అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామ, మరిదిపై ఓ ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కదిరి టౌన్ : అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామ, మరిదిపై ఓ ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కదిరి జౌకుపాళెం వీధికి చెందిన సుహాసిని అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త సాయిప్రసాద్, అత్తమామ అలివేలమ్మ, సుధాకర్, మరిది హరిప్రసాద్‌పై శనివారం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ గోపాలుడు తెలిపారు.