
సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓవీడియో సంచలనం కలిగిస్తోంది. ఆ వీడియోలో వైన్ గ్లాస్‌లో డ్రింక్ తాగేశాక... గ్లాస్‌ను నెత్తికేసి కొట్టుకుంది. దీంతో చేతిలోని గ్లాస్ ముక్కముక్కలుగా పగిలిపోయింది. అదృష్టవశాత్తూ ఆమెకు గాయాలు తగల్లేదు. తాను తీవ్రవత్తడిలో ఉన్నట్లు, అలుపెరగక పనిచేసినట్టు అర్థం వచ్చేలా ఆ రోజును ఒక బ్యాడ్ డే అని ప్రస్తావిస్తూ ఈ వీడియో పోస్టు చేశారు.
ఆ వీడియో చూసిన అభిమానులు మాత్రం షాక్‌కు గురయ్యారు. ఇలాంటి పనులు చేయొద్దంటూ కొందరు అభిమానులు హితవు పలికారు. అందరికి రోల్ మోడల్‌గా ఉండాల్సిన ప్రియాంక ఇలాంటి పనులకు దూరంగా ఉండాలంటూ సూచించారు. మరి కొందరు ప్రియాంక నువ్వు పిచ్చి దానివైపోయావా అంటూ మండిపడ్డారు. మరి కొందరు అభిమానులు ప్రియాంకకు ఏమైనా జరిగితే తట్టుకోలేము అనే విధంగా కామెంట్లుపెట్టారు. మీరు బాగానే ఉన్నారా మేడమ్ అంటూ క్షేమసమాచారాలు ఆరాతీశారు.
ఏదేమైనా ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కు వెళ్లాక చాలా కఠినంగా తయారైనట్టు కనిపిస్తోంది. రోజువారి షూటింగ్‌లతో తీవ్ర వత్తిడి ఎదర్కొంటోందని అభిమానులు అందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియాంక క్వాంటికో సిరీస్ చేస్తోంది. ఇందులో యాక్షన్ సీన్లు చేసి అలవాటు అయిపోయిందో ఏమో గ్లాస్‌ను అవలీలగా పగలకొట్టేసింది. అయితే ఈ వీడియోపై మరికొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment