
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా కరోనా అందరిపై తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా సినీ, రాజకీయ నాయకులను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్‌తో సహా ఎంతో మంది మహమ్మారి కోరల్లో చిక్కుకోగా శుక్రవారం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖులందరూ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.
తాజాగా కేటీఆర్ ఆరోగ్యంపై సినీ నటి లక్ష్మి మంచు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే.. కేటీఆర్, మంచు లక్ష్మి మంచి సన్నిహితులన్న విషయం తెలిసిందే. అయితే మంత్రికి కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న ఆమె.. ‘త్వరగా కోలుకోవాలి బడ్డీ.. ఇప్పుడైతే నా సినిమాలన్నీ చూడు’ అంటూ పేర్కొంది. ఇక దీనిపై నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు.
అదే గనుక జరిగితే మంత్రి కేటీఆర్‌కు అసలు ఊపిరాడుతుందా అక్కా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరైతే ఓ అడుగు ముందుకేసి.. ‘‘నీ సినిమాలు చూడటం కంటే కరోనాతో ఉండటం బెటర్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంకొందరేమో.. ‘‘బడ్డీ ఏంది.. కేటీఆర్ గారు నీ దోస్తా.. ఒక రాష్ట్రానికి మంత్రి. గౌరవంగా మాట్లాడటం నేర్చుకో’’ అని ఉచిత సలహాలిస్తున్నారు. కాగా మంచు లక్ష్మి సరాదాగా వేసిన ఈ పంచ్‌లు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని మీరూ చదివేయండి..
చదవండి:
జిమ్ ట్రైనర్‌తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నటి
సీఎం కేసీఆర్ కుటుంబంలో కరోనా కల్లోలం
@KTRTRS get well soon buddy. Watch all my movies now 😇
— Lakshmi Manchu (@LakshmiManchu) April 23, 2021