపేటలో ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వ ద్ద రోడ్డుపై మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీటీపీఎస్లోని మహిళా ఉద్యోగులు థర్మల్ గేట్ బయట రోడ్డుపైనే జోరువానలోనూ వరలక్ష్మీ వ్రతం పూజాదికాలు నిర్వహించారు. జాగో నాయకా! విజయవాడలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కుక్క మెడలో, జాగో నాయకా జాగో బోర్డు కట్టి నిరసన తెలిపారు. పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ విజయవాడలో సమావేశమై ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. మరుపిళ్ల చిట్టి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. చెన్నుపాటి పెట్రోల్ బంకు వద్ద నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగిన విద్యార్థుల జేఏసీ ర్యాలీలో మాజీ మంత్రులు మండలి బుద్ధప్రసాద్, దేవినేని నెహ్రూ పాల్గొన్నారు. వినూత్న నిరసనలు.. జిల్లాలో శుక్రవారం నిరసనలు వినూత్నంగా సాగాయి. కలిదిండిలో ఎన్జీవోలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలి వద్ద రాష్ట్ర విభజనకు నిరసనగా ఆందోళనలు నిర్వహించి దిష్టిబొమ్మలు దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల వ్యాపారులు నిరసన తెలిపారు. జగ్గయ్యపేటలో రైతుబజార్ బంద్ పాటించారు. హిజ్రాలు కూడా నిరసన ప్రదర్శన చేశారు. గుడివాడలో కేసీఆర్, సోనియా మాస్క్‌లతో గొర్రెలను ఊరేగిస్తూ మాంసం వర్తకులు వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, కార్మికులు బస్సులతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్ యజమానులు ఖాళీ ట్రాక్టర్లతో ర్యాలీ చేయగా, రైతుబజారులో వంటావార్పు నిర్వహించారు. మచిలీపట్నంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు, సిబ్బంది శుక్రవారం స్థానిక కోనేరుసెంటర్‌లో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడో రోజు రిలేదీక్షలను పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి ప్రారంభించారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికులు, పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, ఎన్జీవో జేఏసీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ పశువుల్ని ఊరేగించారు. కుక్కకు, ఎద్దుకు మెడలో దండలు వేసి పట్టణంలో ఊరేగించి సమైక్యాంధ్రను విడదీయవద్దంటూ వినతిపత్రాలు సమర్పించారు. పెడనలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు జరిపిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాం ప్రసాదు మద్దతు పలికారు. బంటుమిల్లి చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో వంటలు చేయటం, ఇడ్లీ పిండి కడగటం, దోసెలు, గారెలు, మినప అట్లు, పెసర అట్లు వేయటం, చపాతీలు తయారు చేయటం లాంటి పనులు చేస్తూ తమ నిసరన తెలిపారు. హిజ్రాలు బంటుమిల్లి రోడ్డులో నాట్యాలు చేస్తూ నిరసనను తెలిపారు. చాట్రాయి మండలం చనుబండలో రోడ్డుపై క్షవరం చే సి జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. నూజివీడులో ఎల్ఐసీ ఏజంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బైక్ మెకానిక్‌ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నగాంధీబొమ్మ సెంటరులో ద్విచక్ర వాహనాలకు ఉచిత సర్వీసింగ్ నిర్వహించారు. నందిగామ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి రాస్తారోకో చేశారు. మైలవరంలోని తెలుగు తల్లి సెంటర్లో జాతీయ రహదారిపై శుక్రవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఉయ్యూరులో భారీ ప్రదర్శన జోరువానలోనూ ఉయ్యూరులో శ్రీవిశ్వశాంతి పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ప్రధాన సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఉయ్యూరు సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలేదీక్షల్లో మండల పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయనీయకుండా, పోలీసులు తీసుకెళ్లిపోవటం ఉద్రిక్తతకు దారితీసింది. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో పామర్రు ఫొటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల వెంట ప్రదర్శనలు చేశారు. -
దేవినేని ఉమ కొత్త ఎత్తుగడ!
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణి వల్ల సీమాంధ్రలో ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో పార్టీని కాపాడుకునేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు కొత్త ఎత్తుగడ వేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి గురువారం ఉదయం 10 గంటలకు హోటల్ డీవీ మేనర్ సమీపంలో నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. 2009 డిసెంబర్లో రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేయగానే తెలుగుదేశం పార్టీ తరుఫున ఈ ఇద్దరు నేతలు నగరంలో నిరవధిక దీక్ష చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన 14 రోజులు తరువాత స్పందించడంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. చంద్రబాబుపై వత్తిడి పెంచి ఉంటే.... గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడలో దేవినేని ఉమ నిరవధిక దీక్ష చేయడానికి ప్రాధాన్యం ఇచ్చే కంటే, చంద్రబాబుతో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన చేయించడానికి వత్తిడి పెంచే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదని పార్టీలో సీనియర్ నేతలు వ్యాఖానిస్తున్నారు. ఎపీఎన్జీవోల సంఘ నాయకులు వెళ్లి కోరినా, తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోనని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. జిల్లా నేతలు నిరవధిక దీక్షకు సిద్ధమైనా చంద్రబాబును తెలంగాణావాదిగానే ప్రజలు చూస్తారే తప్ప సమైక్యవాదిగా గుర్తించరని అంటున్నారు. ఆయన అనుసరిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతం వల్లనే జిల్లాలో పార్టీ దెబ్బతింటోందనేది వారి భావన. పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారు ఆమరణదీక్ష చేస్తుంటే కనీసం చంద్రబాబు వచ్చి వారిని పరామర్శించి, దీక్షకు తమ మద్దతు ప్రకటిస్తారా? లేదా? అన్న అంశం పార్టీలో చర్చనీ యాశంగా మారింది. చంద్రబాబు పట్టించుకోని ఈ దీక్షల వల్ల పార్టీకి ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందనేది మరో ప్రశ్న. మహాధర్నాను పట్టించుకోని చంద్రబాబు గతంలో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయకూడదంటూ తెలంగాణకు చెందిన ఒక ఇంజినీర్ కోర్టులో కేసుదాఖలు చేశారు. దీంతో కృష్ణాడెల్టాకు సకాలంలో సాగునీరు అందక రైతులు విలవిలలాడారు. ఆ సమయంలో దేవి నేని ఉమ కృష్ణానది ఇసుక తిన్నెల్లో మహా ధర్నా నిర్వహించారు. ఈ దీక్షకు కోస్తాంధ్రా ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులంతా వచ్చినా చంద్రబాబు మాత్రం హాజరుకాలేదు. తెలంగాణ ప్రాంత నేతల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే ఆయన అప్పట్లో మహాధర్నాకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఇంద్రకీల్రాది వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలన్న స్థానిక సమస్యపై ఆందోళన చేస్తే మాత్రం చంద్రబాబు వచ్చి తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప సమైక్యాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని ప్రజలు నుంచి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సీమాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ చూపనంత వరకు దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారు చేసే నిరసన కార్యక్రమాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. -
స్తంభించనున్న సేవలు
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగ, కార్మికులు ఉద్యమబాటకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ ఉద్యోగ కార్మికులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ ఈశ్వరయ్య, ఉప కమిషనర్ ప్రతాప్‌రెడ్డికి ఉద్యోగుల సంతకాలతో కూడిన సమ్మె నోటీసును అందించారు. సీమాంధ్రలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగ, కార్మికుల భద్రత, ఈ ప్రాంతంలో నివసించే ప్రజల హక్కుల సాధన కోసం సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నామని నోటీసులో పేర్కొన్నారు. వర్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నట్టు ఇదివరకే ఏపీ ఎన్జీవోలతో కలసి తాము ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. అందులో భాగంగానే సీమాం ధ్రలోని 40వేల మంది ఉద్యోగులు, అన్ని రకాల కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల అసోసియేషన్ కూడా పాల్గొంటుందని అన్నారు. అయితే సమ్మెలో ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సేవలకు మినహాయింపు ఇస్తున్నట్టు వర్మ తెలిపారు. ఈ సేవలకు ఎలాంటి ఆటం కమూ ఉండదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకు తాము తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు సేతుమాధవ్, నాయకులు చిట్టిబాబు, షణ్ముగం, మధుసూదన్, మునిరాజ, కరుణాకర్, జ్యోతీశ్వర్‌రెడ్డి, రాజశేఖర్, కందాటి గిరిబాబు, జయప్రద, ఉమాదేవి, లక్ష్మీ, లావణ్య, రాణెమ్మ, రెడ్డికుమారి ఉన్నారు. -
జిల్లాలో సమైక్య సెగలు
జిల్లాలో సమైక్య సెగలు హోరెత్తుతున్నాయి. రోజురోజుకూ ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఊరూరా పోరు ఉధృతమవుతోంది. ఎడ్లబండ్లతో.. ట్రాక్టర్లతో.. ఆటోలతో.. పల్లెలు జనకెరటాలై కదులుతున్నాయి. అన్నివర్గాల ప్రజలు ఒక్కటై రోడ్లమీదకొచ్చి సమైక్యాంధ్రకు జైకొడుతున్నారు. శనివారం జిల్లా అంతటా ర్యాలీలు, మానవహారాలు, విభిన్న ప్రదర్శనలతో మోతెక్కిపోయింది. రాష్ట్ర విభజనతో రాజకీయ లబ్ధి పొందాలనే కుయుక్తితో తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ తీరుకు నిరసనగా జగన్, విజయమ్మల రాజీనామాలను జిల్లా ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతించారు. సాక్షి, విజయవాడ :సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు వెల్లువెత్తుతోంది. మచిలీపట్నంలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం వివిధ కళాశాలలకు చెందిన సుమారు మూడువేల మంది విద్యార్థులు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు నిరసన గళం విప్పారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఈ నెల 13న మహాధర్నా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ కోనేరుసెంటర్‌కు చేరుకునే నాలుగు ప్రధాన రహదారులను సైతం దిగ్బంధించాలని నిర్ణయించామన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దు గరికపాడు నుంచి అనుమంచిపల్లి, షేర్‌మహ్మద్‌పేట, చిల్లకల్లు గ్రామాల మీదుగా 65వ నంబర్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట వరకు రైతులతో కలసి ట్రాక్టర్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ ఉదయభాను ట్రాక్టర్ నడుపుతూ పాల్గొన్నారు. మచిలీపట్నం-చల్లపల్లి 216 జాతీయ రహదారిపై మూడు వేల మందికిపైగా ప్రజలు, కార్మికులు నాలుగు కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై నడుస్తూ ర్యాలీ నిర్వహించారు. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ జరిపారు. వందకు పైగా ఎడ్లబండ్లతో చల్లపల్లిలో ర్యాలీ నిర్వహించారు. గుడివాడలో ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు వంటావార్పు, నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ నాయకుల దీక్షలు కొనసాగుతున్నాయి. పామర్రులో సమైక్యాంధ్ర కోరుతూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే సహించేది లేదని టీడీపీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, తంగిరాల ప్రభాకరరావు ప్రకటించారు. కంచికచర్లలో జాతీయ రహదారిపై ముగ్గులువేసి విద్యార్థినులు నిరసన తెలిపారు. పెనుగంచిప్రోలులో సంపూర్ణ బంద్ పాటించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద శనివారం 20 మంది సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష.. ముదినేపల్లిలో వీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ నుంచి వచ్చి పోరంకిలో స్థిరపడిన కల్లుగీత కార్మికులు తాడిగడప సులాబీ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. పెదపారుపూడి మండల పరిధిలోని వెంట్రప్రగడ ప్రధాన సెంటర్లోని గుడివాడ-కంకిపాడు రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. నూజివీడులో శ్రీశక్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉయ్యూరు రిక్షా కార్మికులు ప్రధాన సెంటరులో ప్రదర్శన నిర్వహించి, మానవహారం నిర్మించారు. గులాబీలు పంచి.. కంకిపాడు హవీలా పాఠశాల విద్యార్థులు బస్టాండు సెంటరులో గులాబీలు పంచి సమైక్యాంధ్రకు మద్దతు తెలియచేయాలని కోరారు. ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ ఎదుట ఏపీఈఈ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పెనుగంచిప్రోలులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతమ్మ ఆలయం వద్ద నుంచి ఎడ్లబండ్లపై కేసీఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గన్నవరంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన, రాస్తారోకో జరిగింది. -
