
చనిపోయిన తన పెంపుడు శునకాన్ని చూపిస్తున్న శివమంగళ్
రాయ్‌పూర్ : అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాన్ని తన కొడుకులు అత్యంత కిరాతకంగా నరికి చంపారని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లోని సురజ్‌పూర్ జిల్లా బాట్గాన్‌లో చోటుచేసుకుంది.
ఆ వివరాలు.. రాయ్‌పూర్‌కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోడీ గ్రామానికి చెందిన శివమంగళ్(62) ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. పని కోసం బయటకు వెళ్లిన సమయంలో తన ఇద్దరు కొడుకులు పెట్‌డాగ్‌ను గొడ్డలితో నరికి చంపారని గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శునకం కళేబరంతో సైకిల్ తొక్కుకుంటూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అతని కొడుకు శివనాథ్ మాట్లాడుతూ.. తమ తల్లిపై దాడి చేసిందని, తీవ్రంగా గాయపరుస్తుందేమో అనే భయంతో ఆ శునకాన్ని చంపినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ వ్యాఖ్యలను శివమంగళ్ ఖండించాడు. తన శునకం ఎవరికి హాని చేయదని, అందరితో ప్రేమగా ఉంటుందని పేర్కొన్నాడు. బెయిల్‌పై నిందితులు విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment