కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వుతామో తెలుసా! | The Science Reveals Secret Of Why Do We Laugh When Tickled | Sakshi
Sakshi News home page

కితకితలు పెట్టగానే నవ్వు తన్నుకుంటూ ఎలా వస్తుందో తెలుసా! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

Jan 21 2024 10:25 AM | Updated on Jan 21 2024 10:39 AM

The Science Reveals Secret Of Why Do We Laugh When Tickled - Sakshi

కితకితలు పెడుతున్నారనంగానే నవ్వు ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది. ముఖ్యంగా చిన్నిపిల్లల ఏడుపు ఆపించాలనుకున్నప్పుడూ కితకితలు పెడుతుంటా.  జస్ట్‌ అలా పెట్టేందుకు యత్నించంగానే నవ్వు తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆపుకోవడం కష్టం కూడా. అయితే మనంతట మనం పెట్టుకుంటే నవ్వు రాదు. అవతలివాళ్లు పెడితేనే నవ్వు వస్తుంది. ఎందుకిలా? అస్సలు కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వు వస్తుంది?.  తదితర ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం!

ఇలా చక్కిలిగింతలు పెట్టగానే నవ్వడానికి వెనుకున్న సైన్స్‌ ఉందంట. సాక్షాత్తు ఎవల్యూషనరీ బయాలజిస్టులు, న్యూరో సైటింస్టులే చక్కిలగింతలు పెడితే కచ్చితంగా నవ్వుతామని, దాని వెనుకు ఉన్న కారణాలను కూడా వివరించారు. సున్నితమైన స్పర్శను అనుభవించినపుడు మెదడులోని హైపోథాలమనస్ ప్రాంతం నవ్వమని ఆదేశాలు ఇస్తుందిట. చేతుల క్రింద, గొంతు దగ్గర, పాదాల క్రింద చక్కిలిగింతలు పెడితే నవ్వు ఆపుకోలేం. అందుకే కితకితలు పెడితే అరవడం, విదిలించుకోవడం, ఎగరడం వంటివి చేస్తుంటాం. అయితే కొందరిలో చక్కిలిగింతలు ఇష్టపడరు. వారిలో నాడులు తీవ్రమైన ఒత్తిడికి లోనై కోపం ప్రదర్శిస్తారు.

నవ్వు ఎలా వస్తుంది?
మన శరీరంపై ఎవరైనా కితకితలు (చక్కిలిగింతలు) పెడితే, వాటి వల్ల కలిగే అనుభవాన్ని మెదడులోని రెండు ప్రదేశాలు పంచుకుంటాయి. అందులో ఒకటి సొమాటో సెన్సరీ కార్టెక్స్‌. ఇది శరీరానికి స్పర్శజ్ఞానం కలుగజేస్తుంది. రెండోది ఏంటీరియర్‌ సింగులేట్‌ కార్టెక్స్‌. ఇది ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఈ రెండు అనుభూతుల వల్ల మనం సిగ్గుపడుతూ, నవ్వుతాము. మనకై మనం చక్కిలిగింత పెట్టుకున్నప్పుడు ఈ రెండు ప్రదేశాలు అంతగా ఉత్తేజం చెందవు. 

మనకు మనం పెటుకుంటే నవ్వు ఎందుకు రాదంటే..
మెదడు వెనుక భాగంలో ఉన్న చిన్న మెదడు మీకు మీరే కితకితలు పెట్టుకోబోతున్నారని ముందుగానే మెదడుకి సంకేతాలు ఇస్తుంది. దాని వల్ల మెదడు సరైన సంకేతాలు ఇవ్వదట. అందుకే మనకి మనం కితకితలు పెట్టుకుంటే నవ్వు రాదట. పిల్లల్ని ఆట పట్టిస్తూ చక్కిలిగింతలు పెడతారు. వారిలో నవ్వడం నేర్పడానికి అలా చేస్తారు. నవ్వు అనేది ఒక అంటువ్యాధిలా అంతటా ఆవరిస్తుంది. ఒకరు నవ్వడం ప్రారంభిస్తే ఆ ప్రదేశంలో ఉన్నవారంతా నవ్వుతారు. నవ్వు వల్ల సమాజంలో మంచి సానుకూల బంధాలు ఏర్పడతాయి.

చక్కిలిగింతల రకాలు
1897 లో ఇద్దరు శాస్త్రవేత్తలు చక్కిలిగింతల మీద పరిశోధన చేసారట. చక్కిలిగింతలు రెండు రకాలుగా ఉంటాయట. చర్మం మీద చిన్న కదలిక వల్ల కలిగే చక్కిలిగింత మొదటి రకానికి చెందింది. దీని వలన నవ్వు రాకపోగా చిరాకు కలగచ్చు. చక్కిలిగింతలు పుట్టే చోట పదే పదే సున్నితంగా తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు, ఇవి రెండవ రకానికి చెందిన చెక్కిలిగింతలు.

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు, నాలుగు వేల కోట్లు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement