కారులో నగదు చోరీ
Published Sun, Mar 5 2017 6:11 PM | Last Updated on Tue, Sep 4 2018 4:54 PM
జవహర్‌నగర్: పార్కింగ్ చేసిన కారులో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ. 1.3 లక్షల నగదు, అరతులం బంగారం అపహరించుకుపోయారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాప్రా సాకెత్ ఓర్ల లక్ష్మీనర్సింహాగార్డెన్స్‌లో చోటుచేసుకుంది.
క్రైం ఎస్సై నేతాజీ తెలిపిన ప్రకారం నగరంలోని యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సుజనాచౌదరి. ఈ నెల3న కాప్రా సాకెత్ సమీపంలోని ఓర్ల లక్ష్మిగార్డెన్స్‌లో ఈవెంట్ నిర్వహించడానికి సాయంత్రం ఏడు గంటల సమయంలో టీఎస్ 07 ఎఫ్‌సి 0650 నెంబర్ గల కారును గార్డెన్స్ ఆవరణలో పార్క్ చేశారు.
ఆ తర్వాత కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 10 గంటల సయంలో కారు తాళాలు ఆమె దగ్గర నుంచి కనిపించకుండా పోయాయి. దీంతో మరో కారు తాళాలను మరుసటి రోజు(శనివారం) తీసుకువచ్చి చూసేసరికి కారుతాళాలు తీసి ఉన్నాయి. అప్పటికే ఆ కారులోని పర్సులో ఉన్న డబ్బు, బంగారం గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement