gangadhar
-
భర్త మరొకరితో వివాహం! భార్య తీవ్ర నిర్ణయం..
నిజామాబాద్: తనకు తెలియకుండా మరో వివాహం చేసుకన్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఓ బాధితురాలు ఆందోళన చేపట్టింది. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్‌కు గంగాధర్‌తో బాల్కొండకు చెందిన కావ్యతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇద్దరి మధ్య గొడవల కారణంగా కావ్య బాల్కొండలో తల్లివద్ద ఉంటోంది. గొడవకు సంబంధించిన కేసు కోర్టులో ఉంది. 15 రోజుల క్రితం గంగాధర్ మరో వివాహం చేసుకున్నాడు. దీంతో కావ్య ఫత్తేపూర్‌లో తన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. తనను మోసం చేసిన భర్త గంగాధర్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరారు. ఇవి చదవండి: సొంత బావతో అక్రమ సంబంధం! భర్తను దారుణంగా.. -
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్‌రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్‌ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్‌రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్‌ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
సైన్స్‌కు ఆధారం ఆధ్యాత్మికతేనా?
శేర్ (సిరాజ్) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హర ఓం హర’. అశోక్ కుల్హర్, దేవేంద్ర మదన్ సింగ్ నేగి నిర్మిస్తు్తన్న ఈ చిత్రంలో గంగాధర్, కర్ణిక ఇతర ముఖ్య తారాగాణం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లాలో ముగి సింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఆధ్యాత్మికత అంతా సైన్స్‌తోనే ముడిపడి ఉందని, సైన్స్‌కు ప్రధాన వనరు ఆధ్యాత్మికతేనని నిరూపిస్తూ రూపొందిస్తున్న సినిమా ఇది. తెలుగుతో ΄ాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో సుమన్, ఆమని కీలక ΄ాత్రధారులు. -
ఐపీఎల్ బెట్టింగ్ భారీగా పట్టుబడ్డ డబ్బు
-
బతికుండగానే తండ్రికి నరకం చూపిన 'పల్లె' ముఖ్య అనుచరుడు
పున్నామనరకం నుంచి తప్పించువాడు పుత్రుడంటారు. కానీ ఊరందరికీ నీతులు చెప్పే ఓ పచ్చనేత తండ్రికి మాత్రం బతికుండగానే నరకం చూపించాడు. వేళకింత భోజనం కూడా పెట్టకుండా వేధించాడు. ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ కూడా లాగేసుకునే కుమారుడు.. తనను తీవ్రంగా వేధించడాన్ని భరించలేని ఆ 67 ఏళ్ల వృద్ధుడు పాఠశాల భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లికి చెందిన గుట్లపల్లి అంజినప్ప (67)కు ఒక్కగానొక్క సంతానం గుట్లపల్లి గంగాధర్. అంజినప్ప భార్య 15 ఏళ్ల క్రితమే మరణించగా...కుమారుడి వద్దే కాలం గడుపుతున్నాడు. పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అనుచరుడైన గంగాధర్ ఆస్తి అంతా రాయించుకుని తండ్రి బాగోగులు పూర్తిగా విస్మరించాడు. కనీసం వేళకింత భోజనం కూడా పెట్టేవాడు కాదు. చివరకు ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ డబ్బు కూడా లాగేసుకునేవాడు. దీంతో అంజినప్ప వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాడు. ఇటీవల కుమారుడు ఈసడింపులు ఎక్కువకావడంతో మనోవేదనకు గురైన అంజినప్ప బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం పైకెక్కి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దీన్ని సాధారణ మరణంగా చిత్రీకరించిన గంగాధర్... గుట్టు చప్పుడు కాకుండా తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆవరణలో ఉంచాడు. దీన్ని చుట్టుప్రక్కల వారు గమనించడంతో విషయం పోలీసుల వరకూ చేరింది. ఈ విషయంపై అర్బన్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని వివరణ కోరగా... సంఘటన గురించి తమకూ తెలిసిందని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపుతామన్నారు. -
చిరంజీవి మేనేజర్ తల్లి కన్నుమూత!
మెగాస్టార్ చిరంజీవి మేనేజర్ నరాలశెట్టి గంగాధర్ తల్లి సత్యవతి (పాపాయమ్మ) కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే! తాజాగా ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శివచెర్రీ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. 'గంగాధర్ తల్లి సత్యవతిగారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అమ్మా.. నీ ఆత్మకు శాంతి కలుగు గాక! గంగాధర్ అన్న ధైర్యంగా ఉండు' అని ట్వీట్ చేశాడు. కాగా తన తల్లి సత్యవతి కనిపించకుండా పోయిందని గంగాధర్ ఇటీవలే మీడియాకు తెలిపాడు. జ్ఞాపకశక్తి కోల్పోయిన కారణంగా ఇల్లు విడిచి వెళ్లిపోయిందని, ఎవరికైనా కనిపిస్తే తనకు తెలియజేయాలంటూ తల్లి ఫొటోను కూడా విడుదల చేశాడు. ఇంతలోనే ఆమె మృతి చెందిన వార్త బయటకు వచ్చింది. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. Our Beloved Brother @NsGangadhar1 garu’s Mother ( SatyaVathi Garu ) Left the World . Rest In Peace Amma Garu 💐💐💐💐💐 Stay Strong Gangadhar Anna pic.twitter.com/B3PCtQU8AX — SivaCherry (@sivacherry9) October 15, 2022 చదవండి: తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు కృష్ణం రాజు కుమార్తె ఇనయనే నా బాయ్‌ఫ్రెండ్ వెనకాల తిరుగుతోంది: సూర్య ప్రేయసి -
రహదారుల వైద్యుడు గంగాధర్ ను సత్కరించిన ధృవ కాలేజ్ మేనేజ్మెంట్
-
తిరుపతిలో దారుణం
తిరుపతి: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో టీటీడీ కాంట్రాక్టు కార్మికుడు గంగాధర్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన గంగాధర్‌ను దగ్గరలోని రుయా ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక రుయా ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని గంగాధర్ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. తల్లి, కుమారుడు మృతిచెందడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కడ వరకు విప్లవ స్వప్నాలే
నక్సల్బరీ విప్లవోద్యమంలో కొండపల్లి సీతారామయ్యది చాల విశిష్టమైన పాత్ర. ఈ 16 ఏళ్ల పాటు పూర్తిగా విస్మృతికి గురైన ఆయన పేరిట సంస్మరణలు లేవు, స్మృతి గీతాలు లేవు, స్తూపాలు లేవు.. ఓ గుర్తింపులేని హీరోగా మిగిలిపోయారు. వ్యవస్థ మార్పు కోసం, సమ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడిన త్యాగశీలి, మార్గదర్శకుడు కొండపల్లి సీతారామయ్య అమరులై నేటికి 16 సంవత్సరాలు. ఆయన సహచరులు, అనుచరులు, అభిమానులు ఆయన్ని కె. ఎస్ అనీ, పెద్దాయన అనీ పిలుచుకుంటారు. దాదాపు దశాబ్దం పైబడి అల్జీమర్స్ వ్యాధితో బాధపడి 2002 ఏప్రిల్ 12న ఆయన తన సుదీర్ఘ విప్లవ ప్రస్థానం చాలిం చారు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సమాజంలో, ఇతర రాష్ట్రాలలోను వ్యవస్థ మార్పుకోసం సాగుతున్న ఉద్యమాలను వారు ప్రభావితం చేసిన సంగతి తెలి సిందే. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చారు మజుందార్ వంటి ఉన్నత స్థాయి కలిగిన అగ్రశ్రేణి నాయకుడాయన. నక్సల్బరీతో ప్రారంభమైన విప్లవోద్యమంలో ఆయనది చాల విశిష్టమైన, విస్మరించరాని పాత్ర. ఈ16 ఏళ్ల పాటు పూర్తిగా విస్మృతికి గురైనారు. ఆయన పేరిట సంస్మరణలు లేవు, స్మృతి గీతాలు లేవు, స్తూపాలు లేవు, స్మారకోపన్యాసాలు లేవు. ఓ గుర్తింపులేని హీరోగా మిగిలిపోయారు. అల్జీమర్స్‌తో బాధ పడుతున్న జార్జి ఫెర్నాండేజ్‌ని వారి అనుయాయులు ఎంతో అపురూపంగా చూసుకుం టున్నారట. అల్జీమర్స్ వ్యాధి గురించి మన సమాజానికి, ప్రత్యేకంగా ఉద్యమ శ్రేణులకు సరైన అవగాహన ఉండి వుంటే ఆయన పట్ల మరింత సహానుభూతి, సానుకూల దృక్పథం కలిగి ఉండే వారేమో! కాని చనిపోయే నాటికి ఒక దశాబ్దం ముందు నుంచే నిశ్శబ్దంగా, దొంగలా ఆయనలో ప్రవేశించిన అల్జీమర్స్ మాత్రం ఆయన్ని తన సహచరులకు దూరం చేసింది. అలాంటి స్థితిలో ఉండి కూడా ఆయన విప్లవ స్వప్నాలే కన్నారు. రోగ లక్షణంగా ఆయనకొచ్చిన మానసిక భ్రాంతుల్లో కూడ విప్లవ సైన్యం కదలికలు, కవాతులే ఉండేవి. మొగల్రాజపురంలోని ఇంటి పైన టెర్రస్ మీద కూర్చుని ఎదురుగా రోడ్డు పైన వెళ్తున్న జనాన్ని, వాహనాలను చూపిస్తూ రెడ్ ఆర్మీ కవాతుగా భ్రమించేవారు. ఆయన్ని చూడటానికి వచ్చిన అందరినీ పార్టీ పని చేయమని ప్రేరేపించేవారు. ఏ కారణం వల్లనైనా మేము అభ్యంతరపెడితే.. మీరు చెయ్యరు.. చేసేవాళ్లతో చేయిం చుకుంటుంటే అడ్డుపడతారు అనేవారు. తన మనవరాలు సుధ, నేను పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తల్లా పని యకుండా ఆమె లా కాలేజీ లెక్చరర్ గాను, నేను హాస్పిటల్ నడుపుతూ ఉండటం ఆయనకంతగా నచ్చేది కాదు. ఒకరోజు నా మూడేళ్ల కూతురితో ‘మీ నాన్న దొంగ. పార్టీ పని చేయకుండా డాక్టరై హాస్పిటల్ నడుపుతున్నాడు’ అన్నారు. దానికా పసిది పెద్దగా ఏడుస్తూ తనమీద కొట్లాటకు దిగింది. దాంతో కలవరపడి పసిదాన్ని బాధ పెట్టానే అని కలత చెందిన సున్నిత మనస్కుడాయన. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కె.ఎస్.ది ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన అధ్యాయం. తెలంగాణా సాయుధ పోరాటకాలంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శిగా ఆయన చాల కీలక పాత్ర నిర్వహించారు. చండ్ర రాజేశ్వరరావుతో కలిసి అనుబంధ ప్రజాసంఘాల నిర్మాణంలో, ముఖ్యంగా రైతు సంఘం, ప్రజా నాట్యమండలి నిర్మాణంలో కె.ఎస్ది ముఖ్యపాత్ర. అనంతర కాలంలో నక్సల్ బరీ ఉద్యమంతో సి.పి.ఐ(ఎం.ఎల్) పార్టీ ఏర్పడినప్పుడు, ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలో తన పూర్వ అనుభవాన్నంతా రంగరించి పార్టీకి ‘మాస్ లైన్’ అందించటంలో తనదే ముఖ్య పాత్ర. రాడికల్ విద్యార్థి సంఘానికి వేసవి సెలవుల్లో ‘గ్రామాలకు తరలండి. పేద మధ్య తరగతి ప్రజలతో మమేకం కండి’ అని పిలుపునిచ్చారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు ముందుగా దళితవాడల్లో, బీసీవాడల్లో కాంపెయిన్ చెయ్యాలని, దళితవాడల్లో వాళ్లు పెట్టిందే తిని, రాత్రిపూట బస కూడా అక్కడే చేయాలని, వారితో పూర్తిగా మమేకం కావాలని ఆయనిచ్చిన డైరెక్షన్. ఆ పిలుపు మేరకు ప్రొఫెషనల్ కాలేజీలు, యూనివర్సిటీల నుంచి వేలాది మంది విద్యా ర్థులు గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్లి సామాన్య ప్రజ లతో మమేకమై ఉద్యమ స్ఫూర్తి రగిలించారు. 2009లో కూర రాజన్న అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొందరు మిత్రులం ఆయన్ని చూడటానికి వెళ్ళాం. నన్ను చూడగానే రాజన్న ప్రస్తావించిన మొదటి విషయం కె.ఎస్.కు విజయవాడలో స్తూపం కట్టాలని. నాతో వచ్చిన మిత్రుడొకరు కె.ఎస్. గురించి మీ అభిప్రాయం ఏమిటి అని రాజన్నను అడిగాడు. దానికాయన ‘కె.ఎస్. మా గురువు’ అన్నారు. అదేంటి మీ పార్టీ ఆయన పార్టీ వేరు వేరు కదా... కరీంనగర్ జిల్లాలో మీ రెండు గ్రూపుల దళాలు చంపుకునే వరకు వెళ్లాయి కదా అని ఆ మిత్రుడు మళ్లీ ప్రశ్నించాడు. దానికాయన ‘అవన్నీ క్షేత్రస్థాయిలో ఆచరణలో దొర్లిన పొరపాట్లు. ఉద్యమపరమైన ఎత్తుగడల విషయంలో ఆయన మాకు గురువే. ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధం పెరిగినప్పుడు మేము ప్రతిఘటనా పోరాటానికి పిలుపు నిచ్చాం. కె. ఎస్. అందుకు భిన్నంగా దండకారణ్యానికి విస్తరించమని పిలుపునిచ్చారు. ఆయనే కరెక్ట్ అని చరిత్ర రుజువు చేసింది‘ అన్నారు. రాజన్న అంచనా వేసిన రీతి లోనే చరిత్ర, భవిష్యత్తు తరాలు కొండపల్లి సీతారామయ్యని అంచనా వేస్తాయని నా ప్రగాఢ నమ్మకం. డాక్టర్ జి.గంగాధర్ (నేడు విప్లవోద్యమనేత కొండపల్లి సీతారామయ్య 16వ వర్థంతి సందర్భంగా) వ్యాసకర్త ప్రముఖ వైద్యులు, విజయవాడ మొబైల్ 98483 34761 -
కారుడ్రైవర్ కిడ్నాప్ కలకలం
డబ్బు కోసం నిర్బంధించిన కాంట్రాక్టర్ పోలీసుల చొరవతో బాధితుడికి విముక్తి అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగరంలో కారుడ్రైవర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. కారు మరమ్మతులకు సంబంధించి ఇవ్వాల్సిన డబ్బు కోసం ఓ కాంట్రాక్టర్ తన వద్ద డ్రైవర్‌గా పని చేసే వ్యక్తిని మూడు రోజులుగా నిర్బంధించాడు. పోలీసుల రంగప్రవేశంతో బాధితుడికి విముక్తి కలిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం మేడిమాకులపల్లికి చెందిన రఘురామ్చౌదరి అనే కాంట్రాక్టర్ అనంతపురంలోని శ్రీనగర్‌కాలనీలో నివాసముంటున్నాడు. ఈయనకు నల్లచెరువు వద్ద స్టోన్ క్రషర్ ఉంది. ఆయన వద్ద కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లికి చెందిన ఎరికల గంగాధర్ కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్ని నెలల క్రితం కారును తీసుకెళ్లిన డ్రైవర్ వాహనం మరమ్మతులకు వచ్చిందని చెప్పాడు. మరమ్మతులు చేయించి తీసుకురా అని కాంట్రాక్టర్ ఆదేశించాడు. అయితే గంగాధర్ మరమ్మతు చేయించకపోగా.. కారును కూడా అప్పగించకుండా తప్పించుకు తిరుగుతుండేవాడు. అయితే మరమ్మతులకు అయ్యే ఖర్చు రూ.15 వేలు ఇవ్వాలని తెలపగా.. ఇస్తానని డ్రైవర్ ఒప్పుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు కాంట్రాక్టర్ హెచ్చరించినా ఫలితం లేకపోయింది. మూడు రోజుల క్రితం గంగాధర్‌ను ఇంటికి పిలిపించుకుని ఓ గదిలో నిర్బంధించాడు. చేతులు కట్టేసి విపరీతంగా కొట్టాడు. గంగాధర్‌కు శనివారం సెల్‌ఫోన్ చిక్కడంతో వెంటనే బంధువులకు సమాచారం అందించాడు. వారు వెంటనే అనంతపురం నాలుగో పట్టణ ఎస్ఐ శ్రీరామ్‌కు తెలిపారు. సీఐ శ్యాంరావ్, ఎస్ఐలు శ్రీరామ్, సాగర్ తమ సిబ్బందితో శ్రీనగర్‌కాలనీకి వెళ్లి నిర్బంధంలో ఉన్న డ్రైవర్‌కు విముక్తి కల్పించారు. అనంతరం కాంట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
చీఫ్ ఇంజనీర్ ఆస్తులు 100 కోట్లకు పైనే!
-
చీఫ్ ఇంజనీర్ ఆస్తులు 100 కోట్లకు పైనే!
విశాఖపట్నం: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ ఎం. గంగాధర్‌తో పాటు రోడ్డు కాంట్రాక్టర్ నాగభూషణంపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తుండటంతో.. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీరిద్దరి ఇళ్లతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, హైదరాబాద్‌ల్లో సుమారు 20 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 11 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి రాంకీ టవర్స్‌లో రూ. 8 కోట్ల విల్లా, కూకట్పల్లి వివేకానందనగర్‌లో ఓ ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూకట్పల్లి నివాసంలో రూ. 40 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు వివిధ చోట్ల సోదాల్లో 50 లక్షల విలువైన బంగారం, 5 బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ల ప్రకారం 8 కోట్ల ఆస్తులను కనుగొన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. విజయవాడలోని కాంట్రాక్టర్ నగభూషనం ఇంట్లో సైతం రూ. 40 లక్షలు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పీలేరులోని గంగాధరం బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో 19 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. -
న్యాయవాదిపై కేసు నమోదు
అనంతపురం సెంట్రల్ : అనంతపురం అరవింద్‌నగర్‌లో నివాసముంటున్న న్యాయవాది గంగాధర్‌పై బుధవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక టూ టౌన్ పోలీసులు తెలిపారు. గోరంట్లకు చెందిన ఓ మహిళకు సదరు లాయర్ రూ.3 లక్షలు అప్పు ఉన్నారన్నారు. వాటిని అడిగేందుకు వచ్చిన అమెను దూషించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించినట్లు వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ట్రాక్టర్ బోల్తా: యువకుడి దుర్మరణం
చిలమత్తూరు : కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోగల దేవర గుడ్డపల్లి(గడిదం) చెరువులో ట్రాక్టర్ బోల్తా పడి అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కందూరుపర్తికి చెందిన డ్రైవర్ గంగాధర్(27) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కందూరుపర్తికి చెందిన నిడిమామిడమ్మ, ఆదినారాయణప్ప కుమారుడు గంగాధర్ జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం బాగేపల్లి సమీపంలోని గడిదం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ట్రాక్టర్‌ను డ్రైవ్ చేసుకుంటూ చెరువులో వస్తుండగా అదుపు తప్పి గుంతలో బోల్తా పడటంతో మరణించినట్లు వివరించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలో వీరుడు..
పిసాపోలో జాతీయ జట్టుకు ఎంపికైన వీరగంగాధర్ తునిరూరల్ (తుని) : ప్రోత్సహం లభించడంతో.. క్రీడల్లో అసమాన ప్రతిభతో మట్టిలో ఒక మాణిక్యం దేదీప్యమానంగా వెలిగింది. మండలంలోని శివారు గ్రామం ఎన్.ఎస్.వెంకటనగరానికి చెందిన కొల్లు వీరగంగాధర్ పిసాపోలో క్రీడలో జాతీయ స్థాయిలో కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఫిన్లాండ్ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పిసాపోలో పోటీల్లో ఈతడు పాల్గొననున్నాడు. ఆ పోటీల్లో కూడా ప్రతిభ చూపి దేశం, రాష్ట్రం, గ్రామానికి ఖ్యాతి తెస్తానంటున్నాడు. రెండు నెలల్లోనే అత్యుత్తమ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానాన్ని పొందిన ఈతడు.. ఉపాధ్యాయులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. వ్యయసాయ కుటుంబంలో పుట్టిన వీరగంగాధర్కు ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సహం లభించింది. కబడ్డీ, లాంగ్ జంప్, చౌక్‌బాల్ పోటీల్లో ఇతడు రాణిస్తున్నాడు. పదో తరగతి పరీక్షల కోసం.. ప్రస్తుతం ఇతడు ఎన్.సూరవరం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఫిన్లాండ్ దేశంలో ప్రసిద్ధి కెక్కిన పిసాపోలో క్రీడలో ఇతడికి పీఈటీలు రాజు, విక్టర్ శిక్షణ ఇచ్చారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయిలో గత జనవరిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో సిల్వర్ ట్రోఫీ, మెరిట్ సర్టిఫికెట్‌ను సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడడమే ధ్యేయం 2020లో పిసాపోలో ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చే అవకాశం ఉన్నట్టు సెలక్టర్లు తెలిపారని, అందులోనూ పాల్గొని విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వీరగంగాధర్ తెలిపారు. మంగళవారం నుంచి 15వ తేదీ వరకూ రాజస్థాన్‌లో నేషనల్ అకాడమీ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఇతడు పాల్గొనాల్సి ఉంది. అయితే పదో తరగతి పరీక్షలు సమీపించడంతో శిక్షణకు వెళ్లలేదు. ఈ విషయాన్ని పీఈటీల ద్వారా సెలక్టర్లకు తెలియజేస్తే.. మేలో జరిగే మూడో విడత శిక్షణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ ఆటలో తొమ్మిది మంది ఆటగాళ్లు, ఇద్దరు అదనపు ఆటగాళ్లు ఉంటారన్నారు. జట్టులో రెండో స్థానంలో ఉన్నానన్నాడు. ఫిన్లాండ్ వెళ్లేందుకు పాస్‌పోర్టు, ఇతర ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు వెళ్లాలంటే రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, ఇందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకరిస్తున్నారని చెప్పాడు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొని గుర్తింపు తీసుకువస్తానని ఇతడు అంటున్నాడు. -
వెయిట్‌లిఫ్టింగ్ ఎంపికలు
నిజామాబాద్ నాగారం : జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యం లో గురువారం జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు గడుగు గంగాధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొబ్బిలి నర్స య్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–20, అండర్–17 విభాగాలలో బాలబాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. కలెక్టరేట్ మైదానంలో ఉదయం 10.30 గంటలకు ఎంపిక పోటీలు ప్రా రంభమవుతాయని, ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు. -
చెప్పినట్లు వినకుంటే... పరీక్షల్లో ఫెయిలే
అనంతపురం : శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ లెక్చరర్ కీచక పర్వం ఆలస్యంగా వెలుగు చూసింది. కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని... తన కోరిక తీర్చాలని కాంట్రాక్ట్ లెక్చరర్ గంగాధర్ బెదిరించాడు. లేకుంటే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. దాంతో గంగాధర్‌ను ఎగ్జామ్ వింగ్ నుంచి యూనివర్శిటీ అధికారులు తప్పించి.. చేతులు దులుపేసుకున్నారు. యూనివర్శిటీ అధికారుల చర్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అతడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. -
‘గ్యాంగ్‌స్టర్’మూలాల కోసం వేట
గ్యాంగ్‌స్టర్ సన్నిహితులెవరనే దానిపై నజర్ ‘కూరపాటి’ని టార్గెట్ చేయడంపై ‘సిట్’ ఆరా విచారణలో వెలుగు చూడనున్న అసలు ‘కథ’ సాక్షి ప్రతినిధి నిజామాబాద్ : జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌కు అత్యంత సన్నిహితులు ఎవరు? డిచ్పల్లి జెడ్పీటీసీ కూరపాటి అరుణ భర్త గంగాధర్‌ను ఆ గ్యాంగ్ కు టార్గెట్ చేసిందెవరు? ఎంతకాలంగా జిల్లాలో నయీం ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది? ఈ ముఠాకు ఇన్నాళ్లు సహకరిస్తున్నదెవరు? అన్న అంశాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రెండు రోజులుగా జిల్లాలో ఆరా తీస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. నల్గొండ జిల్లా భువనగిరి ఠాణాలో తెలంగాణ రైసుమిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్ ఈ నెల 17న శాసనమండలి డిప్యూటీ చైర్మన్, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ మేరకు ఆయనపై క్రైం నంబర్ 234/2016 ప్రకారం ఎఫ్ఐఆర్ జారీ అయిన అనంతరం జిల్లాలో ‘సిట్’ దర్యాప్తు ముమ్మరం చేయడం కలకలం రేపుతోంది. నేతి విద్యాసాగర్‌కు బంధువులు, సన్నిహితులు, వారి గత చరిత్రపై ఆరా తీస్తుండటం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. ‘కూరపాటి’ని టార్గెట్ చేసిందెవరు? గ్యాంగ్ స్టర్ నయీంపై డిచ్పల్లి పోలీసుస్టేషన్లో నమోదైన క్రైం నంబర్ 125/2016. నల్గొండ జిల్లాలో అనేక ఆగడాలు కొనసాగించిన నయీం డిచ్పల్లి జెడ్పీటీసీ భర్తపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి నయీం డబ్బుల కోసం బెదిరించడం జరిగింది. గంగాధర్‌కు సంబంధించి ఆస్తులు, వ్యక్తిగత వివరాలు నయీం పేర్కొన్నడం సంచలనం రేపింది. దీనిని బట్టి నయీంకు జిల్లా పరిస్థితులు, స్థానికంగా వివరాలు తెలిసిన వారే అనుచరులుగా కొనసాగుతున్నట్లు అనుమానాలకు తావిస్తోంది. నయీంకు కూరపాటి గంగాధర్‌కు సంబంధించి వివరాలు అందించింది ఎవరు? అసలు ఆయనను ఎందుకు టార్గెట్ చేశారు? అన్న అంశాలే ఇప్పుడు కీలకంగా మారాయి. నల్గొండ జిల్లా భువనగిరి పోలీసుస్టేషన్లో నేతి విద్యాసాగర్‌పై కేసు నమోదైన నేపథ్యంలో.. సిట్ జిల్లాలోని ఆయన బంధువర్గం వివరాలు ఆరా తీయడం కలకలం రేపుతోంది. నల్కొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి సమీప బంధువు దీంతో సిట్ జిల్లాలోని నయీం బెదిరింపు కాల్స్‌కు సంబంధించి ఆరా తీయనుంది. ఒకవేళ సదరు ప్రజాప్రతినిధి డిచ్పల్లి గంగాధర్‌కు చెందిన వివరాలు అందించారా? రాజకీయ లబ్ధి కోసం గంగాధర్‌ను భయపెట్టేందుకు చేసిందా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా నయీం అనుచరులు ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నయూం మూలాలపై త్వరలో నివేదిక డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు కావడంతో ఒక్కొక్కరిపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. భువనగిరి ఠాణాలో ఎఫ్ఐఆర్ నమోదైన నల్గొండ ఎమ్మెల్సీ సమీప బంధువు జిల్లాలో సెటిల్మెంట్లు చేయడం పరిపాటి. ఇప్పటికీ ఉన్నతస్థాయి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న అయన 2019 ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇదే క్రమంలో నయీంతో సంబంధాలు పెట్టుకొని జిల్లాలో మరిన్ని సెటిల్మెంట్లు చేసేందుకు పూనుకున్నడా? కూరపాటిని టార్గెట్ చేయడం ద్వారా.. ఆయన సీనియర్ నాయకులకు హెచ్చరిక చేయదలచుకున్నాడా? ఈ క్రమంలోనే గ్యాంగ్‌స్టర్‌గా గడగడలాడించిన నయీంతో జత కట్టాడా? అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో రాజకీయంగా పట్టుసాధించే క్రమంలో నయీం గ్యాంగ్‌ను దగ్గరయ్యాడా? అన్న వాదన కూడా సాగుతోంది. కాగా వీటన్నింటిని పక్కన బెడితే ‘సిట్’ పూర్తి స్థాయి విచారణ జరిపితే జిల్లాలో నయీం అనుచరుల ఎవరెవరు? ఒక వేళ నయీం కూడా నిజామాబాద్ వచ్చి వెళ్లేవాడా? వచ్చి వెళితే నయీంకు ఆశ్రయం కల్పించిన వారెవరు? అతని వెంట ఎవరెవరు ఉన్నది? అన్న విషయాల గుట్టు వెలుగులోకి రానుంది. గుట్టు చప్పుడు కాకుండా నయీం కార్యకలాపాలు కొనసాగించేవాడన్నది బహిరంగ రహస్యమే అయినా... జిల్లాలో నయీం మూలాలు ఎక్కడనేది? తేల్చే పనిలో ఇప్పుడు సిట్ నిమగ్నమైంది. త్వరలోనే నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్ బృందం జిల్లాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుక రానుందన్న చర్చ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. -
నయీం జాడ ఎలా దొరికిందంటే..?
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జెడ్పీటీసీ భర్త గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదుతో గ్యాంగ్‌స్టర్ నయీం జాడ పోలీసులకు దొరికింది. ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేసి నయీం షాద్ నగర్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కోటి రూపాయలు ఇవ్వాలంటూ నయీం ముఠా గత జూలైలో గంగాధర్‌ను బెదిరించింది. దీంతో ఆయన గత నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నయీం ముఠా కదిలికలపై నిఘా వేయడంతో పాటు ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేశారు. వాళ్లు షాద్ నగర్లో ఉన్నట్టు పక్కాగా సమాచారం వచ్చింది. నయీం ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతని అనుచరుడు కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నయీం హతమయ్యాడు. -
విప్ ఇంట్లో...కానిస్టేబుల్ ఆత్మహత్య
సర్వీసు రైఫిల్‌తో పొట్టలో కాల్చుకున్న గంగాధర్ మందమర్రి రూరల్/మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నివాసంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్)తో పొట్టలో కాల్చుకొని మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని బెల్లంపల్లి బెటాలియన్‌కు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బొండాజీ గంగాధర్ (47) శుక్రవారమే ఓదేలుకు ఎస్కార్ట్‌గా విధుల్లో చేరాడు. ఓదేలు శనివారం మధ్యాహ్నం తన నివాసంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. దాంతో ఓదేలుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి చూడగా గంగాధర్ తుపాకీతో పొట్టలో కాల్చుకుని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కన్పించాడు. ఆయన్ను హుటాహుటిన ఆర్కేపీ సింగరేణి ఏరియూ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. గంగాధర్ ఆత్మహత్య బాధాకరమని ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. గంగాధర్ మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం అస్టా గ్రామానికి చెందిన గంగాధర్ కుటుంబ సమస్యలతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వివరించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని, ఈ బాధలు పడలేకనే ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ఆత్మహత్య విచారకరమని ఓదేలు పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. ఆత్మస్థైర్యంతో ఉండాలని ఆయన కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాన్ని త్వరగా ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. -
మిస్ ఫైర్ కాదు.. ఆత్మహత్యే..!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రిలో జరిగిన మిస్ ఫైరింగ్ వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది. కుటుంబ కలహాలతోనే గంగాధర్ బలవన్మరణానికి పాల్పడినట్టు ఎస్పీ తరుణ్ జోషి వెల్లడించారు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనపై విచారించిన ఎస్పీ.. కానిస్టేబుల్ గంగాధర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైనట్టు చెప్పారు. కాగా, చెన్నూరు ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు నివాసం వద్ద శనివారం మిస్ ఫైర్ చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో ఏఆర్ కానిస్టేబుల్ గంగాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని ఓదేలు ఇంటి వద్ద ఈరోజు మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గంగాధర్‌ను చికిత్స నిమిత్తం సింగరేణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
నీట్‌తో తెలుగు విద్యార్థులకు నష్టమే
విజయవాడ(గాంధీనగర్): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)తో తెలుగు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ పి.గంగాధర్ అన్నారు. గవర్నర్‌పేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశమంతటా ఒకే సిలబస్‌లో విద్యాబోధన చేయకుండా ఒకే విధానంలో పరీక్ష నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. నీట్ పరీక్షలో సమాధానాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో రాయాల్సి వస్తుందని తెలిపారు. ఈ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు. రాష్ట్ర సిలబస్‌ను తెలుగుమీడియంలో చదివే విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్‌ను ఇంగ్లిషులో రాయడానికి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. కనీసం రెండు, మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా ఒకే సిలబస్‌ను అమలుచేసి, ఆ తర్వాత జాతీయస్థాయిలో నీట్ అమలుచేయాలని సూచించారు. నీట్ పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు చేయాలని కోరారు. విద్యార్థులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉందన్నారు. నీట్ పరీక్షపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సుప్రీంకోర్టులో తమ వాదనలను వినిపిస్తామన్నారు. జన ఔషధిని స్వాగతిస్తాం.. కేంద్రప్రభుత్వం జన ఔషధి పేరుతో మందులను తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏ రకమైన చర్యనైనా ఐఎంఏ స్వాగతిస్తోందని గంగాధర్ అన్నారు. ఈ విధానాన్ని అమలు చేసే ముందుకు జెనరిక్, బ్రాండెండ్ మందులపై స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వాలు చేపట్టాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన వాటిని గుర్తించి చట్టపరంగా జెనరిక్ మందులనే తయారు చేసేవిధంగా మందుల కంపెనీలను నియంత్రిస్తే కొంతమేర ఫలితాలు ఉంటాయని తెలిపారు. వైద్య విద్యనభ్యసించిన డాక్టర్లను జెనరిక్ మందులే రాయాలని ఆదేశించడం సరికాదన్నారు. ఎటువంటి విద్యార్హత లేని కొందరు ఇష్టానుసారం మందులు రాస్తున్నారన్నారు. జెనరిక్ మందులపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. జెనరిక్ మందులలో కల్తీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రెహమాన్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ కరుణామూర్తి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఇంట్లో చోరీ
ఎమ్మెల్యే బొడిగ శోభ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధరలో జరిగింది. ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు, చెవిరింగులను దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అగంతకులు కేవలం దొంగతనానికే వచ్చారా? లేక మరేదైనా కారణం ఉంటుందా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విరాలు తెలియాల్సి ఉంది. -
కానిస్టేబుల్ రెండో కాపురం చిచ్చు
భర్త రెండో కాపురం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. మొదటి భార్యపై భర్త తరఫు బంధువులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటల సమయంలో అనంతపురంలోని గౌరవ గార్డెన్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... గంగాధర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఇటీవల హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది కళ్యాణదుర్గం స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. డెప్యూటేషన్‌పై త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని కోర్టు మానిటరింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య కొండమ్మ, కుమారులు నితీష్, రుతిక్ ఉన్నారు. అయితే, గంగాధర్ సుమారు ఏడాదిన్నరగా వేరే మహిళతో కాపురం పెట్టాడు. మొదటి భార్యకు విడాకులివ్వలేదు. ఈ విషయమై భార్యభర్తలు పలుమార్లు గొడవపడ్డారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రెండో కాపురం పెట్టిన మహిళతో ఉన్నాడనే సమాచారం అందుకున్న కొండమ్మ, అన్న రంగస్వామి, తల్లితో కలిసి వెళ్లింది. వీరు వచ్చిన విషయం తెలుసుకున్న గంగాధర్ లోపల గడియపెట్టుకుని బయటకు రాలేదు. తన బంధువులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని కొండమ్మ, రంగస్వామిపై దాడి చేశారు. దీంతో రంగస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ రెడ్డప్ప ఘటనాస్థలానికి చేరుకుని దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొటాల్పల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. రోడ్డు పక్కన మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడు కామారెడ్డికి చెందిన చత్రబోయిన గంగాధర్(33)గా గుర్తించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న గంగాధర్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ ఎంపీటీసీ తనయుడి దాడి
తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు చిలమత్తూరు: అధికార పార్టీ నాయకులు రోజురోజుకూ చెలరేగిపోతున్నారు. అధికారం ఉందని విచక్షణ రహితంగా భౌతిక దాడులకు దిగడం పరిపాటిగా మారుతోంది. తాజాగా మండలంలోని కోడూరు పంచాయతీ మదిరేపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు కుమారుడు గంగాధర్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం కోడూరు తోపులో టీ తాగుతూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు తనయుడు సోమశేఖర్ ఎందుకు నవ్వుతున్నారంటూ వారితో వాదనకు దిగాడు. ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో సోమశేఖర్ పక్కనే ఉన్న ఇనుప రాడుతో గంగాధర్‌పై దాడి చేశాడు. దీంతో గంగాధర్ తలకు దెబ్బ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన బంధువులు గంగాధర్‌ను స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించి ఫిర్యాదు చేశారు. పోలీసులు చికిత్స నిమిత్తం బాధితుణ్ని ఆసుప్రతికి పంపించారు. గతంలో కూడా దారి విషయంలో తమపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దాడి విషయంలో బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయరాదని అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రియుడే హంతకుడు
బెంగళూరు : సాసలు క్లస్టర్ పరిధిలోని కల్లుకుంటె గ్రామ శివార్లలో ఈనెల 7వ తేదీన జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. తరచూ డబ్బు కోసం వేధిస్తుండటంతో ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు... బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్ట క్లస్టర్ పరిధిలోని తురబన హళ్లికి చెందిన గంగాధర్(32)ను అరెస్ట్ చేశారు. డీవైఎస్పీ కోనప్పరెడ్డి కథనం మేరకు..కుణిగల్ తాలూకా బన్నికుప్పెకు చెందిన ఉషారాణి(26)కి 8 సంవత్సరాల క్రితం రాజ్‌కుమార్ అనే వ్యక్తిని వివాహమైంది. హెసరఘట్ట క్లస్టర్ పరిధిలోని తరబనహళ్లిలో గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో వీరు అద్దెకు ఉండే వారు. ఈ క్రమంలో ఉషారాణికి గంగాధర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. గంగాధర్‌కు వివాహమైన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగింది. పసిగట్టిన గంగాధర్ భార్య భర్తతో గొడవ పడేది. మరోవైపు ఉషారాణి గంగాధర్‌ను తరచూ డబ్బులు ఇవ్వమని పీడించేది. దీంతో విసుగుచెందిన గంగాధర్...ఉషారాణిని హత్య చేయాలని పథకం పన్నాడు. ఈనెల 7వ తేదీన ఆమెను బైక్‌పై దొడ్డబళ్లాపురం తాలూకా కల్లుకుంట గ్రామ శివార్లకు తీసుకెళ్లాడు. ప్రభుకుమార్‌కు చెందిన స్థలంలో ఆమెను వేల్తో గొంతు బిగించి హత్య చేశాడు. తాళిబొట్టు, చెవి దుద్దులు తీసుకున్నాడు. వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పోసి కాల్చివేసి పరారయ్యాడు. ఇదిలా ఉండగా భార్య కనిపించకపోవడంతో ఉషారాణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో కల్లుకుంటె గ్రామం శివార్లలో మహిళను పెట్రోల్ పోసి కాల్చి హత్య చేసినట్లు తెలుసుకున్న ఎస్ఐ లూయీ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి హతురాలు ఉషారాణిగా నిర్ధారించి దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ఈ టీచర్‌ను భార్యే అంతం చేసింది..
నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడ్గాల్ గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన టీచర్ హత్య కేసులో అతడి భార్యే నిందితురాలని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు బుధవారం వెల్లడించిన వివరాల మేరకు... సూత్రాల గంగాధర్ అనే ఉపాధ్యాయుడు సోమవారం హత్యకు గురయ్యాడు. గంగాధర్ పెట్టే వేధింపులు భరించలేక అతడి భార్య గంగామణి బండరాయితో మోది చంపినట్టు పోలీసులు తేల్చారు. బుధవారం నిందితురాలు గంగామణిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రేమికుల రోజున రెండు ఇళ్లల్లో విషాదం
తాండూరు: ప్రేమికుల రోజున రెండు ఇళ్లల్లో విషాదం చోటుచేసుకుంది. కాబోయే భార్యను కలుసుకునేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి... తాండూరు పట్టణంలోని షావుకార్‌పేట్‌కు చెందిన గంగాధర్(30)కు ఈనెల 11వ తేదీన వికారాబాద్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే ప్రేమికుల రోజును పురస్కరించుకొని కాబోయే భార్యను కలుసుకోవడానికి ఆదివారం గంగాధర్ వికారాబాద్ లోని యువతి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్నట్టుండి కూప్పకూలిపోయి అతను మరణించడంతో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వికారాబాద్‌కు వెళ్లి మృతదేహాన్ని తాండూరుకు తీసుకువచ్చారు. మరికొద్ది రోజుల్లో వివాహం జరగనుండగా పెళ్లికుమారుడు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో ఈ ఘటన విషాదాన్ని నింపింది. -
గంగాధర్ ఫొటోకు బంగారు పతకం
బాన్సువాడ టౌన్ : అంతర్జాతీయ స్థాయి ఫొటోగ్రాఫర్ల వర్క్‌షాపులో బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ గంగాధర్ యాదవ్‌కు బంగారు పతకం లభిం చింది. గత నెల 29 నుంచి ఈ నెల 1 వరకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ వర్క్‌షాపు నిర్వహిం చారు. ఈ ఫొటో ప్రదర్శనలో గంగాధర్ యాదవ్ దించిన ‘చారిక్రత కట్టడంలో చీపురుతో శుభ్రం చేస్తున్న మహిళ’ ఫొటోకు ప్రశంసలు అందాయి. గంగాధర్ యాదవ్‌కు డానీవాష్(మలేషియా), కావాలిన్(యూఎస్ఏ), ఫెడరేషన్ ఆఫ్ పోటోగ్రాఫర్ ఇండియా అధ్యక్షులు అనీల్ రిసాల్సింగ్, ఉపాధ్యక్షులు సుశాంత్బెనర్జీ తీర్థాదాస్ గుప్త పతకాన్ని అందించారు. -
యువకుడి దారుణ హత్య
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నవీపేట మండలం సుభాష్‌నగర్ కాలనీకి చెందిన గంగాధర్(32) మంగళవారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి నిద్రించగా, బుధవారం ఉదయం చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మృతుడి తలపై గాయాలు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కులధ్రువీకరణ పత్రాల్లో అవకతవకలు
కుంటాల: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం గుల్లమాడ పంచాయతీ వీఆర్ఏలు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. వీఆర్ఏలు గంగాధర్, సూర్యలపై తహశీల్దార్ సంతోష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 1975 కు పూర్వం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన గిరిజనులకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను ఓటరు జాబితా ఆధారంగా ఇవ్వాలనేది నిబంధన. అయితే, గుల్లమాడ పంచాయతీ అనుబంధ గ్రామం బూరుగుపల్లికి చెందిన సుమారు 43 మంది అనర్హులకు వీఆర్ఏలు లంచం తీసుకుని కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని విచారణలో తేలడంతో తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆర్ఐ ఇస్కారి, కార్యాలయ జూనియస్ అసిస్టెంట్ నగేష్‌లకు మెమోలు జారీ చేశారని తెలిసింది. -
విద్యుత్‌షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి
నిజామాబాద్: ప్రమాదవశాత్తూ ట్రాన్‌ఫార్మర్‌పై ఎక్కిమరమ్మతులు చేస్తున్న గంగాధర్(38) అనే వ్యక్తి కరెంటు షాక్ తగిలి మృతిచెందాడు. ఈ ఘటన వేల్పూరు మండలం పచ్చలనడికుడలో చోటుచేసుకుంది. గంగాధర్ స్థానికంగా ఎలక్ట్రిషియన్ పనులు చేస్తుంటాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గంగాధర్ మృతిచెందాడని కుటుంబసభ్యులు, తోటి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. (వేల్పూర్) -
మీ అమ్మను చంపేశా.. వెళ్లి చూసుకో..
భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త హత్య విషయం ఫోన్లో కూతురుకు వెల్లడి అనంతపురం క్రైం : ‘మీ అమ్మను చంపేశా...వెళ్లి చూసుకో’ అంటూ భార్యను కిరాతకంగా హత్య చేసిన విషయం కూతురుకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. అనంతపురం నగర శివారులోని హమాలికాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గంగాధర్, ఆత్మకూరు రాజమ్మ (43) అనే దంపతులు హమాలీ కాలనీలో నివాసముంటున్నారు. గంగాధర్ గుత్తి ప్రభుత్వాస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రాజమ్మ ఇళ్లలో పని చేస్తుండేది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతుళ్లకు వివాహం చేశారు. వారు ఇదే కాలనీలో నివాసముంటున్నారు. తాగుడుకు బాని సై విధులను నిర్లక్ష్యం చేయడంతో అత ని స్థానంలో కుమారుడు పనిచేస్తున్నా డు. మద్యం కోసం డబ్బు ఇవ్వాలని భార్యను వేధించేవాడు. గురువారం రాత్రి కూడా డబ్బు కోసం భార్యతో గొడవపడ్డాడు. తెల్లవారుజామున రోకలిబండతో భార్య తలపై బలంగా మోది హత్యచేశాడు. అనంతరం పెద్ద కూతురు అరుణజ్యోతికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె వెళ్లి చూడగాతల్లి విగతజీవిగా పడివుంది. పోలీసులకు తెలపడంతో వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్ఐ విశ్వనాథచౌదరి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం శివారులో ఏడుగుల గంగాధర్(32) అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. జాకోరా గ్రామానికి చెందిన గంగాధర్‌కు భార్య లక్ష్మి , ఇద్దరు పిల్లలున్నారు. ఇంటిపెద్ద చనిపోవడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
గీతానుసారం!
-
గంగాధర్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం
హైదరాబాద్ : హైదరాబాద్ బోయిన్పల్లి వద్ద అర్థరాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవార ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే బోయినపల్లి వద్ద డీసీఎం వ్యాన్ - ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దాంతో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి కిందకి దిగిపోగా, బస్సు క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ గంగాధర్ సజీవ దహనమైయ్యాడు. మరో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు అగ్నిపమాక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో చెలరేగిన మంటలను అర్పివేశారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని... ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 52 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఇసుకాసురులపై అధికారుల కొరడా
మొయినాబాద్: ఇసుకాసురులపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఓ ట్రాక్టర్‌ను సీజ్ చేసి జరిమానా విధించారు. ఇటీవల పత్రికల్లో వస్తున్న కథనాలకు అధికారులు స్పందించారు. శనివారం ఉదయం 6 గంటలకు తహసీల్దార్ గంగాధర్, రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కలిసి మండల పరిధిలోని వెంకటాపూర్, కేతిరెడ్డిపల్లి, నక్కలపల్లి పరిసరాల్లోని ఈసీ వాగులో దాడులు నిర్వహించారు. ఇసుక తీయడంతో ఈసీ వాగులో ఏర్పడిన గోతులను చూసి వారు ఆశ్చర్యపోయారు. షాబాద్ మండలం సోలిసేట్ గ్రామానికి చెందిన గౌస్ ట్రాక్టర్ ఇసుక నింపుతుండగా అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ యజమానికి రూ. 5 వేలు జరిమానా విధించారు. అనంతరం కేతిరెడ్డిపల్లి, నక్కలపల్లి గ్రామాల్లో ఉన్న ఇసుక డంప్‌లను అధికారులు గుర్తించారు. ఇసుక నిల్వ ఉంచిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. చిన్నమంగళారం సమీపంలోని మూసీ వాగులో దాడి చేయగా ఎవరూ పట్టుబడలేదు. దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్ జగదీశ్వర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, ఆర్ఐ రాజు, వీఆర్ఓలు సుదర్శన్, మల్లయ్య, కృష్ణ, శంకరయ్య, విష్ణు, అఖిల్ హైమద్, పోలీసులు ఉన్నారు. -
జ్వరాలతో విలవిల
బంగారయ్యపేటలో ఇద్దరు మృతి 20 మందికి అస్వస్థత చినదొడ్డిగల్లులో విషజ్వరాలు నక్కపల్లి ఆస్పత్రి రోగులతో కిటకిట భయంతో వణుకుతున్న జనం నక్కపల్లి, న్యూస్‌లైన్: మండలవాసులను జ్వరాలు పీడిస్తున్నాయి. మత్య్సకార గ్రామం బంగారయ్యపేటలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారం రోజుల్లో ఇద్దరు చనిపోవడంతో గంగపుత్రులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన గరికిన సంజన(10) రెండు రోజుల క్రితం జ్వరానికి గరైంది. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన కొవిరి రమణ(40) జ్వర లక్షణాలతో నక్కపల్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయినట్టు అతని సోదరుడు గంగాధర్ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో మరో 20 మంది జ్వరంతో మంచానపడ్డారు. చేపల శివాజీ, కొవిరిపాప, జె. శ్రీను, గరికిన జగ్గ, చేపలగోపిలతోపాటు మరి కొందరు ఇళ్ల వద్దే మగ్గుతున్నారు. కొందరు తునిప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. తీరానికి కూతవేటు దూరంలో ఉన్న బంగారయ్యపేట వాసులకు వైద్యసేవలు నామమాత్రమని సర్పంచ్ మసేనమ్మ తెలిపారు. గ్రామంలో ైవె ద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. చినదొడ్డిగల్లులో విషజ్వరాలు చినదొడ్డిగల్లులోనూ విషజ్వరాల తాకిడి అధికంగా ఉంది. సుమారు 25 మంది ఈ లక్షణాలతో మంచానపడి అల్లాడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో దేవవరపు వాణి, అమలావతి, అజయ్‌కుమార్, ఉమ్మిడి చంటమ్మ,కె. పార్వతి, చొప్పాలోకేష్, తోటవరలక్ష్మిలతోపాటు మరికొందరు తీవ్రమైన జ్వరం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు నక్కపల్లి, తుని ఏరియా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇంటిలో ఒకరికి జ్వరమొస్తే కుటుంబమందరికి సోకుతోందని బాధితులు వాపోతున్నారు. నక్కపల్లి ఆస్పత్రి కిటకిట జ్వరపీడితులు, అతిసారరోగులతో నక్కపల్లి ఆస్పత్రి కిటకిటలాడుతోంది. నక్కపల్లి,ఎస్‌రాయవరం మండలాలకు చెందిన పలువురు జ్వరం, , డయేరియా లక్షణాలతో ఈ ఆస్పత్రిలో చేరుతున్నారు. వార్డులోని బెడ్లన్నీ రోగులతో నిండిపోయాయి. ఇక్కడ బెడ్లు ఖాళీలేక కొంతమంది తుని, అడ్డురోడ్డు, నక్కపల్లి,పాయకరావుపేటలలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు -
ఆర్ఐపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
పాల్వంచ, న్యూస్‌లైన్: ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ అధికారిపై పాల్వంచలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ ప్రచార కార్యక్రమం ఆదివార ం మధ్యాహ్నం పాల్వంచలోని ఇందిరా కాలనీలో ఏర్పాటైంది. దీనికి ముందస్తుగా ఆ పార్టీ కార్యకర్తలను స్థానిక నాయకుడు, న్యాయవాది గంగాధర్ సమాయత్తపరుస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల నియామవళిని అతిక్రమించి, ఇందిరా కాలనీలో పార్టీ జెండాలు కడుతున్నారని తహశీల్దార్ సమ్మిరెడ్డికి సమాచారమందింది. ఆయన ఆదేశాలతో వీడియో సర్వేలైన్ టీం అధికారి, ఆర్ఐ ప్రసాద్ బాబ్జి, వీఆర్వో రాములు అక్కడి చేరుకుని, టీఆర్ఎస్ ప్రచార సరళిని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో అటుగా గంగాధ ర్ కారు వచ్చింది. అందులో పార్టీ జెండాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీ చేసేందుకు దానిని ఆర్ఐ ఆపబోయారు. కారు ఆగకుండా వెళ్లడంతో ఆయన వెంబడించి నిలిపేశారు. కారులోంచి గంగాధర్, కొందరు కార్యకర్తలు దిగి ఆర్ఐపై దాడి చేసి దుర్భాషలాడారు. ‘ఓ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారు’ అని ఆరోపించారు. దీనిపై ఆర్డీవో సత్యనారాయణకు, తహశీల్దార్ సమ్మిరెడ్డికి, పోలీసులకు ఆర్ఐ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఆనంద్ వెంటనే అక్కడికి చేరుకుని గంగాధర్‌ను జీప్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జీపుకు అడ్డుపడిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు పక్కకు లాగేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావ్‌కు కార్యకర్తలు విషయం తెలిపారు. అధికారులతో మాట్లాడతానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. పోలీసులకు ఆర్ఐ ఫిర్యాదు ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసి దుర్భాషలాడారని, విధులను అడ్డుకున్నారని పాల్వంచ పోలీసులకు ఆర్ఐ ప్రసాద్ బాబ్జి ఆదివారం ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కొత్తగూడెం ఆర్డీవో అమయ్‌కుమార్‌కు, డీఎస్పీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు ఆర్ఐ బాబ్జి చెప్పారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు.. ఆర్ఐ బాబ్జీ ఫిర్యాదు మేరకు గంగాధర్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ షణ్ముఖాచారి తెలిపారు. మరో 20 మందిపై కూడా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
సచిన్ - టెండూల్కర్ కాదు న్యూ స్టిల్స్
-
‘సచిన్’ - టెండూల్కర్ కాదు స్టిల్స్
-
కుమిలి కుమిలి.. గుండె పగిలి..
న్యూస్‌లైన్, కామారెడ్డి : గల్ఫ్‌కు వెళ్లిన వారిలో చాలా మంది ఒత్తిళ్లకు లోనవుతున్నారు. పని ఒత్తిడి, అప్పుల కుంపటి వారి ని వేదనకు గురి చేస్తున్నాయి. కొన్ని కంపెనీల్లో అడ్డగోలు పనులు చేయించుకునే యాజమాన్యాలు.. సరై న వేతనాలు ఇవ్వకపోవడం, వేతనాన్ని సక్రమంగా చెల్లించకపోవడంతో వలస జీవులు ఆర్థికంగా సతమతమవుతున్నారు. అప్పులు తీరకముందే ఇంటికి వెళితే అప్పులవాళ్లకు ఏమని సమాధానం చెప్పేదని మనోవ్యథకు గురవుతున్నారు. దీనికి తోడు కుటుం బానికి దూరంగా ఉండాల్సి రావడంతో ఒత్తిడి తీవ్ర మై అనారోగ్యం పాలవుతున్నారు. వైద్యం చేయించుకునేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు మృత్యువాత పడుతున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లి విదేశాల్లో గతేడాది 50 మందికిపైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతోనో.. అనారోగ్యంతోనో మృత్యువాతపడ్డారని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇంకొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరణవార్త చేరిన తర్వాత కడసారి చూపుకోసం అయినవారు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వారు మరోవైపు అప్పులు ఇచ్చినవారి నుంచి వేధింపులను ఎదుర్కోవాల్సిన దుస్థితి. దీంతో వారూ నలిగిపోతున్నారు. 2013లో అనారోగ్యంతో విదేశాల్లో మరణించిన వారి వివరాలు.. మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెకు చెందిన మహబూబ్(33) జనవరి 19న గుండెపోటుతో సౌదీలో మరణించారు. భీమ్‌గల్‌కు చెందిన గంగాధర్(50) జనవరి 24న దుబాయిలో గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ మండలం తిర్మన్‌పల్లికి చెందిన ఇస్మాయిల్ ఫిబ్రవరి 1న గుండెపోటుతో ఒమన్‌లో మరణించారు. కమ్మర్పల్లి మండలం చౌటుప్పల్‌కు చెందిన సుభాష్ అనారోగ్యంతో ఫిబ్రవరి 9 బహ్రెయిన్‌లో మరణించారు. కామారెడ్డి మండలం కొటాల్‌పల్లికి చెందిన సిద్దరాములు గుండెపోటుతో సౌదీలో మరణించారు. ఆయన మృతదేహం నెలరోజుల తర్వాత ఫిబ్రవరి 14న స్వగ్రామం చేరింది. జక్రాన్‌పల్లి మండలం పడకల్‌కు చెందిన ఈర్ల లింగన్న(45) మార్చి 8న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. దోమకొండకు చెందిన దాసరి సిద్దరాములు (41) మార్చి 16న అనారోగ్యంతో దుబాయిలో మరణించారు. బాల్కొండ మండలం రెంజర్లకు చెందిన శ్రీనివాస్(35) ఏప్రిల్ 18న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. కమ్మర్‌పల్లికి చెందిన గంగాధర్(45) జూన్ 21న దుబాయిలో గుండెపోటుతో మరణించారు. నవీపేట మండలం బినోలాకు చెందిన ఒడ్డెన్న(45) సౌదీలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతదేహం మూడు నెలల తర్వాత జూలై 3వ తేదీన స్వగ్రామానికి చేరింది. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్‌కు చెందిన తిరుపతి(45) జూలై 7న సౌదీలో గుండెపోటుతో మరణించారు. నందిపేట మండలం మారంపల్లికి చెందిన పెద్ద సాయాగౌడ్(50) దుబాయిలో అనారోగ్యానికి గురై జూలై 11 మరణించారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన రాజన్న (50) దుబాయిలో గుండెపోటుకు గురై జూలై 13న మరణించారు. వేల్పూర్‌కు చెందిన నాగేశ్(38) జూలై 29 దుబాయిలో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతదేహం ఐదు నెలల తర్వాత స్వగ్రామం చేరింది. ఆర్మూర్‌కు చెందిన శ్రీనివాస్(35) ఆగస్టులో అబుదాబీలో గుండెపోటుకు గురై మరణించారు. డిచ్పల్లి మండలం నడిమితండాకు చెందిన బంతిలాల్(40) సౌదీలో అనారోగ్యంతో ఆగస్టు 10 న మరణించారు. భిక్కనూరు మండలం రాజంపేటకు చెందిన రాజయ్య(45) ఆగస్టు 20 దుబాయిలో గుండెపోటుతో మరణించారు. నిజామాబాద్‌కు చెందిన తసిప్(30) సెప్టెంబర్ 4న గుండెపోటుతో సౌదీలో మరణించారు. వేల్పూర్ మండలం జాన్కంపేటకు చెందిన శ్రీనివాస్ సెప్టెంబర్ 15 న సౌదీలో అనారోగ్యంతో మరణించారు. ధర్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన బాలగంగాధర్ అనారోగ్యంతో సెప్టెంబర్ 22న ఖతార్‌లో మరణించారు. నందిపేట మండలం కుద్వాన్‌పూర్‌కు చెందిన పోశెట్టి(46) అక్టోబర్ 21న గుండెపోటుతో సౌదీలో మరణించారు. డిచ్పల్లి మండలం ఇందల్వాయికి చెందిన గొల్ల రాములు(38) నవంబర్ 9 న కువైట్‌లో గుండెపోటుతో మరణించారు. మాక్లూర్ మండలం గుంజిలికి చెందిన మోనాజీ(36) నవంబర్ 11న అనారోగ్యంతో దుబాయిలో మరణించారు. నవీపేట మండలం పాత కమలాపూర్‌కు చెందిన రమేశ్(28) నవంబర్ 18న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని రమేశ్ తల్లి లక్ష్మి గుండెపగిలి మరణించింది. నిజామాబాద్ మండలం గుండారం గ్రామానికి చెందిన అలీముద్దీన్(50) నవంబర్‌లో గుండెపోటుతో రియాద్‌లో మరణించారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగుకు చెందిన రాములు(40) నవంబర్ 19న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సయ్యద్ జైలాని(24) నవంబర్ 25న అబుదాబిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్‌కు చెందిన శ్రీనివాస్(44) అనారోగ్యంతో సౌదీలో మరణించారు. ఆయన మృతదేహం మూడు నెలల తర్వాత డిసెంబర్ 3న స్వగ్రామం చేరింది. గాంధారి మండలం ముదెల్లికి చెందిన లక్ష్మయ్య(45) డిసెంబర్ 4 న షార్జాలో మరణించారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు. జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌కు చెందిన బాలు(55) డిసెంబర్ 17న దుబాయిలో గుండెపోటుతో మరణించారు. వేల్పూర్‌కు చెందిన హన్మండ్లు (50) మే 18న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. వారం రోజుల తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. -
ఏటీఎం కార్డు మార్చి రూ.30వేలు డ్రా
కోరుట్ల రూరల్, న్యూస్‌లైన్ : పట్టణంలోని ఎస్బీహెచ్ ఎటీఎం వద్ద ఓ వ్యక్తి నుంచి సినీ ఫక్కీలో ఏటీఎం కార్డు చోరీచేసి మరో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మెట్‌పెల్లికి చెందిన బొమ్మనవేని ఎల్లయ్య తన సోదరుడు గంగాధర్‌తో కలిసి డెకరేషన్ సామగ్రి కొనుగోలు చేసేందుకు కోరుట్లకు వచ్చారు. గంగాధర్‌కు చెందిన ఎస్బీఐ ఏటీఎం కార్డును ఎల్లయ్యకు ఇచ్చాడు. ఎల్లయ్యకు డబ్బులు డ్రా చేయడం తెలియకపోవడంతో మరో ఏటీఎంలో ఉన్న ఓ యువకుడికి ఇచ్చాడు. రూ.5వేలు డ్రా చేయాలనగా.. అకౌంట్లో డబ్బులు లేవంటూ కార్డు ఇచ్చాడు. నిజమని నమ్మిన ఎల్లయ్య కార్డును తీసుకెళ్లి గంగాధర్‌కు ఇచ్చేలోపే రూ.30వేలు డ్రా అయినట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. గంగాధర్‌కు ఇచ్చిన కార్డుపై మిర్యాలగూడకు చెందిన మేడి కవిత అని రాసి ఉంది. లబోదిబోమంటూ బాధితులు అకౌంట్‌ను లాక్ చేయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. -
సూపర్వైజర్లకు కల‘వరం’
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రెండు నెలలుగా నిరీక్షిస్తున్న శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ అభ్యర్థుల్లో కొత్త ఆశలు, మరో వైపు ఆందోళన నెలకొంది. నియామకాల నిలుపుదలపై ఉన్న స్టేను సుప్రీం కోర్టు శుక్రవారం ఎత్తివేసిందని సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాధరం మీడియాకు తెలిపారు. మహిళా శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 305 పోస్టులకు అక్టోబర్ 27వ తేదీ ఒంగోలులో రాత పరీక్ష నిర్వహించారు. మూడు జిల్లాల నుంచి 3887 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 248 మందిని రాతపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. పోస్టింగ్లిచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు నోటిఫికేషన్‌లోని నిబంధనలను తప్పుపడుతూ, తమకు అవకాశం కల్పించాలని కోరుతూ కోర్టులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు వెళ్లారు. సమాచార హక్కు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు టీ గంగాధర్ కూడా ఆ శాఖ ఉన్నతాధికారుల చర్యలను తప్పుపడుతూ లోకాయుక్తను ఆశ్రయించారు. గత డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, 6న హైకోర్టు, 9న సుప్రీంకోర్టు, 12న లోకాయుక్తలు పిటిషన్లు విచారించాయి. సుప్రీంకోర్టు జనవరి 3వ తేదీ, హైకోర్టు 21వ తేదీకి విచారణలను వాయిదా వేశాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులోని గోఖలే, జాస్తి చలమేశ్వరరావులతో కూడిన న్యాయమూర్తుల బృందం గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందని సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాధరం శుక్రవారం తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులు తమకు అందలేదని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. విచారణ కొనసాగడంపై కలవరపాటు... ఈనెల 21న హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్తోపాటు లోకాయుక్తలో కూడా విచారణలు జరుగనున్నాయి. దీంతో సూపర్వైజర్ అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చి ఉంటే ఆ ఉత్తర్వులకు భిన్నంగా ఏ కోర్టులూ వ్యవహరించవని కొంత ఆశతో ఉన్నారు. -
కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య
పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్: భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భానూర్‌లో శనివారం చోటుచేసుకుంది. బీడీఎల్ సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2001లో పటాన్చెరు మండలం భానూ ర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కి కొండాపూర్‌కు చెందిన సబిత (28)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వివాహ సమయంలో సబిత తల్లిదండ్రులు కట్నం ఇచ్చారు. అదనపు కట్నం తేవాలని శ్రీనివాస్ భార్యను వేధించసాగాడు. శుక్రవారం కొండాపూర్‌లో జరిగే ఓ పెళ్లికి భార్యభర్తలు వెళ్లారు. ఆక్కడ కూడా శ్రీనివాస్ అదనపు కట్నం తేవాలని భార్య సబితను కొట్టాడు. దీంతో మనస్థాపం చెందిన సబిత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ విషయాన్ని శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సబిత తల్లి కమలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసం సబితను హత్య చేసి ఆపై ఫ్యానుకు వేలాడదీశారని కమలమ్మ ఆరోపించారు. -
మహిళ దారుణ హత్య
రామాయంపేట, న్యూస్‌లైన్: గుర్తుతెలియని ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఈ సంఘటన రామాయంపేట పట్టణ శివారులో మంగళవారం వెలుగు చూసింది. స్థానిక ఎస్ఐ ప్రవీణ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం...గుర్తుతెలియని ఓ మహిళ(35) మృతదేహాన్ని పట్టణ శివారులోని మల్లన్న గుట్ట వద్ద ఓ వెంచర్ మైదానంలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన సీఐ గంగాధర్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అనంతరం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధికారులను రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగి లాలు మహిళ మృతదేహం వద్ద నుంచి మల్లన్నగుట్ట, పెద్దమ్మ దేవాలయం గుట్ట చుట్టూ తిరిగి మళ్లీ మైదానంలోకి వచ్చాయి. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడిన సీఐ, గుర్తుతెలియని మహిళ మెడకు దుండగులు ప్లాస్టిక్ తాడు బిగించి ఉరివేశారని, అనంతరం సుమారు 50 కిలోల రాయితో తలపై బాదారని తెలిపారు. అందువల్లే మహిళ తల నుజ్జునుజ్జయి గుర్తుపట్టలేని విధంగా తయారైందన్నారు. మృతురాలి ఒంటిపై పూలరంగు చీర, కుడి చేతిపై పచ్చబొట్టు పొడిచి ఉందన్నారు. ఎవరికైనా ఈ మహిళ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
నిర్మల్, న్యూస్‌లైన్ : పాక్పట్ల గ్రామానికి చెందిన కానుగుల గంగమ్మ, గంగారాం దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గంగాధర్ (25). ఆరు నెలల క్రితమే అతడికి పశువైద్యాధికారిగా ఉద్యోగం వచ్చింది. జైనథ్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు డెప్యూటేషన్‌పై సారంగాపూర్ మండలంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి నెల రోజుల క్రితమే నిజామాబాద్‌కు చెందిన అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఉదయం వ్యాయామం చేయడం అలవాటున్న గంగాధర్ ఎప్పటిలాగే శుక్రవారం తన ఇంటి డాబాపైకి వెళ్లాడు. వ్యాయామం చేస్తున్న అతడు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా చేతులు పైకి లేపాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి గంగాధర్ అక్కడికక్కడే చనిపోయాడు. తీగలకు ప్లాస్టిక్ పైపులున్నా వర్షాలకు అవి దెబ్బతినడంతో షాక్ తగిలింది. ఎంతో భవిష్యత్ ఉందనుకున్న కొడుకు తమ కళ్ల ముందే మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది. కాగా, గంగాధర్ తల్లి గంగమ్మ కొంతకాలంగా మానసిక సంబంధిత సమస్యతో బాధపడుతోందని స్థానికులు తెలిపారు. భీంసరిలో యువకుడు.. ఆదిలాబాద్ రూరల్ : మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన సిర్పురే సంతోష్(20) విద్యుదాఘాతంతో దుర్మరణం చెందాడు. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై జవాజి సురేశ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఉక్కాజీ, లక్ష్మి దంపతులకు ఐదు కుమారులు. చిన్నవాడైన సంతోష్ తల్లిదండ్రులతో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో పాలేరుగా పనిచేస్తూనే మరోవైపు కులవృత్తి చేపల వేటను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం తన ఇంటికి సరఫరా అవుతున్న విద్యుత్ తీగకు సపోర్టుగా ఉన్న జియవైరుపై బట్టలు ఆరేసేందుకు యత్నించాడు. ఆ వైరుకు కరెంట్ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే మరణించాడు. కుటుం బాన్ని పోషించే కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదన స్థానికులను కలచివేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.