in buttayagudem
-
‘మీ సేవ’లో చోరీ
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మీ సేవ కేంద్రం, కన్నాపురం రోడ్డులోని సొసైటీ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు చొరబడి ఇనుప బీరువా తాళాలను పగులగొట్టి నగదు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి.. బుట్టాయగూడెం మీ సేవ కేంద్రంలో దొంగలు ప్రవేశించి రూ.3,500 నగదు అపహరించినట్టు నిర్వాహకులు ఉడతా లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సొసైటీలో తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు ఇనుప బీరువాను పగులగొట్టి రూ.9,500 నగదు దొంగిలించినట్టు కార్యదర్శి కరాటం నాగంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ షేక్ హిమామ్ సంఘటనా స్థలాలను పరిశీలించారు. అర్ధరాత్రి వేళ చోరీలు జరిగి ఉండవచ్చని అన్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
సాధికార సర్వే 90 శాతం పూర్తి
కేఆర్ పురం (బుట్టాయగూడెం): జిల్లాలో ప్రజా సాధికారిక సర్వే 90 శాతం పూర్తయ్యిందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. కేఆర్ పురం ఐటీడీఏలో బుధవారం సర్వేపై జంగారెడ్డిగూడెం డివిజన్లోని మండలాల తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సిగ్నల్ లేకపోవడం వల్ల 10 నుంచి 13 శాతం సర్వే మిగిలి ఉందన్నారు. దీనిని కూడా ఈనెల 13వ తేదీ సాయంత్రంలోపు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూరు శాతం సర్వే పూర్తిచేస్తామన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో ఏ గ్రామాల్లో సిగ్నల్ అందడం లేదు, ఎన్ని గ్రామాల్లో, ఎంత మందికి సర్వే చేయాల్సి ఉందనే విషయాలపై నివేదిక తయారుచేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్, ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
బుట్టాయగూడెం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంట ర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నాగులగూడెంకు చెందిన కొవ్వాసి బుచ్చిరాజు, చోడెం నరసింహరాజు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి రామారావుపేట సెంటర్ వైపు వస్తున్నారు. అలాగే జైనవారిగూడెంకు చెందిన కోర్సా రాంబాబు కూడా ద్విచక్రవాహనంపై రామారావు పేట సెంటర్ వైపు వస్తుండగా, ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు. వీరిలో చోడెం నరసింహరాజు, కోర్సా రాంబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.