
నవ్వు...ఆనందపు పువ్వు
జపాన్ శాస్త్రవేత్త యోజి కిమూరా అభిప్రాయంలో నవ్వు ఒక ఆయుధం. నవ్వుతో ప్రపంచ యుద్ధాలను నివారించవచ్చట. ఆయన నవ్వుల్ని కొలిచే ఒక పరికరాన్ని కనుగొన్నాడు.
నవ్వుల కొలమానంలో ఒక యూనిట్‌ని 'aH' అని యోజి కిమూరా పేర్కొన్నారు. చిన్నపిల్లలు హాయిగా, స్వేచ్ఛగా నవ్వుతారు. సెకనుకి వారు అనేక 'aH'ల నవ్వును పూయిస్తారట. ఒసాకాలోని కాన్‌సాయి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే యోజి కిమూరా నవ్వుల్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు. పెద్దవారు స్వేచ్ఛగా నవ్వరు. పెద్దవారు లñ క్కగట్టి, మితంగా నవ్వుతారు. నవ్వటం అనేది, కంప్యూటర్‌లో ‘రీస్టార్ట్’ ఫంక్షన్ వంటిదంటారాయన. మానవ జీవన పరిణామంలో హాయిగా నవ్వటం చాలా ముఖ్యమైనది.
ఈయన సిద్ధాంతం ప్రకారం నవ్వులో నాలుగు ప్రధాన దశలున్నాయి. అవి– కాస్తంత హాయిగా నవ్వటం, మామూలు స్థితి నుండి వేరు కావటం, పూర్తి హాయిగా నవ్వటం, నవ్వుల్ని పకపకా నవ్వటం. మనిషి మెదడులో నవ్వే సర్క్యూట్ ఉంది. అదే ఈ నవ్వటంలో ఉండే దశల్ని నిర్దేశిస్తుంది. మనిషి నవ్వుల్ని లెక్కకట్టటానికి ఈయన మనిషి కడుపు చర్మానికి ‘సెన్సర్ల’ను (గుర్తించే పరికరాలు) అతికించి పెడ్తాడు. మనిషి శరీరంలో సెకనుకి 3000 సార్లు ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లను, తద్వారా వచ్చే శరీర కదలికలను సెన్సర్ల యంత్రం రికార్డ్ చేస్తుంది. నవ్వుల్ని కొలిచే పరికరాన్ని మొబైల్ ఫోన్ అంత సైజులో తయారు చేయాలని ఆశ పడుతున్నారు. దీన్ని హెల్త్ పరికరంగాను, వినోద పరికరంగాను మార్కెట్ చేయాలని ఆయన ఉద్దేశం.