సమైక్యాంధ్రను పరిరక్షించుకుంటాం
చెన్నై, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్ర అట్టుడికి పోతోంది. చెన్నైలోని తెలుగువారు సైతం ఉద్యమబాట పట్టారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మైలాపూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో బుధవారం నిరాహారదీక్ష జరిగింది. పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించిన చోట వెలసిన స్మారక మందిరంలోని ఆయన విగ్రహానికి ముందుగా నివాళులర్పించారు. తర్వాత సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి తంగుటూరి రామకృష్ణ ప్రసంగించారు. ఒక మంచికి, మరో చెడ్డకు సైతం తెలుగువారే ముందుండి నిలిచారని అన్నారు. ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారు కావడం అదృష్టమన్నారు. ఒకే భాషను మాట్లాడుకునే వారికి రెండు రాష్ట్రాలు అనే దుష్ట సంప్రదాయానికి నాంది పకిలిన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ తెలుగువారే కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. నిరాహారదీక్షలు చేస్తే చాలు ప్రత్యేక రాష్ట్రాలు వస్తాయనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం దేశానికి చాటిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధి సమష్టికృషిగా ఆయన అభివర్ణించారు. విభజన నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలే విభేదిస్తున్నారని పేర్కొన్నారు. అర్థం లేని డిమాండ్ నిరాహారదీక్ష సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. వీరికి కెన్సెస్ అధినేత కె.నరసారెడ్డి పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లోనే అర్థం లేదని విమర్శించారు. ఎలాంటి చర్యలు చేపడితే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందో విశ్లేషించుకుని దానిపై దృష్టి సారించాలన్నారు. అలా చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోరడం అవివేకమని అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య 30 లక్షలు దాటిందన్నారు. ఈ రెండు ప్రాంతాల వారే లేకుంటే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేకుంటే తెలంగాణకు గుర్తింపే లేదని అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల తీవ్రవాదం, శాంతిభద్రతల సమస్య వంటివి ఏర్పడగలవని ఏనాడో రుజువైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. అనంతరం ఘంటసాల రత్నకుమార్ మాట్లాడారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి చెన్నైలోని తెలుగువారు మద్దతు పలకడం కనీస కర్తవ్యమని అన్నారు. ఈ ఆశయాన్ని సాధించే వరకు ఉద్యమాన్ని విరమించకూడదని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశారని రంగనాయకులు అన్నారు. పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తుల త్యాగాల ఫలంగా సిద్ధించిన ఆంధ్రప్రదేశ్‌ను కొందరి స్వార్థం కోసం విభజించరాదని ఉప్పులూరి విజయలక్ష్మి అన్నారు. విదేశీవనితగా భారత్‌లోకి అడుగుపెట్టిన సోనియాగాంధీకి ఆంధ్రప్రదేశ్ విలువ గురించి ఏమి తెలుసని కృష్ణారావు విమర్శించారు. విభజన ద్రోహులకు, సమైకాంధ్ర ఉద్యమకారులకు తెలుగు సంఘాల వారు ప్రకటించిన అవార్డులను ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులురెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.నారాయణ గుప్త, స్మారక మందిరం కార్యదర్శి రామకృష్ణ, ఆస్కా ట్రస్టీలు ఎరుకలయ్య, విజయేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
8 రోజులుగా రాకపోకల్లేవు
సాక్షి, తిరుపతి : ప్రయాణికులతో కిటకిటలాడే తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఎనిమిది రోజులుగా నిర్మానుష్యంగా మారింది. చూసినంత దూరం ప్లాట్‌ఫారాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్క తిరుపతి ఆర్టీసీ బస్టాండే కాదు. చిత్తూరు రీజియన్‌లోని 14 ఆర్టీసీ బస్‌డిపోల పరిధిలోని 18 బస్టాండ్లలోనూ ఇదే వరస. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సహకరించి విధులకు గైర్హాజరు అవుతుండటంతో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది. ఎనిమిది రోజులుగా జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీనికి తోడు జిల్లాలో రహదారుల దగ్బంధం కొనసాగుతోంది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందం గా రోడ్లపైకి వచ్చి వాహనాలు ఆపేస్తున్నారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం కూడా బస్సులను డిపోలకే పరిమితం చేసింది. చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, సత్యవేడు, పుంగనూరు, పల మనేరు వంటి పట్టణాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కేవలం ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయించి ప్రజలు గమ్యస్థానాలకు వెళ్తున్నారు. తమిళనాడు, కర్ణాటక బస్సు సర్వీసులను కూడా ఆయా రాష్ట్ర సంస్థలు నిలిపేశాయి. రీజియన్‌కు రూ.11 కోట్ల నష్టం ఆర్టీసీ చిత్తూరు రీజియన్‌కు ఇప్పటి వరకు రోజుకు రూ.1.25 లక్షల చొప్పున ఎనిమిది రోజులకు రూ.11 కోట్ల వరకు నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 14 డిపోల్లో 1450 దూర ప్రాంత బస్సులు రోడ్డెక్కకపోవటంతో ఈ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మాత్రం ఉద్యమకారులు మినహాయింపు ఇవ్వటంతో 450 బ స్సుల వరకు తిరుగుతున్నాయి. జిల్లాలో మారుమూ ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఒకటి అర గ్రామీణ స ర్వీసులు, దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసు లు, హైటెక్, వోల్వో సర్వీసులు కదలడం లేదు. ఇప్ప టి వరకు అలిపిరి డిపో పరిధిలో ఒక బస్సు స్వల్పం గా దగ్ధం కాగా, సత్యవేడు డిపో పరిధిలో రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు రైళ్లలో వెళ్తున్నారు. దీంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ వాహనాల నిలువుదోపిడీ ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాలకు వరంగా మారింది. సామాన్య ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణా లైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, పలమనే రు, మదనపల్లి, పుంగనూరుకు సమీప గ్రామాల నుంచి రోజువారి ఉపాధి కోసం వచ్చేవారు, చిరు వ్యాపారాలు సెవెన్సీటర్లను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. తిరుపతి నగరంలో సిటీ బస్సులు తిరగకపోవటంతో కొద్ది దూరానికి కూడా కనీసం రూ.50 ఇవ్వనిదే ఆటోవారు రావటం లేదు. దీంతో సామాన్యులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సెవెన్ సీటర్లే దిక్కుగా మారాయి. హైవేల పై సెవెన్సీటర్లు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్లచేస్తున్నాయి -
విద్యార్థుల దీక్షలు భగ్నం
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉదయం నుంచి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో విద్యార్థులను 108 వాహనంలో అత్యవసరంగా కేజీహెచ్‌కు తరలించారు. ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో విద్యార్థులు నీరసించిపోయారు. నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. అంతకుముందు దీక్షా స్థలంలో వారు సందర్శకులకు కరచాలనం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఏయూ వైద్యుడు బాలకృష్ణ వచ్చి విద్యార్థులకు ప్రాథమిక వైద్య పరీక్షలు జరిపారు. విద్యార్థులకు రక్తపోటు తగ్గడంతో పాటు, రక్తంలో షుగర్ స్థాయి పడిపోవడం గమనించారు. ఆరేటి మహేష్‌కు ఉదయం చాతీలో నొప్పితో సతమతమయ్యాడు. దీనితో ఉదయం పదకొండు గంటల నుంచి దీక్షా శిబిరం వద్ద విద్యార్థుల్లో ఆందోళన ప్రారంభయింది. అదే సమయంలో లగుడు గోవింద్ స్పృహ కోల్పోయాడు. దీనితో ఆందోళన చెందిన విద్యార్థులు చుట్టూచేరి వారికి సపర్యలు చేపట్టడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. వైద్యులు సైతం విద్యార్థులకు ఫ్లూయడ్స్ అందించాలని సూచించారు. దానికి వీరు నిరాకరించారు. సమైక్యాంధ్ర కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తామని నినదించారు. జిల్లా యంత్రాంగం ఆర్డీఓ, ఎంఆర్ఓ అధికారులెవరూ రాకపోవడం, వైద్యం అందించడానికి వైద్యబృందం వంటివి ఏర్పాటుచేయపకోవడంపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. చివరకు దీక్ష చేస్తున్న విద్యార్థులను బలవంతంగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.