పటాన్‌చెరు టౌన్, న్యూస్‌లైన్: భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భానూర్‌లో శనివారం చోటుచేసుకుంది. బీడీఎల్ సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2001లో పటాన్‌చెరు మండలం భానూ ర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కి కొండాపూర్‌కు చెందిన సబిత (28)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వివాహ సమయంలో సబిత తల్లిదండ్రులు కట్నం ఇచ్చారు. అదనపు కట్నం తేవాలని శ్రీనివాస్ భార్యను వేధించసాగాడు. శుక్రవారం కొండాపూర్‌లో జరిగే ఓ పెళ్లికి భార్యభర్తలు వెళ్లారు.
ఆక్కడ కూడా శ్రీనివాస్ అదనపు కట్నం తేవాలని భార్య సబితను కొట్టాడు. దీంతో మనస్థాపం చెందిన సబిత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ విషయాన్ని శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సబిత తల్లి కమలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసం సబితను హత్య చేసి ఆపై ఫ్యానుకు వేలాడదీశారని కమలమ్మ ఆరోపించారు.
కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య
Published Sat, Dec 7 2013 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement