నిర్మల్, న్యూస్‌లైన్ : పాక్‌పట్ల గ్రామానికి చెందిన కానుగుల గంగమ్మ, గంగారాం దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గంగాధర్ (25). ఆరు నెలల క్రితమే అతడికి పశువైద్యాధికారిగా ఉద్యోగం వచ్చింది. జైనథ్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు డెప్యూటేషన్‌పై సారంగాపూర్ మండలంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి నెల రోజుల క్రితమే నిజామాబాద్‌కు చెందిన అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్‌లో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఉదయం వ్యాయామం చేయడం అలవాటున్న గంగాధర్ ఎప్పటిలాగే శుక్రవారం తన ఇంటి డాబాపైకి వెళ్లాడు.
వ్యాయామం చేస్తున్న అతడు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా చేతులు పైకి లేపాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి గంగాధర్ అక్కడికక్కడే చనిపోయాడు. తీగలకు ప్లాస్టిక్ పైపులున్నా వర్షాలకు అవి దెబ్బతినడంతో షాక్ తగిలింది. ఎంతో భవిష్యత్ ఉందనుకున్న కొడుకు తమ కళ్ల ముందే మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది. కాగా, గంగాధర్ తల్లి గంగమ్మ కొంతకాలంగా మానసిక సంబంధిత సమస్యతో బాధపడుతోందని స్థానికులు తెలిపారు.
భీంసరిలో యువకుడు..
ఆదిలాబాద్ రూరల్ : మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన సిర్పురే సంతోష్(20) విద్యుదాఘాతంతో దుర్మరణం చెందాడు. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై జవాజి సురేశ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఉక్కాజీ, లక్ష్మి దంపతులకు ఐదు కుమారులు. చిన్నవాడైన సంతోష్ తల్లిదండ్రులతో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో పాలేరుగా పనిచేస్తూనే మరోవైపు కులవృత్తి చేపల వేటను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం తన ఇంటికి సరఫరా అవుతున్న విద్యుత్ తీగకు సపోర్టుగా ఉన్న జియవైరుపై బట్టలు ఆరేసేందుకు యత్నించాడు. ఆ వైరుకు కరెంట్ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే మరణించాడు. కుటుం బాన్ని పోషించే కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదన స్థానికులను కలచివేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
Published Sat, Oct 26 2013 4:35 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement