లెక్చరర్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు | case file on over Lecturer facing 'ISI threat' killed in accident | Sakshi

లెక్చరర్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు

Published Fri, Sep 30 2016 4:25 PM | Last Updated on Wed, Aug 15 2018 7:18 PM

లెక్చరర్ ప్రవీణ్‌కుమార్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో అతని కుటుంబసభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వరంగల్: లెక్చరర్ ప్రవీణ్‌కుమార్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో అతని కుటుంబసభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని ఎంఎస్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ రెండు రోజుల క్రితం వరంగల్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. అయితే, అంతకుముందే తను పనిచేస్తున్న కళాశాలలో ఐఎస్ తీవ్ర వాద శిక్షణ కొనసాగుతోందని, తన ప్రాణాలుకు ముప్పు ఉందని ప్రవీణ్ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాడు. దీంతో కళాశాల నిర్వాహకులే అతడిని వేధించి మరణానికి కారణ మయ్యారని ఆరోపిస్తూ అతని కుబుంబసభ్యులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వారు వెంటనే హైదరాబాద్ రానున్నారు. ఇక్కడి పోలీసు అధికారుల సహకారంతో కేసు దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement