
మోరిగావ్: అస్సాంకు చెందిన దివంగత గాయకుడు భూపేన్ హజారికాపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. భూపేన్ హజారికాకు కేంద్రం ఇటీవలే భారత రత్న ప్రకటించగా, ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సేవకుడు శివకుమార స్వామికి భారత రత్న ఇవ్వకుండా ఓ గాయకుడికి (హజారికా), ఆరెస్సెస్ సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన వ్యక్తి (నానాజీ దేశ్‌ముఖ్)కు అవార్డు ఇచ్చారని ఖర్గే విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో అస్సాం ప్రజల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment