
లక్నో : బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యే షా అలంపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను లైంగిక వేధింపులకు గురిస్తున్నాడన్న ఓ మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. యూపీలోని ముబారఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షా అలం.. గత కొంత కాలంగా స్థానిక మహిళలను లైంగిక వేధింపులకు గురిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతతేకాక ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని కూడా అతను బెదిరిస్తున్నారు. దీంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన ముబారఖ్‌పూర్ పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా స్థానిక ప్రజాప్రతినిధులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం యూపీలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment