Minister KTR Responds to Block Fungus Patient in Twitter | బ్లాక్‌ఫంగస్‌ బాధితుడికి కేటీఆర్‌ అండ.. - Sakshi
Sakshi News home page

బ్లాక్‌ఫంగస్‌ బాధితుడికి కేటీఆర్‌ అండ..

Published Wed, Jun 2 2021 8:19 AM | Last Updated on Wed, Jun 2 2021 11:35 AM

Minister KTR Responds to Block Fungus Patient in Twitter - Sakshi

యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి): యైటింక్లయిన్‌కాలనీకి చెందిన అహ్మద్‌ మోహినుద్దీన్‌ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం గతనెల 27 హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బ్లాక్‌ ఫంగస్‌ వచ్చినట్లు తెలపడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సూచన మేరకు కేటీఆర్‌ను ట్విట్టర్లో వేడుకున్నారు.

కేటీఆర్‌ వెంటనే స్పందించి తన కార్యాలయ సిబ్బందిని పంపించి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాటు చేశారు. బ్లాక్‌ ఫంగస్‌ వైరస్‌ తగ్గడానికి సంబంధించిన ఇంజక్షన్‌ సైతం ఏర్పాటు చేసి అహ్మద్‌ కుటుంబానికి అండగా నిలిచినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.   

చదవండి: కరోనా సోకిన భార్య.. భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement