న్యూయార్క్: నవ్వడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండట మే కాదు.. ఆయుష్షు కూడా పెరుగుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. అయితే హాస్య చతురత కేవలం ఆయుష్షును మాత్రమే కాదు, వ్యక్తిలో పోటీతత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ.. ఉన్నతస్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుందట. సాధారణంగా ఆఫీసులో వాతావరణం గంభీరంగా ఉంటుంది. బాస్ ఏమంటారోనని ఉద్యోగులు పెద్దగా మాట్లాడుకోరు.. జోకులు వేసుకోరు. కానీ.. ఆఫీసులో జోకులు వేస్తూ సరదాగా గడిపేవారు బాగా పని చేయడంతోపాటు.. పోటీతత్వాన్ని కలిగి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.
వార్టన్ స్కూల్ అండ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు సరదాగా, గంభీరంగా 457మందిపై ఎనిమిది రకాల పరీక్షలు నిర్వహించింది. కొన్ని జోకులను వారికి చెప్పి ప్రేక్షకులకు చెప్పమన్నారు. అయితే హాస్యచతురత ఉన్నవాళ్లు చెప్పిన జోకులకు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. కొందరు వేసిన జోకులకు ఎవరూ నవ్వలేదట. తర్వాత వారిని విశ్లేషిస్తే.. బాగా నవ్వించిన వారిలో ఆత్మస్థైర్యం, పోటీతత్వం ఎక్కువగా ఉన్నాయట. అంతేకాదు.. అందులో చాలా మంది గ్రూపు లీడర్లుగా ఎన్నికైనవారున్నారట.
నవ్విస్తే విజయం మీదే!
Published Sun, Feb 12 2017 12:54 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
Advertisement
Advertisement