
కోవిడ్ కారణంగా ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోయానని.. ఎంతో బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఆర్‌ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం తాను మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘నా జీవితంలో ఇదే అతి క్లిష్టమైన దశ. ఎంతో బాధగాఉంది. మానసిక కుంగుబాటుకు లోనయ్యా. గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది. నాలోని బాధను చెప్పడానికి మాటలు కరవయ్యాయి. నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయాను. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ తమ కుటుంబసభ్యుల్ని సంరక్షించుకోవాలని సూచిస్తున్నాను’ అని పాయల్ పోస్ట్ పెట్టారు.
కాగా, పాయల్ ప్రియుడు సౌరభ్ ఢింగ్రా తల్లి అనితా కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్త తనని ఎంతగానో కలచి వేసిందని పాయల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment