
నిందితుడితో అటవీ సిబ్బంది
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): మండలంలోని ఎర్రగుంట పంచాయతీ శాంతినగర్ గ్రామంలో శుక్రవారం చుక్కల దుప్పి మాంసాన్ని అటవీ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. చండ్రుగొండ రేంజర్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో రేంజర్ రాముడు తెలిపిన వివరాలు..
శాంతినగర్ గ్రామానికి చెందిన మొడియం తిరుపతయ్య ఇంట్లో చుక్కల దుప్పి మాంసం ఉందన్న సమాచారంతో అటవీ అధికారులు తనిఖీ చేశారు. దుప్పి మాంసం దొరికింది. దానిని స్వాధీనపర్చుకున్నారు.
కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో ఎఫ్‌ఎస్‌ఓ లక్ష్మీనారాయణ, బీట్ ఆఫీసర్ లింగేశ్వర్, బేస్ క్యాంప్ సిబ్బంది దుగ్గిరాల శ్రీను, టి.శివ, మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment