
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, గుంటూరు ఈస్ట్: మోసపూరితంగా ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లిచేసి, ఆపై బెదిరింపులకు దిగిన ఘటనపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాతగుంటూరుకు చెందిన యువకుడికి తాడికొండకు చెందిన యువతితో 2019లో పెళ్లయింది. ఎంతకూ పిల్లలు కలగకపోవడంతో ఇద్దరూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ పరీక్షల్లో యువతి మహిళ కాదని, ట్రాన్స్‌జెండర్ అని నిర్ధారణ అయింది. దీంతో ఇదేమిటని ప్రశ్నించిన యువకుడిని మామ, అత్త, భార్య కలిసి బెదిరించారు. దీంతో పాత గుంటూరు పోలీసులకు బుధవారం బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి.. మాయ మాటలతో లైంగిక దాడి)