చిరంజీవి మేనేజర్‌ తల్లి కన్నుమూత! | Chiranjeevi Manager Gangadhar Mother Passed Away | Sakshi
Sakshi News home page

Gangadhar NS: చిరంజీవి మేనేజర్‌ తల్లి కన్నుమూత!

Published Sat, Oct 15 2022 8:31 PM | Last Updated on Sat, Oct 15 2022 8:36 PM

Chiranjeevi Manager Gangadhar Mother Passed Away - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి మేనేజర్‌ నరాలశెట్టి గంగాధర్‌ తల్లి సత్యవతి (పాపాయమ్మ) కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే! తాజాగా ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శివచెర్రీ తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. 'గంగాధర్‌ తల్లి సత్యవతిగారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అమ్మా.. నీ ఆత్మకు శాంతి కలుగు గాక! గంగాధర్‌ అన్న ధైర్యంగా ఉండు' అని ట్వీట్‌ చేశాడు.

కాగా తన తల్లి సత్యవతి కనిపించకుండా పోయిందని గంగాధర్‌ ఇటీవలే మీడియాకు తెలిపాడు. జ్ఞాపకశక్తి కోల్పోయిన కారణంగా ఇల్లు విడిచి వెళ్లిపోయిందని, ఎవరికైనా కనిపిస్తే తనకు తెలియజేయాలంటూ తల్లి ఫొటోను కూడా విడుదల చేశాడు. ఇంతలోనే ఆమె మృతి చెందిన వార్త బయటకు వచ్చింది. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చదవండి: తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు కృష్ణం రాజు కుమార్తె
ఇనయనే నా బాయ్‌ఫ్రెండ్‌ వెనకాల తిరుగుతోంది: సూర్య ప్రేయసి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement