
బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత అరుణ్ కుమార్ పుతిల పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 47 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు వివరాల ప్రకారం.. 2023 జూన్‌లో బెంగళూరు హోటల్‌లో బీజేపీ నాయకుడు అరుణ్ కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసి వాటిని అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపించారు.
మహిళ ఫిర్యాదు మేరకు దక్షిణ కన్నడ జిల్లాలో అరుణ్ కుమార్‌పై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్, బెదిరింపులు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా పుత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన పుతిల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన కాషాయ పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment