‘కోవాక్సీన్‌’ బిహార్‌ కోసమేనట!  | Minister KTR Answers Netizens Question On Twitter | Sakshi
Sakshi News home page

‘కోవాక్సీన్‌’ బిహార్‌ కోసమేనట! 

Published Fri, Oct 23 2020 2:31 AM | Last Updated on Fri, Oct 23 2020 2:31 AM

Minister KTR Answers Netizens Question On Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కేటీఆర్‌ గారూ ఇటీవల మీరు భారత్‌ బయోటెక్‌ను సందర్శించినప్పుడు కరోనా టీకా అయిన ‘కోవాక్సీన్‌’వేసుకున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇంతగా జనంలో తిరుగుతున్నా మీకు ఏమీ కాలేదు. లేదా ఇంకేదైనా కారణం ఉందా’అని ట్విట్టర్‌లో ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. దానికి కేటీఆర్‌ సమాధానం ఇస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. నేను కోవాక్సీన్‌ టీకా వేసుకోలేదు. అది బిహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారట’అని సమాధానం ఇచ్చారు. బిహార్‌లో అందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్‌ ఈ ట్వీట్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement