హైదరాబాద్ : గాలి దుమారంతో కూడిన భారీ వర్షానికి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో వద్ద నెక్సాషోరూం ముందు కుప్పకూలిన యూనిపోల్ హోర్డింగ్ యజమానితో పాటు కాంట్రాక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం భారీ వర్షానికి ఈ షోరూం ముందు ఏర్పాటు చేసిన హోర్డింగు కుప్పకూలడంతో పది వాహనాలు ధ్వంసమయ్యాయి. తాను పని నిమిత్తం తన ఇన్నోవా ఏపీ 09 సీటీ 7776లో వచ్చి పార్కింగ్ చేసి షోరూంలోకి వెళ్లానని కొద్దిసేపటికీ హోర్డింగ్ కూలి తన వాహనం నుజ్జునుజ్జైందని ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ కారు యజమాని ఆదిత్య జైన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూనిపోల్ హోర్డింగ్ ప్రకాశ్ ఆర్ట్స్ యజమానిపై ఐపీసీ సెక్షన్ 336 కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా కుప్పకూలిన హోర్డింగ్‌ను గ్యాస్‌కట్టర్లు, క్రేన్ల సహాయంతో శుక్రవారం రాత్రి నుంచి తొలగింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి పూర్తిగా విరిగిన హోర్డింగ్ సామాగ్రి, వాహనాలను తరలించారు.
కూలిన హోర్డింగ్ :యజమానిపై క్రిమినల్ కేసు
Published Sat, May 21 2016 6:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement