బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరొకరిపై పోలీసులకు కేసు నమోదైంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతి, ముడా అధికారులతోపాటు మైసూరు జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఈ ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కృష్ణ కర్ణాటక గవర్నర్, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ కూడా రాశారు.
స్నేహమయి కృష్ణ ఫిర్యాదు మేరకు.. సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున్ ఇతర ప్రభుత్వ, దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో 2004లో అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సీఎం సతీమణి పార్వతి, మల్లికార్జున్, మరో వ్యక్తి ఈ పత్రాలను ఉపయోగించి ముడాకు చెందిన కోట్లాది రూపాయలను మోసం చేశారని ఆరోపించారు.
తన ఫిర్యాదుపై పోలీసులు అంగీకారపత్రం అందించారని, కానీ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినందున ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆమె చెప్పారు.తన ఫిర్యాదు మేరకు ఏడు రోజుల్లోగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త పోలీసులను కోరారు.
కాగా 2021లో రాష్ట్రంలో బీజేపీ హయాంలో సిద్దరామయ్య భార్య ముడా ఆర్డర్‌కు లబ్ధిదారుగా ఉన్నందున భూ కేటాయింపుల కుంభకోణం వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో ఆమెకు సంబంధించిన 3.16 ఎకరాల భూమిని అక్రమంగా సేకరించినందుకు పరిహారంగా... మైసూరులోని ప్రధాన ప్రదేశాలలో 38,284 చదరపు అడుగుల భూమిని తనకు కేటాయిచారు.
మైసూరులోని కేసరే గ్రామంలోని 3.16 ఎకరాల భూమిని సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకోగా.. పార్వతికి 2021లో బీజేపీ దక్షిణ మైసూర్‌లోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్ 3, 4వ దశ లేఅవుట్‌లలోని సైట్‌లను ఆమెకు పరిహారం చెల్లించింది, ఇది కేసరే గ్రామంలోని అసలు భూమి కంటే చాలా ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి.
అయితే, ఈ కేటాయింపును గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని పేర్కొంటూ సిద్ధరామయ్య సమర్థించారు. కేసరెలోని దేవనూరు 3వ స్టేజీ లేఅవుట్‌లో స్థలాలు అందుబాటులో లేకపోవడంతో విజయనగరంలో ఉన్న స్థలాలకు పరిహారం చెల్లించాలని ముడా నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment