ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం గుల్లమాడ పంచాయతీ వీఆర్‌ఏలు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది.
కుంటాల: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం గుల్లమాడ పంచాయతీ వీఆర్‌ఏలు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. వీఆర్‌ఏలు గంగాధర్, సూర్యలపై తహశీల్దార్ సంతోష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 1975 కు పూర్వం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన గిరిజనులకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను ఓటరు జాబితా ఆధారంగా ఇవ్వాలనేది నిబంధన.
అయితే, గుల్లమాడ పంచాయతీ అనుబంధ గ్రామం బూరుగుపల్లికి చెందిన సుమారు 43 మంది అనర్హులకు వీఆర్‌ఏలు లంచం తీసుకుని కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని విచారణలో తేలడంతో తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆర్‌ఐ ఇస్కారి, కార్యాలయ జూనియస్ అసిస్టెంట్ నగేష్‌లకు మెమోలు జారీ చేశారని తెలిసింది.