రెండు కేజీల వెండి, బంగారు రూపు అపహరణ | ORNAMENTS ARE THEFT | Sakshi
Sakshi News home page

రెండు కేజీల వెండి, బంగారు రూపు అపహరణ

Published Thu, Dec 8 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

రెండు కేజీల వెండి, బంగారు రూపు అపహరణ

రెండు కేజీల వెండి, బంగారు రూపు అపహరణ

నాయుడుగూడెం (పెదపాడు) : మండలంలోని నాయుడుగూడెంలోని ఓ ఇంటిలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. రెండు కేజీల వెండి, బంగారు రూపు అపహరించుకుపోయారు.

నాయుడుగూడెం (పెదపాడు) : మండలంలోని నాయుడుగూడెంలోని ఓ ఇంటిలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. రెండు కేజీల వెండి, బంగారు రూపు అపహరించుకుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. నాయుడుగూడెం గ్రామానికి చెందిన  మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కట్నేని లక్ష్మీనారాయణ చౌదరి ఇంటి గోడ దూకి లోపలకు ప్రవేశించిన దుండగులు, ఎడమవైపు ఉన్న గేటు కిటీకీ ఊచలు తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. దేవుడి మందిరంలోని పాత బీరువా తెరిచి అందులోని సుమారు రెండు కేజీల వెండి వస్తువులు, బంగారు రూపు అపహరించుకుపోయారు. సమాచారం తెలిసిన పెదపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పెదపాడు ఏఎస్సై సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement