సాక్షి, పెద్దపల్లి: సినీనటి పాయల్ రాజ్‌పుత్‌పై కేసు నమోదైంది. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించలేదని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు.
జూనియర్ సివిల్ ఇన్‌చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. (చదవండి: జగిత్యాలలో పాయల్ రాజ్‌పుత్ సందడి)
Comments
Please login to add a commentAdd a comment