
మధుసూదన రెడ్డి మృతదేహం
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని కల్లెపెల్లి గ్రామానికి చెందిన దారం మధుసూదన్‌రెడ్డి(38) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో శుక్రవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఇంట్లో కూలర్ మరమ్మతు చేస్తుండగా మధుసూదన్‌రెడ్డికి విద్యుత్ షాక్ తగిలి పడిపోయాడు.
అది గమనించిన ఆయన భార్య కల్పన చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడకు వెళ్లేసరికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అభిలాష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment