జర్నలిస్టుల కొవ్వొత్తుల ప్రదర్శన | Candle appearance journalists | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల కొవ్వొత్తుల ప్రదర్శన

Published Thu, Jan 26 2017 10:26 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

జర్నలిస్టుల కొవ్వొత్తుల ప్రదర్శన

జర్నలిస్టుల కొవ్వొత్తుల ప్రదర్శన

 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): విభజన చట్టం హామీ మేరకు వెంటనే ఆధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే  జిల్లా అధ్యక్షుడు టి.అంబన్న డిమాండ్‌ చేశారు. గురువారం ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌లోని గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు హుస్సేన్, రాజు, రాఘవేంద్రారెడ్డి, ధరణి కిశోర్, ఇస్మాయిల్, వీడియో జర్నలిస్టుల సంఘం నాయకులు స్నేహాల్, మౌలాలి, చాంద్‌బాష, మధు, చెన్నయ్య పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి పిలుపును అందుకొని కర్నూలు జిల్లాలో ప్రత్యేక హోదా కోసం క్యాండిల్‌ లైట్ల నిరసన కార్యక్రమాలు విజయవంతం అయినట్లు ఆసంఘం కోశాధికారి హుస్సేన్‌ తెలిపారు. కర్నూలు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, కొడుమూరు, నంద్యాల, బనగానిపల్లెలతోపాటు పలు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగినట్లు వివరించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement