సాక్షి,విశాఖపట్నం: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కంపెనీపై కేసు నమోదైంది. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్గదర్శి సీతంపేట అకౌట్ అసిస్టెంట్ వీ లక్షణ్‌రావు, ఆఫీస్ బాయ్‌శ్రీనులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
కాగా మంగళవారం తనిఖీల్లో మార్గదర్శి సీతంపేట బ్రాంచి నుంచి రూ. 52 లక్షలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మార్గదర్శి సిబ్బంది ఇద్దరి వద్ద రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. దీనిపై వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును, చెక్కులు పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment