cash theft
-
హ్యాట్సాఫ్.. ఏపీ పోలీసులు
సింగరాయకొండ : ఏపీ–తమిళనాడు సరిహద్దులోని ఆ ఊరు నేర సామ్రాజ్యానికి అడ్డా.. అది పోలీసులు కూడా ఛేదించలేకపోయిన ఘరానా దొంగల గడ్డ.. అలాంటి చోటుకు మన ఏపీ పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో ప్రాణాలకు తెగించి వెళ్లారు. వెళ్లడమే కాదు.. పద్మవ్యూహంలాంటి ఆ చోర సామ్రాజ్యం నుంచి కరడుగట్టిన ముగ్గురు దొంగల్ని పట్టుకున్నారు. ఇది పసిగట్టిన అక్కడి దొంగల ముఠా సభ్యులు పోలీసులను వెంబడించారు. ఈ ఛేజింగ్‌లో మన పోలీసుల చాకచక్యంతో పైచేయి సాధించి ముగ్గురు నేరస్తుల్ని పట్టుకొచ్చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌ని తలపించిన ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలు, సింగరాయకొండలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు ఘరానా దొంగలను తమిళనాడులోని మింజూరులో ప్రకాశం జిల్లా పోలీసులు వలపన్ని సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెల 11న ప్రకాశం జిల్లా ఒంగోలు టీచర్స్ కాలనీకి చెందిన పోతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంట్లో 60 సవర్ల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ నెల 12వ తేదీన సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడులో ముమ్మడిశెట్టి చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఎస్పీ మల్లికాగర్గ్ ఆదేశాల మేరకు డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో సింగరాయకొండ సీఐ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలు ఆధారంగా ఒంగోలు టీచర్స్ కాలనీ, సింగరాయకొండలో చోరీలకు పాల్పడిన ముఠా ఒకటేనని నిర్థారణకు వచ్చారు. ఇదే ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ గతంలో దోపిడీలకు పాల్పడినట్టు గుర్తించారు. నేర సామ్రాజ్యంలోకి వెళ్లి మరీ అరెస్ట్? ఈ ముఠా తమిళనాడులోని మింజూరు ప్రాంతానికి చెందినదని గుర్తించిన పోలీసు బృందాలు నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు పథకం పన్నారు. మింజూరు ప్రాంతం నేర సామ్రాజ్యానికి అడ్డా కావడం.. గతంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు పోలీసులపై విరుచుకుపడటం వంటి పరిస్థితులు తలెత్తాయి. గతంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి తమవల్ల కాక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలోని పోలీస్ టీమ్ దొంగలను అదుపులోకి తీసుకునేందుకు రెండు కార్లలో పక్కా ప్రణాళికతో వెళ్లారు. మింజూరు స్టేషన్ మహిళా ఎస్సై సహకారంతో దొంగల కోసం రోజంతా అక్కడ మాటు వేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపైనే దాడికి యత్నం చోరీ సొత్తును రికవరీ చేసే క్రమంలో ఆంధ్రా నుంచి పోలీసులు వచ్చారని తెలుసుకున్న దొంగల ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులపై మూకుమ్మడి దాడికి యత్నించినట్టు సమాచారం. అప్పటికే కొంత సొత్తును రికవరీ చేసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని వెంటనే తాము వచ్చిన వాహనాల్లోనే తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు మరో రెండు కార్లులో పోలీసుల్ని వెంబడించినట్టు తెలిసింది. ఆ తరువాత పోలీసుల వాహనాలు హైవేపైకి రావడంతో ముఠా తరఫు వ్యక్తులు వెనుదిరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరితే ఇల్లు దోచేశారు
పెదకూరపాడు: కరోనా రక్కసి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ కుటుంబం ఆస్పత్రిలో చేరగా, ఇదే అదునుగా భావించిన దొంగలు.. వారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెదకూరపాడు సీఐ గుంజి తిరుమలరావు కథనం ప్రకారం.. పాటిబండ్ల గ్రామస్తుడు గార్లపాటి పూర్ణచంద్రరావు తన ఇంట్లో చిల్లర కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల రెండో తేదీన పూర్ణచంద్రరావు కోవిడ్‌తో మృతిచెందాడు. దీంతో ఆయన భార్య నాగచంద్రిక, వారి ఇద్దరు కుమార్తెలు, తల్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈనెల 6న గుంటూరులోని అడవితక్కెళ్లపాడు క్వారంటైన్ సెంటర్లో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో వారికి నెగిటివ్‌గా తేలడంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగా, చోరీ జరిగిన విషయం వెల్లడైంది. బీరువాను ఇనుప బద్దతో తెరిచి, అందులోని 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదు దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించారు. గార్లపాటి నాగచంద్రిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోవిడ్ బారినపడి కుటుంబ పెద్దను కోల్పోయి, తల్లడిల్లుతున్న తమకు ఈ చోరీతో ఆర్థికంగానూ తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు దొంగలుగా మారారు
-
నగదు మాయం కేసు: రక్షకులే.. దొంగలై..
వీరవాసరం(పశ్చిమగోదావరి): ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు దొంగలుగా మారారు. పోలీస్‌స్టేషన్‌లో భ ద్రపరిచిన నగదును అహరించారు. వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో నగదు మాయమైన కేసులో నిందితులు పట్టుబడ్డారు. వీరవాసరంలో జిల్లా ఎస్పీ నారాయణనాయక్ శనివారం విలేకరులకు వివరా లు వెల్లడించారు. వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో ఉసురుమర్తి గంగాజలం, గొర్రెల గణేశ్వరరావు (గణేష్) కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. మండలంలోని మ ద్యం షాపుల సిబ్బంది బ్యాంకు సెలవులు కావడంతో ఈనెల 15న సాయంత్రం మద్యం అమ్మకాల సొమ్ము రూ.8,04,330ను ట్రంకు పెట్టెలో ఉంచి సీల్ వేసి పోలీస్‌స్టేషన్ లాకప్ గదిలో పోలీసుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. బ్యాంకులో జమ చేయ డానికి 17న ఉదయం 9 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ట్రంకు పెట్టెలో నగదు మాయమైంది. దీనిపై నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి పర్యవేక్షణలో పాలకొల్లు పట్టణ ఇన్స్పెక్టర్ సీహెచ్ ఆంజనేయులు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిందిలా.. పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఉసురుమర్తి గంగాజలం, గొర్రెల గణేశ్వరరావు (గణేష్) పథకం ప్రకారం చోరీకి సన్నద్ధమయ్యారు. డ్యూటీ లేని సమయంలో చోరీ చేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గంగాజలం ఈనెల 16న అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ముందుగా దాచిన ఇనుపపైపుతో లాకప్ గది, ట్రంకు పెట్టె తాళాలు పగులకొట్టి నగదు అపహరించాడు. అనుమానం రాకుండా వేరే లాకప్ గది తాళాన్ని ఈ లాకప్ గదికి వేశాడు. అలాగే ట్రంకు పెట్టెకు మరో తాళాన్ని వేశాడు. చోరీ సొత్తును వీరిద్దరూ పంచుకున్నారు. గణేష్ తన వా టా సొమ్మును వీరవాసరంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద పొదల్లో దాయగా, గంగాజలం గ్రామంలోని ప్రైవేటు కల్యాణ మండపం వద్దకు వచ్చి చెత్తలో డబ్బును దాచాడు. పోలీసులు దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని సొమ్ము రికవరీ చేశారు. ఇద్దరిదీ నేర ప్రవృత్తే మొదటి నిందితుడిగా ఉన్న ఉసురుమర్తి గంగాజలానిది పోలవరం మండలం పాత పట్టిసీమ. 2013లో చాగల్లులో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. 2020లో పాతపట్టిసీమలోని గెస్ట్‌హౌస్‌లో పేకాట ఆడుతూ ప ట్టుబడి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇటీవల వీరవా సరం పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చాడు. రెండో నిందితుడు గొర్రెల గణేశ్వరరావుది నల్లజర్ల మండలం అనంతపల్లి. తాడేపల్లిగూడెంలో విధులు నిర్వహి స్తూ అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడు. గతేడాది నుంచి వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో విధు లు నిర్వహిస్తున్నాడు. ఇద్దరిపై శాఖాపరమైన విచారణ పూర్తి చేసి డిస్మిస్ చేస్తామని, డ్యూటీలో అలక్ష్యంగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌పై శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నారాయణనాయక్ చెప్పారు. ఏలూరు సీసీఎస్ డీఎస్పీ కె.పైడేశ్వరరావు ఆధ్వర్యంలో భీమవరం సీసీఎస్ ఇ న్స్పెక్టర్ నాగరాజు, తాడేపల్లిగూడెం సీఐ ఆకుల ర ఘు, వీరవాసరం, ఆచంట, పోడూరు, యలమంచి లి ఎస్సైలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ నారాయణనాయక్ చెప్పారు. చదవండి: హత్య కేసు: గుర్తు తెలిపిన తాళం చెవి! భర్త చేష్టలతో విసుగుచెంది... -
‘మీ సొమ్ము ఎత్తుకెళ్తున్నాం బాధపడొద్దు’
లేఖ రాసి పెట్టి మరీ చోరీ చేసిన ఘనుడు నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): ‘మీ ఇంట్లో బంగారు నగలు, నగదును ఎత్తుకుపోతున్నాం.. బాధపడకండి, ఆ దేవుడు మీకు ఇంకా ఇస్తాడు’ అని లేఖ రాసి పెట్టి మరీ చోరీకి పాల్పడిన ఉదంతం నిజామాబాద్‌లో బుధవారం రాత్రి జరిగింది. నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన సురకుట్ల భాస్కర్ తండ్రి చిన్నయ్య ఇటీవల మృతి చెందాడు. ఆర్యనగర్‌లో ఉంటున్న భాస్కర్ అత్తగారు అతడిని బుధవారం నిద్ర కోసం తీసుకెళ్లారు. దీంతో నాందేవ్‌వాడలోని తన ఇంటికి తాళం వేసి భాస్కర్ భార్యాపిల్లలతో కలిసి అత్తగారింటికి వెళ్లగా.. రాత్రి తాళం తొలగించిన ఓ దొంగ బీరువాలో ఉన్న పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు.. రూ. 28 వేల నగదును ఎత్తుకు పోయాడు. వెళ్తూ వెళ్తూ ఓ చీటి రాసి పెట్టి వెళ్లాడు. అందులో ‘మీ బంగారం ఎత్తుకుపోతున్నాం బాధపడవద్దు.. దేవుడు మీకు ఇంకా ఇస్తాడు.. మీరు చూస్తూ ఉండండి’ అని రాశాడు. గురువారం ఉదయం వచ్చిన భాస్కర్ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగ రాసిన చీటిని స్వాధీనం చేసుకున్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ
అన్నానగర్: అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇంటి తాళాలు పగులగొట్టి 42 సవర్ల నగలు రూ. 22 వేల నగదు చోరీ చేసి పరారైన దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా రు. ఈ ఘటన సెమ్‌బణార్‌కోవిల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నాగై జిల్లా, మైలాడుదురై సమీపంలో ఉన్న సెమ్‌బణార్‌కోవిల్ నల్లాడై రోడ్డు ప్రాంతానికి చెందిన వ్యక్తి రంగనాథన్ (65). పూమ్పుహార్లో మాజీ ఎమ్మెల్యే అయిన ఇతను అన్నాడీఎంకేకు చెందినవాడు. గత రెండు రోజులకు ముందు రంగనాథన్, ఇంటికి తాళం వేసి భార్యతో చెన్నైకి వెళ్లి తన మనవడి పుట్టిన రోజు వేడుకలో కలుసుకొన్నారు. చెన్నై నుంచి తిరిగి ఆదివారం రోజు ఇంటికి వచ్చారు. అప్పుడు ఇంటి తాళాలు తెరచి ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. అనంతరం లోపలకు వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి, అందులో ఉన్న 42 సవర్ల నగలు, రూ. 22 వేల నగదును దుండుగుల చోరి చేసి పరారైనట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకొన్న మైలాడుదురై జయంట్ పోలీసు కమిషనర్ కలిదియర్తన్, సెంగునార్కోవిల్ పోలీసు ఇన్స్పెక్టర్ కు లోత్తుంగన్, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. అనంతరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి నగలు, నగదు చోరీ చేసి పరారైన దుండుగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరి జరిగిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
కారులో నగదు చోరీ
జవహర్‌నగర్: పార్కింగ్ చేసిన కారులో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ. 1.3 లక్షల నగదు, అరతులం బంగారం అపహరించుకుపోయారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాప్రా సాకెత్ ఓర్ల లక్ష్మీనర్సింహాగార్డెన్స్‌లో చోటుచేసుకుంది. క్రైం ఎస్సై నేతాజీ తెలిపిన ప్రకారం నగరంలోని యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సుజనాచౌదరి. ఈ నెల3న కాప్రా సాకెత్ సమీపంలోని ఓర్ల లక్ష్మిగార్డెన్స్లో ఈవెంట్ నిర్వహించడానికి సాయంత్రం ఏడు గంటల సమయంలో టీఎస్ 07 ఎఫ్‌సి 0650 నెంబర్ గల కారును గార్డెన్స్ ఆవరణలో పార్క్ చేశారు. ఆ తర్వాత కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 10 గంటల సయంలో కారు తాళాలు ఆమె దగ్గర నుంచి కనిపించకుండా పోయాయి. దీంతో మరో కారు తాళాలను మరుసటి రోజు(శనివారం) తీసుకువచ్చి చూసేసరికి కారుతాళాలు తీసి ఉన్నాయి. అప్పటికే ఆ కారులోని పర్సులో ఉన్న డబ్బు, బంగారం గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకు వద్ద నగదు చోరీ
పెద్దవడుగూరు (తాడిపత్రి) : పెద్దవడుగూరులోని ఆంధ్రా బ్యాంకు అవరణలో కాశేపల్లికి చెందిన కూళ్లాయిరెడ్డి అనే ఖాతాదారుడికి చెందిన రూ.14 వేల నగదు బుధవారం చోరీకి గురైంది. తన ఖాతా నుంచి రూ.24 వేలు డ్రా చేయగా రూ.2 వేల నోట్లను ఎంచుకుని జేబులో ఉంచుకున్నారు. మిగిలిన రూ.100 నోట్లను లెక్కిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రూ.14 వేలు నగదును చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులు, బ్యాంక్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఖాతాదారుల నగదు చోరీకి గురవడం ఆందోళన కలిగిస్తోంది. -
లారీ డ్రైవర్ నుంచి నగదు అపహరణ
ధర్మవరం రూరల్: జాతీయ రహదారిలో బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీలోని డ్రైవర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.11,500, సెల్‌ఫోన్, వాచ్ ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. బాధితుడు, హైవే పోలీసుల సమాచారం మేరకు... మహారాష్ట్రకు చెందిన లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. జాతీయ రహదారిలోని దాదులూరు-శీతారాంపల్లి వద్దకు రాగానే అర్ధరాత్రి అయింది. మూత్ర విసర్జన కోసం లారీని డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో బైక్‌పై అటుగా వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా డ్రైవర్ తలపై కట్టెతో కొట్టి రోడ్డు పక్కకు ఈడ్చుకెళ్లారు. ఆ తరువాత అతని జేబులోని నగదు, సెల్‌ఫోన్, వాచ్‌ను లాక్కెళ్లారు. హైవే పోలీసులు ఇచ్చిన సమాచారంతో డీఎస్సీ వేణుగోపాల్, సీఐ మురళీ కృష్ణ తమ సిబ్బందితో కలసి వెంటనే జాతీయ రహదారిపైకి వెళ్లి దుండగుల కోసం గాలించారు. -
‘మీ సేవ’లో చోరీ
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మీ సేవ కేంద్రం, కన్నాపురం రోడ్డులోని సొసైటీ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు చొరబడి ఇనుప బీరువా తాళాలను పగులగొట్టి నగదు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి.. బుట్టాయగూడెం మీ సేవ కేంద్రంలో దొంగలు ప్రవేశించి రూ.3,500 నగదు అపహరించినట్టు నిర్వాహకులు ఉడతా లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సొసైటీలో తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు ఇనుప బీరువాను పగులగొట్టి రూ.9,500 నగదు దొంగిలించినట్టు కార్యదర్శి కరాటం నాగంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ షేక్ హిమామ్ సంఘటనా స్థలాలను పరిశీలించారు. అర్ధరాత్రి వేళ చోరీలు జరిగి ఉండవచ్చని అన్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ
డోర్నకల్ (వరంగల్జిల్లా): సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను దొంగలు బీభత్సం సృష్టించారు. ఎక్స్‌ప్రెస్ రైలును ఆపి అందులో ఉన్న ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారం లాక్కెళ్లారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు జామున వరంగల్జిల్లా గుండ్రాతిమడుగు వద్ద జరిగింది. పదిమంది గుర్తు తెలియని దుండగలు యస్వంత్పూర్-పాట్నా వెళుతున్న సంఘమిత్రా ఎక్స్‌ప్రెస్ రైల్‌ను డోర్నకల్-మహబూబాబాద్ స్టేషన్ల మధ్య అలారం చైన్ లాగి ఆపారు. రైళ్లు ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి భారీగా బంగారం లాక్కెళ్లారు.ఈ దోపిడీ ఎస్2, ఎస్ 12 బోగిల్లో జరిగింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు
కర్నూలు జిల్లాలో ఘటన గోనెగండ్ల: గతంలో ఏటీఎంలలో నగదు చోరీలు చాలానే జరిగాయి. అయితే కర్నూలు జిల్లా గోనెగండ్లలో శుక్రవారం అర్ధరాత్రి ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. గ్రామం లో ఇండియా1 ఏటీఎం మిషన్‌ను దుండగులు తస్కరించారు. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఏటీఎం సెంటర్‌ను శుభ్రపరిచేందుకు వెళ్లిన మహబుబ్బీ ఈ విషయాన్ని గమనించి పోలీసులకు, ఏటీఎం నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ దేవేంద్రకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి డాగ్, క్లూస్ టీంను రప్పించారు. అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు మొదట ఏటీఏం సెంటర్ బయట వున్న సీసీ కెమెరా వైర్‌ను కత్తిరించి ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారు. డాగ్ స్క్వాడ్ ఏటీఎం సెంటర్ నుంచి పక్కనే ఉన్న షాపు యజమాని ఇంటి వద్ద కెళ్లి అక్కడి నుంచి చాంద్ సినిమా థియేటర్ సమీపంలోని వైన్‌షాపు వద్దకు వెళ్లి మళ్లీ ఏటీఎం సెంటర్ వద్దకే వచ్చి నిలిచిపోయింది. ఏటీఎం మిషన్‌లో రూ. 40 వేలు నగదు మాత్రమే ఉన్నట్లు ఏజెంట్ జగదీష్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఏటీఎం మిషన్ అపహరించారని పోలీసులు, ఇండియా 1 ఏటీఎం నిర్వాహకులకు ఉద యం సమాచారం అందిస్తే వారు మాత్రం మధ్యాహ్నం తాపీగా వచ్చారు. ఏటీఎం నిర్వాహకులు సంస్థలో పనిచేసే ఓ ఏజెంట్‌ను పంపి ఫిర్యాదు ఇప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నగల దుకాణంలో భారీ చోరీ
* 7 కిలోల వెండి ఆభరణాలు,రూ.80 వేల నగదు అపహరణ * సీసీ టీవీలో దృశ్యాలు నమోదు * తాండూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన తాండూరు: పట్టణంలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఓ దుండగుడు 7 కిలోల వెండి నగలతో పాటు రూ. 80 వేల నగదు అపహరించుకుపోయాడు. సీసీ టీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంగా జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. అర్బన్ ఎస్ఐ అభినవ చతుర్వేది కథనం ప్రకారం.. తాండూరు పట్టణంలోని ‘బాలాజీ బ్రదర్స్’ కాంప్లెక్స్‌లో నగల, బట్టల దుకాణం నడుస్తున్నాయి. వాటి యజమాని గోపాలకృష్ణ ఈనెల 1న రాత్రి తాండూరు మండలంలోని దస్తగిరిపేటలోని శ్రీదేవి,భూదేవి కల్యాణోత్సవానికి కుటుంబీకులతో సహా హాజరయ్యాడు. దుకాణాన్ని సిబ్బంది రాత్రి 9 గంటలకు మూసివేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిబ్బంది రఘు షాపు తెరిచాడు. దుకాణంలోని వెండి, బంగారు నగలున్న గది తలుపు తీసి ఉండటం, లోపల నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని అనుమానించి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని భావించి వెంటనే యజమాని గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చాడు. అర్బన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ అభినవ చతుర్వేది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుకాణం వెనుక భాగంలోని డ్రైనేజీ పైపుల ద్వారా దుండగుడు పాకుతూ దుకాణం ఉన్న రెండు అంతస్తుల భవనం పైకి ఎక్కాడు. పై అంతస్తులోని రేకుల షెడ్‌ను ధ్వంసం చేశాడు. ఇనుప తలుపును వంచి బట్టల దుకాణం ఉన్న రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మూడు గ్రిల్స్లకున్న తాళాలు విరగ్గొట్టి మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. రాత్రి 1:30 గంటల సమయంలో నగల దుకాణం గది వద్దకు వెళ్లాడు. అక్కడ అద్దాల తలుపునకున్న తాళం పగులకొట్టి లోపలికి వెళ్లాడు. సీసీ టీవీలో దుండగుడి కదలికలు నమోదయ్యాయి. నిందితుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి, చేతిలో టార్చిలైట్ పట్టుకున్నాడు. మొత్తం 7 కిలోల వెండి నగలతో పాటు క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.80వేల నగదును అహపరించి ఓ బ్యాగ్‌లో వేసుకొని పరారయ్యాడు. కాగా దుండగుడు లాకర్లో ఉన్న బంగారు ఆభరణాల జోలికి వెళ్లలేదు. చోరీ జరిగిన విధానం చూస్తే దుండగుడు దుకాణంలో ముందే రెక్కీ నిర్వహించి ఉండొచ్చని, అతడు ప్రొఫెషనల్ దొంగ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ ఘటనపై తమ సిబ్బందిపై అనుమానం లేదని యజమాని గోపాలకృష్ణ చెప్పాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ సమయంలో దుండగుడు తాగి పడేసిన నీళ్ల ప్యాకెట్లు, వండ్రంగి పనులకు ఉపయోగించే బాడ్షా పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
* సినీఫక్కీలో విరుచుకుపడ్డ దుండగులు * గార్డు నోరు, చేతులకు ప్లాస్టర్ అతికించిన వైనం కాకినాడ క్రైం : కాకినాడలో ముగ్గురు దుండగులు శనివారం అర్ధరాత్రి పేట్రేగిపోయారు. సినీఫక్కీలో ఏటీఎంలోకి చొరబడి సెక్యూరిటీ గార్డు నోటికి ప్లాస్టర్ అంటించి, అదే ప్లాస్టర్‌తో అతడి చేతులు కట్టేసి ఏటీఎం లోపల గదిలో బంధించారు. ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం లాకరు తెరుచుకోకపోవడంతో వెళ్లిపోయారు. సెక్యూరిటీ గార్డు, పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. పెదపూడి మండలం జి. మామిడాడకు చెందిన ద్వారంపూడి భాస్కరరెడ్డి ఓరియన్ సెక్యూర్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతడిని సంస్థ ప్రతి నిధులు కాకినాడ సూర్యారావుపేటలోని రామాలయం వీధిలో రాఘవేంద్రస్వామి కోవెల సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా నియమించారు. అతడు అర్ధరాత్రి ఒంటి గంటకు ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు మంకీ క్యాప్‌లు ధరించి ఏటీఎం వద్దకు వచ్చారు. ఇద్దరు దుండగులు వారి వద్ద ఉన్న గన్లతో గార్డు భాస్కరరెడ్డిని బెదిరించారు. మరో దుండగుడు అతడి నోటికి ప్లాస్టర్ అతికించాడు. అనంతరం అతడి చేతులను కట్టి ఏటీఎంలోని రూమ్‌లోకి తీసుకువెళ్లి బంధించారు. వారి వెంట తెచ్చుకున్న గునపంతో ఏటీఎంను బద్దలుగొట్టారు. లాకరు బద్దలుకాకపోవడంతో సుమారు గంటపాటు శ్రమించారు. సెక్యూరిటీ గార్డు తప్పించుకునే వీలులేకుండా అక్కడే ఉండి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎంతకీ సీక్రెట్ లాకరు తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి బైకుపై పరారయ్యారు. సుమారు మూడు గంటల సమయంలో బీట్ కానిస్టేబుళ్లు అటుగా వెళ్తుండడాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు భాస్కర రెడ్డి కట్లు తెంచుకుని బిగ్గరగా అరిచాడు. అక్కడికి చేరుకున్న కానిస్టేబుళ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయాన్ని టూ టౌన్ క్రైం పోలీసులకు తెలిపారు. క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. దీనిపై టూ టౌన్ క్రైం ఎస్సై అలీఖాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీకేరాయపురం చోరీ వారిపనేనా..? ఇదిలావుండగా శనివారం రాత్రి సామర్లకోట మండలం వీకే రాయపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.రెండు లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అయితే ఆ సంఘటన కూడా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరగడంతో కాకినాడలోని ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసిన దుండగులే వీకే రాయపురం ఆలయంలో చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పనిగా భావిస్తున్నారు.