అనంతపురం సెంట్రల్ : అనంతపురం అరవింద్‌నగర్‌లో నివాసముంటున్న న్యాయవాది గంగాధర్‌పై బుధవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక టూ టౌన్ పోలీసులు తెలిపారు. గోరంట్లకు చెందిన ఓ మహిళకు సదరు లాయర్ రూ.3 లక్షలు అప్పు ఉన్నారన్నారు. వాటిని అడిగేందుకు వచ్చిన అమెను దూషించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించినట్లు వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.