దిగ్విజయ్‌సింగ్‌పై కేసు నమోదు
Published Thu, May 4 2017 2:18 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM
హైదరాబాద్: పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడినందుకుగాను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ పోలీసులే ఐసిస్ పేరుతో వెబ్‌సైట్ రన్ చేస్తున్నారని దిగ్విజయ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దిగ్విజయ్‌పై 505 1ఏ, 1బీ, క్లాస్ 2 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Advertisement
Advertisement