వివాదంలో రష్మీ సినిమా! | Producer Files Case On Anthaku Minchi Hero | Sakshi
Sakshi News home page

సినీ హీరోపై నిర్మాత ఫిర్యాదు!

Published Fri, Aug 24 2018 8:28 PM | Last Updated on Sat, Aug 25 2018 8:55 PM

Producer Files Case On Anthaku Minchi Hero - Sakshi

అంతకు మించి హీరో జై, హీరోయిన రష్మీ

సాక్షి, హైదరాబాద్‌: సతీష్‌ జై, రేష్మి జంటగా నటించి శుక్రవారం విడుదలైన అంతకుమించి సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆ సినిమా నిర్మాత బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకృష్ణాక్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత గౌరీకృష్ణప్రసాద్‌ అంతకుమించి సినిమాను రిజిస్టర్‌ చేయించాడు. సినిమాను మొదలుపెట్టిన ఆయన మధ్యలో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తడంతో కమలాపురి కాలనీకి చెందిన సతీష్‌ జై ఈ సినిమాను తానే హీరోగా, నిర్మాతగా పూర్తిచేయడానికి ముందుకొచ్చాడు. ఇందులో భాగంగానే సినిమా నిర్మాణానికి అవసరమైన రూ.50లక్షల పెట్టుబడిని ఇప్పటికే తాను పెట్టినట్లు గౌరీకృష్ణప్రసాద్‌ హీరోకు తెలియజేశాడు. ఆ డబ్బులు ఇవ్వడానికి అంగీకిరంచిన సతీష్‌ సినిమాను పూర్తిచేశాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో గౌరీకృష్ణప్రసాద్‌ హీరో సతీష్‌జాయిను నిలదీయగా స్పందించలేదు. దీంతో బాధిత నిర్మాత కోర్టును ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో కోర్టు ఈ సినిమాను సెప్టెంబర్‌ నాలుగు వరకు విడుదల చేయవద్దంటూ తీర్పున్చిందని అయితే తీర్పుకు వ్యతిరేకంగా సినిమాను విడుల చేశారని గౌరీకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా డబ్బులు ఇస్తానని నమ్మించిన సతీష్‌ ముందుగానే ఈ సినిమాను విడుదల చేశారని ఇదేమిటని నిలదీస్తే బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. తనను మోసం చేయడమే కాకుండా కోర్టును తీర్పును పక్కదోవ పట్టించిన సతీష్‌పై కేసు నమోదుచేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  బంజారాహిల్స్‌ పోలీసులు హీరో సతీష్‌జాయిపై క్రిమినల్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement