‘మీ సేవ’లో చోరీ
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మీ సేవ కేంద్రం, కన్నాపురం రోడ్డులోని సొసైటీ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు చొరబడి ఇనుప బీరువా తాళాలను పగులగొట్టి నగదు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి.. బుట్టాయగూడెం మీ సేవ కేంద్రంలో దొంగలు ప్రవేశించి రూ.3,500 నగదు అపహరించినట్టు నిర్వాహకులు ఉడతా లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే సొసైటీలో తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు ఇనుప బీరువాను పగులగొట్టి రూ.9,500 నగదు దొంగిలించినట్టు కార్యదర్శి కరాటం నాగంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ షేక్ హిమామ్ సంఘటనా స్థలాలను పరిశీలించారు. అర్ధరాత్రి వేళ చోరీలు జరిగి ఉండవచ్చని అన్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.