రాయదుర్గం రూరల్ : అనంతపురం జిల్లా పార్వతీనగర్‌కు చెందిన శ్రీదేవి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని ఆమె అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు ఆదివారం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పన్నెండేళ్ల కిందట శ్రీదేవి పెళ్లి బెంగళూరుకు చెందిన మంజునాథతో కాగా, అప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్త శ్యామలమ్మ, బావ రవి వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కట్నం కోసం తన సంసారంలో చిచ్చుపెట్టారని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.